‘యాధ్గిరి & సన్స్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో ట్రైలర్ ఆవిష్కరించిన ‘భీమ్లా నాయక్’ దర్శకుడు
శ్రీ వేంకటేశ్వర క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అనిరుధ్, యశస్విని జంటగా బిక్షపతి రాజు పందిరి దర్శకత్వంలో.. చంద్రకళ పందిరి నిర్మించిన రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ స్టోరీ ‘యాద్గిరి & సన్స్’. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ‘భీమ్లా నాయక్’ దర్శకుడు సగర్. కె. చంద్ర చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో..
హీరో అనిరుధ్ మాట్లాడుతూ.. ‘‘ఇది నా డెబ్యూ చిత్రం. ఈ అవకాశం నాకు రావడానికి కారణం కో-డైరెక్టర్ అమర్‌గారు. ఆయనకి, డైరెక్టర్ భిక్షపతి రాజుగారికి థ్యాంక్స్. ఎన్నో విషయాలు చెప్పారు. ఎంతగానో మోరల్ సపోర్ట్ అందించారు. ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్స్‌తో తెరకెక్కింది. అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. థియేటర్‌కి వచ్చి సినిమా చూసి వెళ్లేటప్పుడు.. ఒక మంచి సినిమా చూశామనే ఫీలింగ్ ఖచ్చితంగా ఈ సినిమా ఇస్తుంది. ట్రైలర్ విడుదల చేసిన సాగర్ కె చంద్రగారికి, వేడుకకు వచ్చిన ఇతర అతిథులకు థ్యాంక్స్.