• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఘనంగా తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా రైటర్స్ అసోసియేషన్ ప్రమాణస్వీకారం

admin by admin
August 11, 2022
in movies
0 0
0
ఘనంగా తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా రైటర్స్ అసోసియేషన్ ప్రమాణస్వీకారం
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా రైటర్స్ అసోసియేషన్..
నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం.
తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా రైటర్స్ అసోసియేషన్ వారి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం ఫిలిం ఛాంబర్ హాలులో..ఆహ్లాద భరిత వాతావరణం లో ఘనంగా జరిగింది. సంస్థ ఫౌండర్ ప్రెసిడెంట్ నాగబాల సురేష్ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల అధికారిగా సీనియర్ న్యాయవాది కేవీఎల్ నరసింహారావు గారు వ్యవహరించారు.
*ప్రమాణ స్వీకారం చేసిన నూతన కార్యవర్గం వివరాలు :
బాబా ఫక్రుద్దీన్ – అధ్యక్షుడు,
కే నరేందర్ రెడ్డి – జనరల్ సెక్రటరీ,
డి. మహేందర్ వర్మ – ట్రెజరర్,
త్యాగరాజు మలిగ-వర్కింగ్ ప్రెసిడెంట్,
ఓం ప్రకాష్ మార్త – వైస్ ప్రెసిడెంట్,
శ్రీరామ్ దాత్తి -వైస్ ప్రెసిడెంట్,
జే చిత్తరంజన్ దాస్ -ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్,
సుహాస్ – ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్,
రాపోలు దత్తాత్రి – జాయింట్ సెక్రటరీ,
చెల్లి స్వప్న – ఆర్గనైజింగ్ సెక్రటరీ,
ఆర్. డి.ఎస్.ప్రకాష్ – ఆర్గనైజింగ్ సెక్రటరీ,
సత్య తుమ్మల -ప్రిన్సిపల్ సెక్రటరీ,
మహతి -ప్రిన్సిపల్ సెక్రటరీ గా ప్రమాణ స్వీకారం చేయగా…
* ఈసీ మెంబర్స్ గా
సి. శశిబాల, డి శ్రీనివాసరాజు, ఐ సతీష్ కుమార్, కే విశ్వనాథ్,
ఎం ఫణి కుమార్, శ్రీనివాస్ వలబోజు, సాధనాల వెంకట స్వామి నాయుడు, లక్ష్మీనారాయణ శ్రీరామోజు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి తెలుగు టీవీ ఫెడరేషన్ అధ్యక్షులు రాకేష్ హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపి… ” టీవీ ఫెడరేషన్ లో ఉన్న 24 శాఖలు వారు కలిసికట్టుగా టీవీ నగర్ సాధించుకోవడానికి కృషి చేయాలి” అన్నారు.
విశిష్ట అతిథిగా హాజరైన విజన్ వి వి కే సంస్థల అధినేత విజయ్ కుమార్ గారు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న రచయితల సంఘ కార్యాలయం కోసం రూ. లక్ష రూపాయలు చెక్కు రూపంలో విరాళంగా అందజేశారు.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో- గత 13 – 14 సంవత్సరాలుగా సంస్థ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న ఫౌండర్ ప్రెసిడెంట్ ‘నాగబాల’ సురేష్ గారిని పలువురు వక్తలు అభినందించారు. నాగబాల సురేష్ గారు మాట్లాడుతూ ” టీవీ నగర్ సాధించుకోవడానికి, సభ్యుల సంక్షేమం కోసం నూతన కార్యవర్గ సభ్యులందరూ పట్టుదలతో కృషి చేయవలసి ఉంటుంది” అని అన్నారు. ఆయన నూతనంగా ఎన్నికైన వారందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
* ఈ సమావేశంలో టీవీ రంగం నుండి సినీ రంగానికి వెళ్లి అగ్రశ్రేణి రచయితగా గుర్తింపు తెచ్చుకున్న బుర్రా సాయి మాధవ్ మాట్లాడుతూ.. ” రచయితలు తాము నెలరోజుల్లో రాసే ఎపిసోడ్స్ లో ఒక ఎపిసోడ్ కి సంబంధించిన అమౌంట్ అసోసియేషన్ కి ఇస్తే – అసోసియేషన్ ఆర్థికంగా బలపడుతుంది. అలా వారు కనుక ఇస్తే…నేను ఏడాది కాలంలో రాసే సినిమాలలో, ఒక సినిమా రెమ్యూనరేషన్ సంస్థకి విరాళంగా ఇస్తాను ” అని సంచలన ప్రకటన చేశారు.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీనియర్ రచయితలు అక్క పెద్ది వెంకటేశ్వర శర్మ, అనంత కుమార్, శేషు కుమార్, మాడభూషి వెంకటేష్ బాబు, కాంచనపల్లి రాజేంద్ర రాజు, రవి కొలికపూడి తో పాటు.. పలువురు రచయితలు హాజరై కొత్త కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదే సమయంలో సంస్థ అభివృద్ధికి, ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయంలో పలు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు.

Previous Post

‘ద్రౌపది’ పెద్ద సక్సెస్ కావాలి: నిర్మాత సతీష్ కుమార్

Next Post

డైలాగ్స్‌తో ఆకట్టుకుంటున్న ‘విక్కీ ది రాక్ స్టార్’ రివల్యూషన్ షేడ్

Next Post
డైలాగ్స్‌తో ఆకట్టుకుంటున్న ‘విక్కీ ది రాక్ స్టార్’ రివల్యూషన్ షేడ్

డైలాగ్స్‌తో ఆకట్టుకుంటున్న 'విక్కీ ది రాక్ స్టార్' రివల్యూషన్ షేడ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

24వ స్టోర్‌ను హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రారంభించిన గోయాజ్
movies

24వ స్టోర్‌ను హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రారంభించిన గోయాజ్

by admin
February 21, 2026
0

...

Read more
ఇళయరాజా గారి ఆ ఒక్క మాటతోనే మేము విజయం సాధించాం- ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’ సక్సెస్ మీట్‌లో హీరో తక్ష్

ఇళయరాజా గారి ఆ ఒక్క మాటతోనే మేము విజయం సాధించాం- ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’ సక్సెస్ మీట్‌లో హీరో తక్ష్

February 18, 2026
ప్ర‌భుత్వ కొలువుల‌కు చిరునామా- య‌ర్ర‌బండ‌

ప్ర‌భుత్వ కొలువుల‌కు చిరునామా- య‌ర్ర‌బండ‌

February 17, 2026
When Goodbye Becomes the Most Romantic Hello Story

When Goodbye Becomes the Most Romantic Hello Story

February 13, 2026
“ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల

“ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల

February 11, 2026
WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

February 10, 2026
టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

February 10, 2026
గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన  సినీ నటి మాళవిక మోహన్

గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన సినీ నటి మాళవిక మోహన్

February 9, 2026
“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

February 2, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In