తన డైరెక్షన్ తో నేషనల్ అవార్డ్ కూడా అందుకున్న ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ నీలకంఠ తాజాగా ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గతంలో “షో” అనే ఫీచర్ ఫిల్మ్ తో రెండు జాతీయ అవార్డులు, అలాగే “విరోధి” మరియు “షో” చిత్రాలకు గాను ఇండియన్ పనోరమ లో కూడ సెలెక్ట్ అయిన దర్శకుడు నీలకంఠ ఆ తర్వాత మిస్సమ్మ, సదా మీ సేవలో వంటి సినిమా లతో ఆకట్టుకున్నారు. సినిమాల నుండి కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు మరోసారి “సర్కిల్” అనే చిత్రంతో వస్తున్నారు. “ఎవరు, ఎప్పుడు, ఎందుకు శతృవులవుతారో” అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ కూడా బాగా ఆకట్టుకుంటోంది.
తాజాగా ఈ చిత్ర టైటిల్ మరియు మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం సినిమాకి సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ లో నుంచి ఈవెంట్ లో డైరెక్టర్ నీలకంఠ మాట్లాడుతూ, “సర్కిల్ ఆఫ్ లైఫ్, సర్కిల్ ఆఫ్ డెత్ మరియు సర్కిల్ ఆఫ్ ఫేట్ అని మనకి పోస్టర్ డిజైన్ లో కనిపిస్తాయి. ఈ మూడిటి కలయిక గురించి చెప్పేది ఈ సినిమా. తన పాత్రలోని ఎమోషన్స్ని సాయిరోనక్ నాకు చాలా బాగా చూపించాడు తన యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా హీరో పాత్ర ఒక సర్కిల్లోకి లాగబడతాడు. ఎవరు శత్రువు ఎవరు మిత్రుడు అని తెలుసుకోలేని సందిగ్ధంలో పడతాడు. ఈ ప్రాబ్లమ్స్ ని దాటుకుని తను బయటకు రాగలిగాడా లేదా అనేది సినిమా కథ సినిమాలో ఎమోషన్స్ ని చాలా సరికొత్తగా చూపించాము,” అని చెప్పారు.
హీరో సాయి రోనక్ మాట్లాడుతూ, “డైరెక్టర్ నీలకంఠ గారి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఈ సినిమా షూటింగ్ తర్వాత వేరే సెట్స్ మీదకి వెళుతుంటే వాళ్ళు నన్ను నువ్వు ఎలా ఇంత ఫోకస్ గా ఉంటున్నావు అని అడుగుతున్నారు. ఒక్కసారి నీరకంఠ గారితో సినిమా చేస్తే అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సినిమాలో నాది ఒక ఫోటోగ్రాఫర్ పాత్ర. సినిమా టీజర్ తో పాటు సినిమా కూడా మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను,” అని అన్నారు.
బాబా భాస్కర్ మాట్లాడుతూ, “నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ నీలకంఠ గారికి మరియు నిర్మాతలకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ సినిమా మొత్తం ఒకే ఒక కాస్ట్యూమ్ ఇచ్చారు. సినిమాటోగ్రాఫర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా బాగా పనిచేశారు. అసలు నేను నటించగలనా అని నాకు అనుమానం ఉండేది కానీ డైరెక్టర్ నీలకంఠ గారు నా మీద నమ్మకం ఉంచి నేను నటించేలా చేశారు. జీవితం అంటేనే ఒక సర్కిల్ లాంటిది. దాని గురించి చెప్పే ఈ సినిమా కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
నిర్మాత శరత్ చంద్ర మాట్లాడుతూ, “ఏ రోజు ఏది ఎలా చేయాలి అని మేము చెప్పలేదు. సినిమా విషయంలో డైరెక్టర్ గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాము. మీ అందరికీ ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది” మా మొదటి సినిమా నీలకంఠ గారితో చేయడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.
ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సర్కిల్ చిత్రంలో నటీనటులు: సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్ మెహతా,రిచా పనై, నైనా , పార్థవ సత్య తదితరులు ..
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రపీ : రంగనాథ్ గోగినేని
ఎడిటర్ : మధు రెడ్డి
సంగీతం : ఎన్.ఎస్ ప్రశు
నిర్మాతలు : ఎమ్.వి శరత్ చంద్ర, టి సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ
రచన, దర్శకత్వం : నీలకంఠ
Teaser of Director Neelakanta’s film “Circle” gets launched
Noted Tollywood director Neelakantha, who also received a National Award for his direction skills is now all set to test his luck with yet another interesting film. Director Neelakantha who won two National Awards with “Show” movie was also selected in the Indian Panorama for his film “Virodhi”. Later, he wielded the megaphone for movies like Missamma and Sada Mee Sevalo. After taking a small gap from films, he is all set to mark his come back with a film called “Circle”. The recently released title and motion poster of this film got a good response. The movie unit has now released the teaser of the film.
While talking at the teaser launch event, director Neelakanta said, “In the poster design there will be written circle of life, circle of death and circle of fate. The movie is about the intersection of these three circles. Sai Ronak showed the emotions of his character very well and his acting is very good. Due to some incidents in his life, the hero character will get pulled into a circle. He falls into a dilemma where he can’t know who is an enemy and who is a friend. How he can get out of these problems is the plot of the film. We have shown the emotions in the movie in a very new way”.
Talking at this event, hero Sai Ronak said, “I have learned a lot from director Neelakanta. After the shooting of this film, when I go to other movie sets, they ask me how I stay so focused and balanced. Once you do a film with Neelakanta, it comes automatically. I played the role of a photographer in the movie. I hope you all will like the teaser as well as the movie”.
Baba Bhaskar said, “I sincerely thank director Neelakanta and the producers for giving me this opportunity. The cinematographer and the music director also did a great job. I had doubts about whether I would be able to act but director trusted me and made me act. Life is like a circle. I really like the concept of this movie. I want the movie to be a good hit”.
The producer of the film said, “We gave the director a free hand in the matter of the film. I hope you all will definitely like this film.”