దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమం అందిస్తూ ముందుకు దూసుకుపతోంది వైయస్ జగన్ ప్రభుత్వం. ఎన్నికల సంద్భంగా ఇచ్చిన హామీలను 98.8శాతం మేర అమలుచేసిన ఏకైన ప్రభుత్వం … వైయస్ జగన్ ప్రభుత్వం. నవరత్నాలలో పాటు దాదాపు 145 సంక్షేమ పథకాలను అమలు చేసి… పేదల అభయున్నతికి పాటుపడింది. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఓ వైపు సంక్షేమం అందిస్తూ… మరో వైపు వివిధ రంగాల్లో ఏపీని దేశంలోనే అగ్ర్థానంలో నిలిపింది. జీఎస్డీపీలో ఏపీనే దేశంలో అగ్రగామిగా కొనసాగుతోంది. అందుకే మొన్న విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో సుమారు రూ.13.5లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను పెట్టడానికి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు ఏపీకి వచ్చారు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎ్సార్సీపీ సోషియల్ మీడియా భావించింది.. వచ్చే ఎన్నికలలో మళ్ళీ అధికారంలోకి రావాలని ఇప్పటి నుంచే అన్ని విధాలుగా సమాయత్తం అవుతోంది జగన్ ప్రభుత్వం. అందుకే వైయస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు #YSRCPAgain2024 హ్యాష్‌టాగ్‌తో ట్విటర్లో ట్రెండింగ్‌ను ప్రారంభించారు. ప్రారంభమైన పది నిమిషాల్లోనే ఈ ట్రెండింగ్ జాతీయస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. తన నాలుగేళ్ళ పాలనలో వైయస్ జగన్ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు ఆయన రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన సమాచారంతో కూడిన ట్వీట్లను వైయస్సార్సీపీ కార్యకర్తలు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్స్‌కు దేశవ్యాప్తంగా భారీగా వ్యూవ్స్ వచ్చాయి. కాగా ఇటీవలి కాలంలో ట్విట్టర్‌లో ట్రెండింగ్స్‌లో వైయస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం ఉధృతంగా వ్యవహరిస్తోంది. గతేడాది వైయస్ జగన్ జన్మదినం సందర్భంగా జరిగిన ట్రెండింగ్‌లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది.