రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత రుచికరమైన హైదరాబాద్ పాపులర్ స్వీట్ బక్లావా కింగ్ స్వీట్ ను స్టోర్ ను ఏర్పాటు చేయడం అభినంనీయమని సిఎంవో అధికారి స్మిత సభర్వాల్ ఐఎఎస్ అన్నారు. ఈ మేరకు ఆదివారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్-3 లో బక్లావా కింగ్ స్వీట్ స్టోర్ ను ఆమె ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. అనంతరం సిరియా దేశానికి చెందిన చెఫ్ ఫెరాస్ తో కలిసి స్మిత సభర్వాల్ ఐఎఎస్ మాట్లాడుతూ బక్లావా కింగ్ స్వీట్ ను నగర వాసులు రుచి చూడాలన్నారు. ఈ సందర్బంగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. తాను బెంగాలీని అని స్వీట్స్ అంటే చాలా ఇష్టం అని అన్నారు. నిర్వాహకుడు నిశ్చల్ మాట్లాడుతూ బక్లావా కింగ్ తమ మొదటి బ్రాంచ్ మాదాపూర్, రెండవది బంజారాహిల్స్ లో ప్రారంభించామన్నారు.