తిరుపతి యస్.వి ఆడిటోరియం నందు సైబర్ నేరాలు, వాహన రక్షణ పరికరము, సీసీ కెమెరాలు వాటి ఉపయోగాలు, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం మరియు జి.పి.యస్ ట్రాకింగ్ ఉపయోగించి తమ వాహనాలను ఏ విధంగా దొంగతనం కాకుండా కాపాడుకోవచ్చు అనే అంశాలపై అవగాహన కార్యక్రమం తిరుపతి ప్రజలకు నిర్వహించబడును. ఈ వినూత్న కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనవలసిందిగా తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ వారు కోరుచున్నారు.
ఈ కార్యక్రమాన్ని తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి వెంకట అప్పల నాయుడు ఐ.పి.యస్ గారి అధ్యక్షతన నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమలో తిరుపతి ప్రజలకు సైబర్ నేరాలు, వాహన రక్షణ పరికరము మరియు, జి.పి.యస్ ట్రాకింగ్ ఉపయోగించి తమ వాహనాలను ఏ విధంగా దొంగతనం కాకుండా కాపాడుకోవచ్చు, సీసీ కెమెరాలు వాటి ఉపయోగాలు, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం మరి కొన్ని ముఖ్య విషయాలు గురించి అవగాహన కల్పించి ప్రజలను చైతన్యపరిచి తిరుపతి పట్టణాన్ని ఆదర్శ పట్టణముగా తీర్చిదిద్దాలన్న ముఖ్య ఉద్దేశముతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమంలో భద్రతకు సంబంధించిన సిసి కెమెరాస్ వాహన రక్షణ డివైస్, జి.పి.యస్ ట్రాకింగ్ డివైస్, అగ్నిమాపక పరికరాలు మరియు ఫైర్ అలారం పరికరాలను చూపడం జరుగుతుంది. రక్షణ డివైస్ కు సంబందపడిన వెండర్స్ (అమ్మక దారులు) ఈ కార్యక్రమంలో పాల్గొని స్టాల్స్ ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రజలందరూ కోవిడ్ నిభందనలను పాటిస్తూ విరివిగా పాల్గొని సంబందిత రక్షణ డివైజ్ ల గురించి తెలుసుకొని చైతన్యం చెందాలని ఈ సందర్భంగా తిరుపతి అర్బన్ జిల్లా పోలీసుల మనవి.
వెండర్స్ (అమ్మక దారులు) స్టాల్స్ ఏర్పాటు కొరకు సంప్రదించ వలసిన నంబర్లు.
Pradeep kumar Reddy, SI 8639920769.
Ramakrishan, SI 9490000413.