• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

హైకోర్టుకు చేరిన శ్రీవారి లడ్డూ వివాదం

admin by admin
September 20, 2024
in politics
0 0
0
హైకోర్టుకు చేరిన శ్రీవారి లడ్డూ వివాదం
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఏపీ హైకోర్టుకు చేరిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం హైకోర్టుకు చేరింది. శ్రీవారి లడ్డూ వ్యవహారంలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై దుష్ర్పచారం జరుగుతోందంటూ హైకోర్టును ఏపీ మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆశ్రయించారు. ప్రసాదం తయారీకి జంతువుల కొవ్వు, చేప నూనె వాడారంటూ వైఎస్ జగన్‌పై జరుగుతున్న విష ప్రచారాన్ని ఆపేలా ఆదేశించాలని ఆయన హైకోర్టును కోరారు. దీనిపై వెంటనే కమిటీ వేసి విచారించాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. అయితే స్పందించిన హైకోర్టు ఇప్పుడు అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదని, వచ్చే బుధవారం విచారణ చేపడతామని తెలిపింది.

జగన్‌పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు..

మరోవైపు వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై కేంద్ర హోంశాఖకు ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు, చేప నూనె వాడి జగన్ హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ అధినేత తన చర్యలతో హిందువుల ఆత్మను హత్య చేశారని, వారి నమ్మకాలు, విశ్వాసాలను, తిరుమల ఆలయం పవిత్రతను ఘోరంగా మంటగలిపారని అన్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖతోపాటు ఏపీ, ఉత్తర్ ప్రదేశ్ డీజీపీలకు వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు.

వైసీపీ అధినేత జగన్‍తోపాటు అప్పటి టీటీడీ పాలకవర్గం, జంతువుల కొవ్వు నెయ్యిని సరఫరా చేసిన కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి చర్యలకు జగన్ పాల్పడ్డారని, విచారణ చేసి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫ్యాన్ పార్టీ అధినేతతోపాటు ఇందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరిపై భారత న్యాయ సంహితలోని 152, 192, 196, 298, 353 సెక్షన్ల కింద వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కూడా జగన్ మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది వినీత్ జిందాల్ విజ్ఞప్తి చేశారు.

Previous Post

ఉచిత ఇసుక నూతన పోర్టల్ ను ఆవిష్కరించిన సిఎం

Next Post

సొల్లు పురాణం… గొర్రె పురాణం

Next Post
సొల్లు పురాణం… గొర్రె పురాణం

సొల్లు పురాణం... గొర్రె పురాణం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’
movies

మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

by admin
September 3, 2026
0

...

Read more
ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

September 3, 2026
ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..

ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..

September 1, 2026
‘ధర్మస్థల నియోజకవర్గం’ “ఆది” అంత గొప్ప సినిమా అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో – స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్

‘ధర్మస్థల నియోజకవర్గం’ “ఆది” అంత గొప్ప సినిమా అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో – స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్

August 31, 2026
మిస్సింగ్ మేఘన 2nd  లిరికల్ ను లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

మిస్సింగ్ మేఘన 2nd లిరికల్ ను లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

August 30, 2026
యం.యస్‌ వారాహి, శిమమ్‌ మీడియా పతాకాలు నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌

యం.యస్‌ వారాహి, శిమమ్‌ మీడియా పతాకాలు నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌

August 29, 2026
విభిన్నమైన సందర్భాలుకు వినూత్నమైన సాహిత్యం అందించే అవకాశం “రంగస్థలం” తర్వాత ఈ సినిమాకే  దక్కింది – “ధర్మస్థల నియోజకవర్గం” ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్

విభిన్నమైన సందర్భాలుకు వినూత్నమైన సాహిత్యం అందించే అవకాశం “రంగస్థలం” తర్వాత ఈ సినిమాకే దక్కింది – “ధర్మస్థల నియోజకవర్గం” ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్

August 29, 2026
రాఖీ వేడుకల్లో మానవత్వాన్ని చాటుకున్న నటుడు సంజోష్

రాఖీ వేడుకల్లో మానవత్వాన్ని చాటుకున్న నటుడు సంజోష్

August 28, 2026
శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు

శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు

August 28, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In