అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం ఏడావలపర్తి గ్రామానికి చెందిన జి ప్రవీణ్ కుమార్ రెడ్డి వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రధాన అనుచరుడు అనే ఇతనితో ఒకటిన్నర సంవత్సరం క్రితం పులివెందుల నియోజవర్గం చెందిన వరలక్ష్మి అను నేను పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వివాహం జరిగిన రెండు నెలల నుంచి నాపై కక్ష సాధింపు చర్యలు, వేధింపులకు గురి చేశారు. మా ఇద్దర వివాహ దంపత్యానికి ఓ కుమార్తె కూడా మాకు జన్మించింది. వివాహం జరిగిన ఐదు నెలలకు డెలివరీ కోసం నా పుట్టింటికి వచ్చాను. అప్పుడు నుంచి నాపై నా భర్త ప్రవీణ్ కుమార్ రెడ్డి లేనిపోని మాటలతో అసభ్య పదజాలంతో దూషిస్తూ వేధింపులు గురి చేశాడు. కనీసం బిడ్డను చూడటానికి కూడా రమ్మని అడిగిన…. ఆ బిడ్డపై అబాండాలు మోపాడు. ఆ పాప నాకు పుట్టలేదంటూ అనేక మాటలతో నన్ను మానసిక శోభ గురి చేశాడు. ఇదే విషయంపై నాకు పుట్టలేదని అనగా నేను డిఎన్ఎ టెస్ట్ కైనా సిద్ధమంటూ అందరి ముందు చెప్పాను. దానికి నా భర్త అంగీకరించలేదు. ఇందులో వాస్తవం ఎంత అవాస్తమెంత మా భర్త అన్న మాటలకి డిఎన్ఏ టెస్ట్ రూపంలో నిజానిజాలు తేలుతాయి. నేను కాపురం చేయడానికి గురువారం నా పుట్టింటి నుంచి నా బిడ్డ నేను నా భర్త ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంటికి రాగా… మా అత్త రామాంజనేయులు రెడ్డి ఆయన భార్య ఇద్దరు ఇంటికి తాళం వేసి… అన్ని ఇంటి బయటకి నెట్టారు. దీంతో న్యాయం జరిగేంత వరకు నా భర్త ఇంటి వద్ద నిరాహారదీక్షకు కూర్చుని నిరసన తెలుపుతాను. నాకు నా భర్తతో కాపురం చేసేందుకు పోలీసులు, చట్టం, సమాజంలోని పెద్దమనుషులు న్యాయం జరిగేలా చూడాలని మీకు చేతులెత్తి ఒక ఆడబిడ్డగా వేడుకుంటున్న.
ఇట్లు
…….
Varalaxmi