కమెడియన్స్ హీరోగా మారి బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించిన వారు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది వున్నారు. బుల్లితెరపై రాణించిన కమెడియన్స్ కూడా సోలో హీరోగా వెండితెరపై తమ సత్తా చాటుకున్నారు. వీరి బాటలోనే మరో బుల్లితెర నటుడు రామ్ ప్రసాద్ ‘w/o అనిర్వేశ్’ మూవీతో మన ముందుకు వచ్చారు. అతని సరసన సాయి ప్రసన్న, నజియా ఖాన్ నటించారు. ఇతర పాత్రల్లో జెమినీ సురేస్, కిరిటి, సాయి కిరణ్, కిశోర్ రెడ్డి, వెంకట్ దుగ్గిరెడ్డి తదితరులు నటించారు. ‘ది డెవిల్స్ చైర్’ సినిమాతో ప్రామిసింగ్ దర్శకునిగా గుర్తింపు పొందిన గంగ సప్తశిఖర ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా… గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై వెంకటేశ్వర్లు, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్రలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.
స్టోరీ లైన్… అనిర్వేశ్(జబర్దస్త్ రామ్ ప్రసాద్)… మైథిలీని(నజియా ఖాన్)ను గాఢంగా ప్రేమిస్తూ వుంటాడు. అయితే ఆమెను కిరాతకంగా చంపబడుతుంది. అందుకు రాబర్ట్(సాయి కిరణ్), విచెలిత(సాయి ప్రసన్న), ధనుర్భాక్షి(కిరిటి), వరదరాజులు(జెమిని సురేష్) కారణమని అనిర్వేశ్ గుర్తించి… వారి మీద ఎలా రివేంజ్ తీర్చుకున్నారనేదే ‘w/o అనిర్వేశ్’ మిగతా కథ. ఇది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా ఎలావుందంటే… సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ సినిమాలతో ఆడియన్స్ ను అలరించే సినిమాలు ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. దీనికి కారణం… ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలను ఆదరిస్తున్నారు. మర్డర్ మిస్టరీ ప్లాట్ కి… కాస్త అడల్ట్ డ్రామా కంటెంట్ ను జోడించి యూత్ ను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను తెరకెక్కించారు. భార్య వేధిస్తోందంటూ భర్త… భర్త వేధిస్తున్నాడంటూ భార్య… వీరిద్దరూ తోడుదొంగలు… నన్ను భర్తడే పార్టీ పేరుతో ఇంటికి పిలిచి… నేను, నా ప్రేయసి ఏకాంతంగా ఉన్న సన్నివేశాలను వీడియో తీసి బెదిరిస్తున్నారంటూ… మరో వ్యక్తి ఫిర్యాదు.. ఇలా ట్రయాంగిల్ లో జరిగే స్టోరీకి అడల్ట్ కంటెంట్ ను కాస్త జోడించి… సినిమాను ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవ్వకుండా చూసేలా తెరకెక్కించా. ఇది యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో రామ్ ప్రసాద్, సాయి ప్రసన్నల మధ్య వచ్చే ఎపిసోడ్స్ రామ్ ప్రసాద్ లోని మరో కోణాన్ని భయట పెడతాయి.
ఇక ఇంటర్వెల్ తరువాత వచ్చే సీన్స్ కొన్ని మరీ బోల్డ్ గా వున్నాయి. ఆ తరువాత ప్రీ క్లైమాక్స్ నుంచి అసలు కథ రివీల్ అవుతుంది. వీరి ముగ్గురి మధ్య ఉన్న సంబంధం… అలాగే సి.ఐ.వరదరాజులు అసలు పాత్ర ఏమిటి అనేది క్లైమాక్స్ లో రివీల్ చేయడంతో… ఈ చిత్రం అసలు సిసలైన సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ అనిపించుకుంటుంది. దర్శకుడు ఎక్కడా పాత్రలపై అనుమానం రాకుండా… చివరిదాకా అసలు విషయంలో సస్పెన్స్ ను చివరి దాకా క్యారీ చేయడం నిజంగా దర్శకుడి ప్రతిభకు అద్దం పడుతుంది. స్క్రీన్ ప్లే సామాన్య ప్రేక్షకులకు కొంత కన్ ఫ్యూజన్ కలిగించేలా వున్నా.. ఓవరాల్ గా ‘w/o అనిర్వేశ్’ ప్రేక్షకులకు కావాల్సినంత థ్రిల్ ను ఇస్తుందనడంలో సందేహం లేదు.
ఇప్పటి వరకు కామెడీతోనే అలరించిన జబర్దస్త్ రామ్ ప్రసాద్… ఇలాంటి క్రైం బేస్డ్ సినిమాలో నటించి తనలోని మరో సీరియస్ కోణాన్ని ప్రేక్షకులకు చూపించారు. అనుమానపు మొగుడిగా శాడిస్ట్ పాత్రలో బాగా ఒదిగిపోయి నటించారు రామ్ ప్రసాద్. అలాగే ఇంటర్వెల్ తరువాత వచ్చే రెండు వేరియేషన్స్ వున్న పాత్రల్లోనూ బాగా వేరియేషన్ చూపించారు. అతనికి జంటగా నటించిన సాయి ప్రసన్న కొన్ని బోల్డ్ సీన్స్ తో ఆకట్టుకుంటుంది. ఇక నజియా ఖాన్ హోమ్లీ గాళ్ గా చాలా క్యూట్ గా కనిపించి మెప్పించింది. కిరీటి క్యారెక్టర్ కూడా చివరి దాకా బ్యాగా క్యారీ అయింది. అతని పాత్రే సినిమాకి ప్రధాన బలం. రాబర్ట్ పాత్రలో సాయి కిరణ్ కోనేరి ఆకట్టుకున్నాడు. సీఐ పాత్రలో జెమిని సురేష్ చివరి దాకా కనిపించి ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
దర్శకుడు గంగ సప్తశిఖర… ఎంచుకున్న ప్లాట్ బాగుంది. దాని చుట్టూ రాసుకున్న స్క్రీన్ ప్లే కూడా చాలా గ్రిప్పింగ్ గా వుంది. ఎక్కడా అనవసరపు సీన్లతో ల్యాగ్ లేకుండా సినిమాను చాలా క్రిస్పీగా నడిపించారు. యూత్ కు కావాల్సిన కంటెంట్ తో సినిమాను తెరమీద చూపించారు. గతంలో అదిరే అభితో ‘ది డెవిల్స్ ఛైర్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ ను తీశారు. దానికి ఏమాత్రం సంబంధంలేని ఓ క్రైం బేస్డ్ డ్రామాతో ఈ చిత్రాన్ని తెరకెక్కించి మరోసారి విజయం సాధించారు. ఈ చిత్రానికి తగ్గట్టుగానే విజువల్స్ ఉన్నాయి. రొమాంటిక్ సన్నివేశాలను యూత్ ను బాగా ఆకట్టుకునేలా చిత్రీకరించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంగేజింగ్ గా వుంది. ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా వుంది. నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా సినిమాని క్వాలిటీగా నిర్మించారు. క్రైం థ్రిల్లర్స్ ఇష్టపడే ప్రేక్షకులు ఈవారం ఈ సినిమాని చూసేయొచ్చు.
రేటింగ్: 3