నయారా పెట్రలో డీజల్ పై 10రుపాయలు ఆధనంగా వసూల్ చేస్తు ప్రజల జేబులను,లెక్కలు చూడక డీలర్లను మోసం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ నయారా డీలర్స్ ఆసోసియోషన్ అధికార ప్రతినిధి సిహెచ్.శ్రీనివాసయాదవ్ అన్నారు.గురువారం స్థానిక సిద్దార్థ నగర్ నయారా డివిజనల్ కార్యాలయ వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతు నయారా యాజమాన్య ప్రజల్ని,డీలర్ల ను మోసం చేస్తుందని ఆరోపించారు.నయారా కంపెనీ అవలంబిస్తున్న విధానల వలన డీలర్లు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని అవేధన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో 360 మంది డిలర్లు ఉన్నారని ఆ బంకుల్లో చేసే వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని తెలిపారు.డిలర్ షిప్ ఇచ్చిన ఉత్తర్వుల పేపర్ తప్ప ఇంతవరకు సూచనలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.పెట్రోల్ కోరత ఉందని యాజమాన్యం పెట్రోల్ డీజిల్ సరఫరా సరైన గ్గా చేయలేదని ఆరోపించారు. కేంద్ర పెట్రోలియం శాఖవారిని సంప్రదించగా పెట్రోల్ డిజిల్ సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఆ పెట్రోల్ ను విదేశాలకు తరలించి అధిక లాభలను పోందుతున్నారని అన్నారు.అంతే కాక పెట్రోల్ మరియు డీజిల్ పై అదనంగా రూ. 10 రూపాయలు వసూలుచేస్తూ ప్రజలను దోచుకుంటున్నారని అన్నారు. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని నయారా పెట్రోల్ పంప్ డీలర్లు తెలిపారు. అనైతిక విధానాలతో డీలర్లను విజయవాడ నయారా డివిజన్ ఉద్యోగులు వేదిస్తున్నారని ఆరోపించారు. వివిధ చార్జీల రూపంలో డీలర్లను,ప్రజలనునిట్టనిలువునా ముంచుతున్నరని అన్నారు.కంపెనీ నిరంకుశ నిర్ణయాలకు మరియు డీలర్ల పై అణిచివేత చర్యలకు వ్యతిరేకంగా ఈ రోజు విజయవాడ నయారా డివిజినల్ ఆఫీస్ వద్దకు చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపు మెరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏత్తున హజరయ్యారు.ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా డిలర్ వేణుగోపాల్, రావిపాటి శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.