మాస్ డైరెక్టర్ వి. వి. వినాయక్ క్లాప్ తో రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో వస్తున్న “డియర్ జిందగీ” షూటింగ్ ప్రారంభం.
ప్రశాంతమైన కాలనీలో ఉండాలని వచ్చిన ఫ్యామిలీకి వారి పిల్లల వలన ఆ ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు. చివరికి ఆ తండ్రి పిల్లలకి తోడుగా ఉండి సొసైటీలో తన ఫ్యామిలీని చూసి గర్వపడేలా ఎలా చేసుకున్నాడనే ఒక క్రేజీ ఫ్యామిలీ డ్రామా కథే “డియర్ జిందగి”. రాజారవీంద్ర సమర్పణలో ‘సాయిజా క్రియేషన్స్’, మహా సినిమా పతాకంపై రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, నీల ప్రియా, మిర్చి కిరణ్, హర్షవర్ధన్, నటీనటులుగా పద్మారావ్ అబ్బిశెట్టి (పండు) ను దర్శకుడుగా పరిచయం చేస్తూ ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి లు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిలిం నగర్ దైవ సన్నిదానంలో పూజా కార్యక్రమాలు ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖ దర్శకుడు వి. వి. వినాయక్ నటుడు రాజా రవీంద్ర పై క్లాప్ ఇవ్వగా, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కెమెరా స్విచ్చాన్ తో పాటు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
నటుడు రాజా రవీంద్ర మాట్లాడుతూ.. రెగ్యులర్ గా కాకుండా కొత్త కాన్సెప్ట్ తో ప్రస్తుతం సమాజంలో జరిగే సమస్యలు ఎత్తి చూపుతూ, మంచి కాన్సెప్ట్ తో తీస్తున్న ఈ సినిమాలో నేను ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇందులో నాకు ముగ్గురు పిల్లలు ఉంటారు. వీరు చేసే పనులకు ఫ్రస్ట్రేట్ తెప్పించే ఫాదర్ గా చాలా రోజుల తరువాత ఫుల్ లెన్త్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇలాంటి మంచి సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత శరత్ చంద్ర చల్లపల్లి మాట్లాడుతూ..మా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన వి. వి. వినాయక్ గారికి, కళ్యాణ్ కృష్ణ గారికి ధన్యవాదములు. ఫ్రెండ్స్ తో కోలాబ్రేట్ అయ్యి ప్రేక్షకులకు మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలను అందించాలనే ఉద్దేశ్యంతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాము.
అయితే దండుపాళ్యం డైరెక్టర్ శ్రీనివాస్ రాజు దగ్గర అసోసియేట్ గా వర్క్ చేసిన పండు నన్ను కలసి ఈ సినిమా కథ చెప్పడం జరిగింది. ఈ కథ మా ఫ్రెండ్స్ కు కూడా నచ్చడంతో ఈ సినిమా తీస్తున్నాము. మాకు రాజా రవీంద్ర గారు కూడా సపోర్ట్ గా నిలవడమే కాకుండా ఇందులో తను నటించడం చాలా సంతోషంగా ఉంది. కథ చాలా బాగుంది. చూసిన వారందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని అన్నారు.
సహ నిర్మాత క్రాంతి ముండ్ర మాట్లాడుతూ..
ఇది ఒక మంచి క్రేజీ ఫ్యామిలీ కథ. ‘సాయిజా’ క్రియేషన్స్, మహా సినిమా పతాకంపై ఈ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మ్యూజికల్ గా కూడా మంచి పాటలు కుదిరాయి. కీరవాణి దగ్గర కీ బోర్డ్ ప్లేయర్ గా పని చేసిన యం.ఎబెనెజర్ పాల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు సినిమాకు తగ్గట్టే పర్ఫెక్ట్ గా నటీ, నటులు, టెక్నిషియన్స్ దొరికారు, చూసిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది అన్నారు.
దర్శకుడు పద్మారావ్ అబ్బిశెట్టి (పండు) మాట్లాడుతూ..ఈ కథ రాయడానికి ఒక సంవత్సరం పట్టింది.కల్ట్ వేలో రాసుకున్న ఈ కథ పర్ఫెక్ట్ అనుకున్న తరువాతే నిర్మాత శరత్ గారికి చెప్పడం జరిగింది. తనకు నచ్చడంతో మిగిలిన ఫ్రెండ్స్ అందరినీ తనే మెప్పించడంతో ఈ సినిమా చెయ్యడానికి ముందుకు వచ్చారు. అలాగే రాజా రవీంద్రగారు నాకు గాడ్ ఫాదర్ లాంటి వారు. తను ఫుల్ సపోర్ట్ చేశారు. వారికీ నా ధన్యవాదములు. ఇప్పటి వరకు ఇలాంటి కథ రాలేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ఇందులో హీరో అని కాకుండా కథే హీరో, కథకు తగ్గట్టు ఇందులోని ప్రతి క్యారెక్టర్ ఒక ఆర్క్ గా వుంటుంది. ఈ సినిమాకు మంచి నటీ, నటులు, టెక్నిషియన్స్ దొరకడంతో సినిమా బాగా వస్తునందని ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదములు. అన్నారు.
లిరిక్ రైటర్ రాంబాబు గోశాల మాట్లాడుతూ ..”కాంతారా” సినిమా తరువాత ఈ కథ నచ్చడంతో ఈ సినిమాకు అన్ని పాటలు రాయడం జరిగింది. మంచి కథతో వస్తున్న ఈ సినిమాకు మంచి పాటలు సెట్ అయ్యాయి. ఇలాంటి మంచి సినిమాకు ప్రేక్షకులందరి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
నటుడు శివ చందు మాట్లాడుతూ.. హ్యుమన్ ఎమోషన్ తో వస్తున్న మంచి యూనిక్ సబ్జెక్టు లో నటిస్తున్నాను ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలకు భిన్నమైన పాత్రలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా మా దర్శక, నిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
నటి యశస్విని : అనుపమ క్యారెక్టర్ లో చేస్తున్నాను. మిస్ ఇండియా అవ్వబోయే అమ్మాయి కథ.. ఈ సినిమా ఒక క్రేజీ ఫ్యామిలీ డ్రామా. మిడిల్ క్లాస్ అడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యే ఈ సినిమా చూసిన వారందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
నటి నీల ప్రియ..ఇందులో నేను శాంతి క్యారెక్టర్ లో మదర్ గా నటిస్తున్నాను. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు.
కెమెరామెన్ సిద్ధార్థ స్వయంభు మాట్లాడుతూ .. ఇది ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ. ఇలాంటి మంచి సినిమాకు సినిమాటోగ్రఫీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.
నటీనటులు
రాజా రవీంద్ర,
శ్రీకాంత్ అయ్యంగార్,
శివ చందు, నీల ప్రియా, మిర్చి కిరణ్, హర్షవర్ధన్, మొయిన్, యశస్విని, మోహిత్, ఎల్. వి ప్రసాద్ తదితరులు
టెక్నీషియన్స్
ప్రొడ్యూసర్స్ – ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి
కో ప్రొడ్యూసర్ – క్రాంతి ముండ్ర
డైలాగ్స్ – వినయ్ కొట్టి
ఎడిటర్ – రాజ్ మేడ
మ్యూజిక్ డైరెక్టర్ – ఎమ్. ఎబెనెజర్ పాల్
సినిమాటోగ్రఫీ – సిద్ధార్థ స్వయంభు
పాటల రచయిత: రాంబాబు గోసాల
అడిషనల్ రైటర్ – రఘురామ్ తేజ
డైరెక్టర్ – పద్మారావ్ అబ్బిశెట్టి (పండు)
పి ఆర్ ఓ : కడలి రాంబాబు
The shooting of “Dear Zindagi”, starring Raja Ravindra in the lead role, has started with Mass Director V. V. Vinayak’s Clap.
The family who came to live in a peaceful colony faced difficulties because of their children. “Dear Zindagi” is a crazy family drama story of how the father eventually stands by the child and makes his family proud in the society. Presented by Rajaravindra, produced by ‘Saija Creations’
Raja Ravindra, Srikanth Iyengar, Siva Chandu, Neela Priya, Mirchi Kiran, Harshavardhan & others playing vital roles, and Padmarao Abbisetti (Pandu) as director under the Maha Cinema banner produced by Umadevi, Sarath Chandra Challapally. Pooja programs were celebrated grandly at Film Nagar in the presence of God. The chief guest of this program was the famous director V. V. Vinayak gave a clap on actor Raja Ravindra, director Kalyan Krishna did the Honorary Direction along with the camera switching. Later in a press conference organized by the film unit
Actor Raja Ravindra said, “I am playing the character of a father in this film which is being made with a good concept and pointing out the problems happening in the society with a new concept instead of regular. I have three children in this film. After many days I am doing a full length character as a father who is frustrated by children who are doing crazy things. I am very happy to act in such a good movie.” He said that he wanted everyone to support and bless such a good movie.
Producer Sarath Chandra Challapally said thanks to V. V. Vinayak & Kalyan Krishna who came to the opening ceremony of our film. We started a production house, with the intention of giving a good concept films to audience, by collaborating with friends.
However, Pandu, who worked as an associate with Dandupalayam director Srinivas Raju, told me the story of this film. Our friends also liked this story, so we are making this film. Raja Ravindra is also supporting us and we are very happy that he is acting in our film. The story is very good. Everyone who will see it will definitely like it.
Co-producer Kranti Mundra said “it is a good &A crazy family story. I am very happy to be making this film under the banner of ‘Saija’ Creations and Maha Cinema. Musically, there are good songs too. Mr. Ebenezer Paul, who worked as an assistant keyboard player with Keeravani, is introducing as the music director. Directors have found the perfect actress, actors and technicians for the movie, and everyone who see it will like this movie.
Director Padma Rao Abbisshetty (Pandu) said that “it took a year to write this story. This story is written in the cult way and was thought to be perfect and only then it was told to the producer Sarath Garu. As he liked it, the rest of his friends came forward to make this film. Also, Raja Ravindragaru is like a godfather to me. He gave full support. My thanks to them too. Till now there is no such story. All middle class families will surely like this movie. In this film there is no hero, but the story is the hero, each character has an arc according to the story. I hope that the movie will do well as I get good actresses, actors and technicians. Thanks to the producers for giving us the opportunity to make such a good film.
Lyric writer Rambabu Goshala said that “after the movie Kantara, he liked the story and wrote all the songs for this movie. Coming with a good story, this movie has good songs set.” He said, “I sincerely wish for the blessings of all the audience for such a good film.”
Actor Shiv Chandu said “I am acting in a good and unique subject with human emotion. I sincerely wish that this film will bring a good name to our director and producers.”
Actress Yashaswini: I am doing Anupama character. The story of a girl who is going to be Miss India.. This movie is a crazy family drama. She said that all those who will see this movie will definitely like it because it connects well with the middle class audience.
Actress Neela Priya: In this I am playing a mother in the character of Shanti. There are elements in this movie that will appeal to all sections of the audience. Thanks to the director and producers for giving me an opportunity to act in such a good movie.
Cinematographer Siddhartha Swayambhu said.. It is a good family story. He said that “he is very happy to be doing cinematography for such a good film.”
Cast
Raja Ravindra, Srikanth Iyengar, Shiva Chandu, Neela Priya, Mirchi Kiran, Harshavardhan, Moin, Yashaswini, Mohit, L. V Prasad and others
Technicians
Producers – Umadevi, Sarath Chandra Challapally
Co Producer – Kranti Mundra
Dialogues – Vinay Kotti
Editor – Raj Meda
Music Director – M. Ebenezer Paul
Cinematography – Siddhartha Swayambhu
Additional Writer – Raghuram Teja
Director – Padmarao Abbisshetty (Pandu)
PRO: Kadali Rambabu