వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల పాత్ర ఎంతో ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.తాడేపల్లిలో జరిగిన పార్టీ సోషల్ మీడియా సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏదైనా పార్టీ సక్సెస్ ఫుల్ గా నిలబడాలంటే అది సజీవంగా ఉండాలి. 1980 ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందో నేడు టిడిపి తుప్పుపట్టిపోయింది. ఫైనల్ స్టేజ్ లో ఉంది. మన పార్టీ కమిట్ మెంట్ తో ఉండటమే కాదు. ఎన్నికలు వస్తున్నాయంటే మన పార్టీ లో ఎక్కడిక్కడ అందరూ సిధ్దమవుతున్నారు. మన పార్టీ కెమిస్ట్రీ వేరు.అన్నింటికి మూల సూత్రం ఒకటే. శ్రీ వైయస్ జగన్ గారిపై అభిమానం. ఆయన నాయకత్వంపై విశ్వాసం. ఆయనతో అడుగులు వేస్తే భవిష్యత్తు ఉంటుంది. ఆయన నాయకత్వంలో నడిస్తే ప్రజలకు నాలుగు మంచి పనులు చేయగలుగుతున్నాం. ప్రజలకు సేవ,మంచి చేయగలుగుతున్నాం అని బావిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు. ఎక్కడా డిస్టెన్స్ మెయింటెన్ చేయడం లేదు. అదే విధంగా ఎంఎల్ఏలు,మంత్రులు కూడా పనిచేస్తున్నారు. అందరూ బాధ్యతతో పనిచేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రభుత్వంపై మంచి అభిప్రాయం కలిగించేలా చేయడంలో విజయవంతంగా పనిచేస్తున్నారు. అది కూడా శక్తివంతమైన దుష్ప్రచారం చేస్తున్నవారి నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నారు. తప్పుడు వ్యక్తుల దాడినుంచి…. అబధ్దాల దాడి నుంచి పార్టీని,పార్టీ నేతలను రక్షిస్తున్నారు. మీ పాత్ర చాలా ప్రాధాన్యత కలిగినది.
ప్రజాస్వామ్యయుతంగా ముందుకు వెళ్తున్న పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీని ఆల్రెడీ ప్రజలు చెత్తబుట్టలో వేశారు. దాన్ని కౌంటర్ చేయాలంటే మనం చేసినవి ఏ రకంగా ప్రజలకు మేలు చేస్తున్నాయో…చెబుతూనే తెలుగుదేశం పార్టీ తప్పిదాలను ఎప్పుడూ గుర్తుచేస్తుండాలి. వాటిని హైలెట్ చేస్తూ ప్రచారం చేయాలి. మన పార్టీకి సంబంధించిన వ్యక్తుల వ్యక్తిత్వ హననం తెలుగుదేశం పార్టీ వాళ్లు చేస్తున్నారు. అది ఏమీ చేతకానప్పుడు చేసేది. ఆ విధంగా రెచ్చగొట్టేఅంశాలలో అలాంటి విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. రాష్రట్ సమగ్ర అభివృధ్దికి,పేదవర్గాల సంక్షేమానికి మన ప్రభుత్వం పనిచేస్తోంది. వాటి ప్రచారం విషయంలో ఆకాశమే హద్దుగా సోషల్ మీడియా కార్యకర్తలు ముందుకు వెళ్లాలని కోరుతున్నాను. అందరూ మనస్సు పెట్టి పనిచేయండి. మిమ్మల్ని పార్టీ ప్రోత్సహిస్తుంది. మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. ప్రజలు బాగుండాలి. అట్టడగున ఉన్నవారి జీవితాలన్నీ కూడా బాగుపడాలి అనే దిశగా శ్రీ వైయస్ జగన్ పనిచేస్తున్నారు. వాటిని ప్రజలకు విడమరచి చెప్పాలి.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు శ్రీ వైయస్ జగన్ అమలు చేస్తున్న పధకాలన్నీ ఆగిపోతాయనే అంశాన్ని ప్రజలకు తెలియచేయాలి. కిందిస్దాయికి తీసుకువెళ్లాలి. శ్రీ వైయస్ జగన్ ప్రాధాన్యత ఇస్తున్న ఎడ్యుకేషన్,హెల్త్ వంటివి ప్రజలకు ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే పేదవర్గాలకు అందిస్తున్న పధకాల వల్ల దుబారా జరిగిపోతుందంటూ చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. వైయస్సార్ సిపి అధికారంలోకి రాకుండా చేసేందుకు అందరూ కలసి కట్టుగా ఎటాక్ చేయడానికి, పొత్తులు పెట్టుకోవడానికి రహస్యంగా చేస్తున్న వారి ప్రయత్నాలు రేపు బహిరంగంగా రాబోతున్నాయి. అవన్నీ సక్సెస్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అవి సక్సెస్ కావు. కాని సక్సెస్ అయితే రాష్ర్టం తిరిగి చీకట్లోకి వెళ్తుంది అని ప్రజలకు తెలియచేయాలి. ఇది ఆషామాషీగా తీసుకునే వ్యవహారం కాదు అనే అంశాన్ని కిందిస్దాయికి తీసుకువెళ్లాలి. రేపు ఎన్నికలకు వెళ్లినప్పుడు ప్రజల బ్లెస్సింగ్స్ మనకు ఇచ్చే విధంగా సోషల్ మీడియా కార్యకర్తలు పనిచేయాలన్నారు. రాజ్యాంగ వ్యవస్దల గురించి కామెంట్స్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండి వాటికి తగిన గౌరవం ఇచ్చేవిధంగా ఉండాలన్నారు. రెస్పెక్టబుల్ గా ప్రవర్తించాలన్నారు. ఎవరి ట్రాప్ లో పడకూడదన్నారు. మన పార్టీ పాటించే భాద్యతాయుతమైన విధానాన్ని సదా గుర్తీంచుకోవాలన్నారు.
శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే……….ఆయన మాటల్లోనే…….
ఎన్ టి ఆర్ రాజకీయ ప్రవేశ సమయంలో ఎన్టీఆర్ స్నానం చేయడం దగ్గరనుంచి భోజనం చేసే సన్నివేశాలను ప్రజల చెంతకు తన ఫ్యాక్టరీలో తయారుచేసి తీసుకువెళ్లి రామోజిరావు విస్త్రుత ప్రచారం కల్పించారు. ఇమేజ్ క్రియేట్ చేసి ముఖ్యమంత్రి సింహాసనంపై కూర్చోపెట్టగలిగిన రామోజిరావు ఎన్టీఆర్ మింగుడు పడకపోవడంతో చంద్రబాబును ఎంకరేజ్ చేశారు.
నాదెండ్ల భాస్కర్ రావు కుట్ర చేసి ఉండకపోతే వెన్నుపోటు పొడిచిన 1995 కంటే ముందే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిఉండేవారు.నాకు ఒక అనుమానం కూడా ఉంది.చంద్రబాబు కంటే దగ్గుబాటి అంటేనే ఎన్టీఆర్ కి ఇష్టం అనేది వారి కుటుంబంలో వినిపిస్తుంటుంది. తనపై ఎన్టీఆర్ కుటుంబానికి నమ్మకం కలిగించేందుకే నాదెండ్ల భాస్కరరావు ప్రయోగం చంద్రబాబు తీసుకువచ్చాడనేది నేను నమ్ముతాను. ఆ తర్వాత కాలంలో టిడిపిపై గ్రిప్ సంపాదించిన తర్వాత 1995 ఎపిసోడ్ తీసుకువచ్చారు. అది కూడా చేసింది రామోజిరావే. రామోజిరావు మద్యనిషేధం కావాలంటే అది వస్తుంది.మద్యనిషేధం వల్ల నష్టాలు అనుకుంటే అదీ వస్తుంది.
ఆ తర్వాతి కాలంలో వేమూరి రాధాకృష్ణ చంద్రబాబుకు అండగా వచ్చారు. ఆంధ్రజ్యోతికి యజమాని అయ్యారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి ఆయన ఎందుకు పోటీ పడటంలేదో తెలియదు కాని ప్రతిపక్షవైయస్సార్ సిపి ఎంఎల్ఏల కొనుగోళ్ల దగ్గర్నుంచి అన్నింటిలో కూడా తనే వెనక ఉండి నడిపించారు. రామోజీరావు వృధ్ద సింహం అయిపోయి గుహలో ఉన్నాడు కాబట్టి రాధాకృష్ణ అన్నీ చూస్తున్నట్లున్నారు.
టివి-5 వంటివి తర్వాత కాలంలో వచ్చాయి. టిడిపి డిఎన్ ఏ లోనే మీడియా అనేది ఉంది. ప్రింట్ అండ్ ఎలక్రానిక్ మీడియా వంటి వాటికంటే వర్డ్ ఆఫ్ మౌత్ ఉండేది.ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది. చంద్రబాబు భాషలో చెప్పాలంటే అప్పట్లో ఎంఎల్ఏ లు ప్రతి నెలలో ఎన్నిసార్లు ప్రెస్ మీట్ లు పెట్టారు. ఎన్ని ప్రకటనలు ఇచ్చారు అనే అంశాలకు విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చేవారు. పత్రికల కటింగ్ లు చూసేవారు.అంటే ఎంఎల్ ఏల పనితీరు పత్రికలలో వచ్చే ప్రకటనల ఆధారంగా నిర్ణయించేవారు. వారు ప్రజలకు ఏం చేస్తున్నారు.ప్రజాసేవ పరిస్దితి ఏంటి అనేది అవసరం లేదని చంద్రబాబు భావించారు. ప్రజల కళ్ల ఎదుట మీడియా ద్వారా నీవు ఎలా కనపడుతున్నావనేదానికి మాత్రమే ప్రాధాన్యత అంశంగా భావించేవారు.
ప్రత్యర్దులు ఎలా కనపడాలనేది కూడా చంద్రబాబు నిర్ణయించి మీడియాను మేనేజ్ చేసి అదే విధంగా చిత్రీకరించేప్రయత్నం చేసేవారు. ఇదేలా చెబుతానంటే దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజా ఆఫ్ కరప్షన్ అనే పుస్తకాన్ని అచ్చేసి పత్రికలలో దుష్ప్రచారం చేశారు. ఆ పుస్తకాన్ని పార్లమెంట్ లో ఎంపీలకు కూడా పంచారు. నిజానికి దాంట్లో ఏమీ ఉండవు. ఓబులాపురం మైన్స్ అని కొన్నింటికి సంబంధించి ఎంఓయులు వంటివి ఉండేవి. ఓపెన్ డొమెయిన్ లో ఉండేవే. ప్రభుత్వం చేస్తున్న అభివృధ్దిలో భాగంగా ఉన్నవే.అలా పంచుతుంటే చంద్రబాబును చూసి తిక్కఎక్కి ఇవన్నీ చూస్తున్నాడేమో అనుకున్నాం. అయితే వైయస్సార్ లాంటి ఛాలెంజ్ గా తీసుకునే వ్యక్తి ఉన్నారు కాబట్టి ప్రతిపక్షాలను ఆరోపణలు వచ్చిన ఓబులాపురం,బ్రాహ్మాణి స్టీల్స్ వంటివాటి వద్దకు తీసుకువెళ్లి చూపించారు. అక్కడ అభివృధ్ది కనిపించిందే తప్ప మరే కుంభకోణాలు లేవు. చంద్రబాబు ఆరోపణలు నిలబడతాయా అని అనుకున్నాం.
కాని దాని ప్రభావం (టిడిపి రాసిన రాజాఆఫ్ కరప్షన్ బుక్) ఎప్పుడు కనపడిందంటే వైయస్ రాజశేఖరరెడ్డి చనిపోయాక 2012లో సిబిఐ ప్రవేశించిన తర్వాత జరగాల్సింది జరిగింది.ఏమీలేని అభూత కల్పనలనుంచి సృష్టించిన ఆరోపణలను సోనియాగాంధితో కలసిన తర్వాత చంద్రబాబు కేసు దిశగా తీసుకువెళ్లారు. అసాధ్యం అనుకున్నవాటిని వ్యవస్ధలను మేనేజ్ చేయడం ద్వారా నిజమనే విధంగా తయారుచేశారు.అది వైయస్సార్ ఫ్యామిలీలో ఎంత నష్టం చేకూర్చిందో అందరికి తెలుసు.ప్రపంచ చరిత్రలో ఇంత అన్యాయం అయిన అంశం ఎక్కడా ఉండి ఉండదు. వ్యవస్దలే వ్యక్తులతో ఏకమైతే వాటిని మానుపోలేట్ చేయగలిగిన దుర్మార్గులు పవర్ లో ఉండటమో లేక పవర్ ఫుల్ గా ఉండటమో జరిగితే ఎలా ఉంటుందనేది అప్పటివరకు సినిమాలలో మాత్రమే చూసి ఉంటాం.కాని మన కళ్లఎదుట జరిగింది మాత్రం ఇక్కడే.ఇది అందరికి తెలుసు.
ఇంత చేస్తే దర్యాప్తు చేసిన వ్యక్తులే అందులో ఏమి లేదు.ఆరోపణలు అంతా కూడా 1300 కోట్ల రూపాయలకు మించి లేవని కూడా వారే అంటున్నారు.కాని ఇప్పటికి కూడా అక్రమాస్దుల కేసు అంటూ రాస్తుంటారు. ఒక అబధ్దం చంద్రబాబుకు ప్రజల గురించి ఆలోచనలు లేవు.ఆయన ప్రజల ద్వారా రాలేదు. పార్టీ పెట్టలేదు. మామ దగ్గర్నుంచి లాక్కున్నారు.ఎన్టీఆర్ ను ఎలా దించాడో. ఆయన మరణానికి ఎలా కారణమయ్యాడనేది అందిరికి తెలుసు. వెన్నుపోటు పొడిచాడని కూడా తెలుసు. కాని విచిత్రంగా ఎన్టీఆర్ ఫోటో ను పక్కనపెట్టుకుని ఆయనకు వారసుడ్ని తానే అని చెప్పుకోగలుగుతున్నాడంటే మీడియా మేనేజ్ మెంట్. డ్రిల్లింగ్ చేస్తూ ముందుకు వెళ్తుంటాడు. మనమేం అంటున్నామో చంద్రబాబు పట్టించుకోడు. అల్టిమేట్ గా చంద్రబాబు నిలబడతాడా లేదా అనేది ప్రజాక్షేత్రంలో తేలుస్తూనే ఉంటుంది. చంద్రబాబు ఎప్పుడూ అత్తెసరు మార్కులతో ఊతకర్రలతో అటూఇటూ పట్టుకుని కాలం కలసివచ్చి రెండుసార్లు సిఎం అయ్యాడు.1999లో వాజ్ పేయ్ పుణ్యమా అని,2014లో విభజన వల్ల చంద్రాబబు అధికారంలోకి వచ్చాడు. ఎల్లకాలం ప్రజలను మభ్యపెట్టడం సాధ్యం కాదని అతనికి తెలుసు. కాని చంద్రబాబుకు తెలిసిన విద్య ఇదొక్కటే కాబట్టి అదే చేస్తుంటాడు.
ఈ పరిస్ధితులలో మన నేత శ్రీ వైయస్ జగన్ గారు ముళ్ళదారిని,రాళ్లబాటను ఎంచుకున్నారు. చాలామంది పేర్నినాని లాంటి వాళ్లు ఈయనేంటి ఇలా వెళ్తున్నారు అనుకుంటూ ఉండచ్చు. బ్యూటి ఏంటంటే ఆయన హార్ట్ పాత్ ను ఎంచుకున్నారు.రాజకీయాలలో కొనసాగితే తన తండ్రి ఫోటో పక్కనే ఆయన ఫోటో కూడా పెట్టుకోవాలని బావించారు. అట్టడుగున ఉన్నవారి పక్షాన వారి పక్కన నిలబడాలని అనుకున్నారు. భగవధ్గీత,ఖురాన్,బైబిల్ లలోను రాజ్యాంగంలోను చెప్పిన విధంగా పేదల కన్నీరు పోవాలి. సమసమాజం రావాలనేదిశగా అడుగులు వేయలేకపోతే,అట్టడుగువారి కన్నీళ్లు తుడవకపోతే మనం ఎందుకు అనే భావన శ్రీ వైయస్ జగన్ గారిది.
చరిత్రలో చూస్తే ఈ విధంగా పార్టీ పెట్టినవారు ఎక్కడాలేరు. ఉద్యమం ద్వారా పార్టీలు వచ్చాయి.లాలూ,ములాయం వంటివారు క్యాస్ట్ బేస్డ్ గా వచ్చారు.అస్సాంలో స్టూడెంట్స్ ద్వారా పార్టీ వచ్చి ఆ తర్వాత కొద్దిరోజులు ఉండిపోయింది.సినిమా గ్లామర్ తో కూడా కొందరు వచ్చారు.అన్నాదురై,డిఎంకే వంటివి ఉండచ్చు.కేవలం తండ్రి 5 ఏళ్ల 3 నెలలు పాలించిన సమయంలో సంక్షేమానికి అర్దం ఇచ్చి ప్రారంభంలోనే ఆయన వదిలివేసి వెళ్తే దానికి ఓ రూపం ఇచ్చి ఈరోజు మనకు మంచి పాలన చూపిస్తున్నారంటే పదేళ్ల పోరాటం ఫలితం.2014లో కేవలం ఒక్కశాతం తేడాతో అధికారానికి దూరమయ్యాం. చాలామంది నిరాశలో ఉన్నా వారికి తానే ధైర్యం చెప్పి ఇది ఛాలెంజ్ ని అవకాశంగా తీసుకుందాం అని చెప్పి పనిచేశారు.ఈయనతో ప్రయాణం కష్టం అనుకోకుండా ఆయనకు అండగా ఉన్న లక్షలాదిమంది సహాయంతో 2019లో అధికారంలోకి రాగలిగాం.
ఈ మూడేళ్లలో చరిత్ర సృష్టించాం. చంద్రబాబు చేసిన అప్పులు,కోవిడ్,రాష్ర్ట విభజన నేపధ్యం అభివృద్దికి స్కోప్ లేని పరిస్దితులలో పది పదిహేనేళ్లలో ఎవ్వరూ చేయనంతగా చేసి చూపించారు. ప్రజలకు సాకులు చాలా చెప్పవచ్చు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రతి వైయస్సార్ సిపి కార్యకర్త కాలరెగరేసుకునే విధంగా పరిపాలన సాగిస్తున్నారు.చీకటి-వెలుగు.బ్లాక్-వైట్ అంటే వెలుగు,వైట్ వైపు శ్రీ వైయస్ జగన్,చీకటి,బ్లాక్ వైపు చంద్రబాబు కనిపిస్తారు.కాని ప్రజలు కూడా శ్రీ వైయస్ జగన్ పాలన తాలూకూ ఫలాలు అనుభవిస్తున్నారు.వాటి బ్లెస్సింగ్స్ మనకు ఇస్తున్నారు.మనం వాటిని ఎంజాయ్ చేస్తున్నాం. ఈరోజు ఎంఎల్ ఏలు గడపగడపకు పోతే ఆ ఆదరణ కనిపిస్తుంది. బిసి,ఎస్సిఎస్టి,మైనారిటీ,మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నారు.
రాజకీయం అంటే రాజకీయం కోసం కాదు ప్రజలకోసం అనేది శ్రీ వైయస్ జగన్ గారి నమ్మకం.ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు. స్వచ్చమైన గాలి పీల్చిన విధంగా ప్రజలకు శ్రీ వైయస్ జగన్ పాలన పట్ల ఒక అనుభూతి కలిగింది. సంప్రదాయపద్దతులను బ్రేక్ చేస్తూ పాలనలోను,వ్యవహారశైలిలోను,పార్టీ వ్యవహారాలలోను నేతల శైలిలోను పది మాటల్లో కాకుండా చేతలలో చూపిస్తున్నారు.నేను కూడా గర్వంగా చెప్పగలను. మనం అందరం కాలర్ ఎగరేసుకుని చెప్పుకోవచ్చు.గతంలో రాజకీయనేతలు ఇబ్బందులు పడేవారు. వైయస్సార్ సిపి వారికి క్రెడిబులిటీ వచ్చింది.ఎక్కడనుంచి వచ్చిందంటే పారదర్శకత,స్ర్టెయిట్ ఫార్వర్డ్ నెస్ నుంచి వచ్చింది. ఇంతగా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టే డేరింగ్ గా ముందుకు వెళ్తూ మారీచులనుంచి తట్టుకుంటూ ఇంతవరకు తీసుకురాగలిగారు. అబద్దాలను నిజమని….నిజాన్ని అబధ్దమని నమ్మించేవాళ్లు ప్రత్యర్ధులుగా ఉన్నప్పుడు వారిని తట్టుకోవాలంటే చాలా జాగ్రత్తగా వారిపై దృష్టి పెట్టి పనిచేయాలి.
వైయస్సార్ సిపి ఎప్పుడూ మీడియానే సర్వస్వం అని భావించదు.చంద్రబాబుకు చెప్పుకునేందుకు ఏమీ లేదు.అడ్డంగా మనపై బురదచల్లడం ద్వారా ప్రజలను అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేస్తుంటారు.వాటిని కౌంటర్ చేయాలంటే మన పార్టీ సోషల్ మీడియా 2019లో పనిచేసిన విధంగా అంకితభావంతో రిజల్ట్ ఓరియెంటెడ్ గా పనిచేయాలి.సోషల్ మీడియా రోల్ పెంచాలి.ఇది ఉద్యమంలా సాగించాలి.అందరికి అభినందనలు తెలియచేస్తున్నాను.ఆర్గనైజ్డ్ గా పనిచేయాలి.బాద్యతాయుతమైన స్దానంలోకి ఈరోజు వచ్చారు.మనం ప్రజలకు అందిస్తున్న ప్రయోజనాలు ప్రజాబాహుళ్యానికి అందేలా ప్రచారం చేసుకోవాలి. టీమ్ జగనన్న యాప్ ను లక్షలాదిమందికి తీసుకువెళ్లాలి.
ఈనాడు,ఆంధ్రజ్యోతి,టివి-5 వంటి వాటి గురించి ప్రజలకు తెలుసు.అయినా కూడా వాటిలో ప్రచురించేవి డిస్కసన్ పాయింట్ గా ఎందుకు అవుతున్నాయంటే వాటిని సోషల్ మీడియాలోకి తీసుకువస్తున్నారు.అందువల్ల అత్యధికమందికి చేరేలా చేస్తున్నారు.
ఇటీవల నా దృష్టికి వచ్చిన ఓ అంశం గురించి చెబుతాను. పోలవరం వరద ప్రాంతాల పర్యటనకు సిఎం శ్రీ వైయస్ జగన్ వెళ్లినసమయంలో ఓ పిల్లాడికి ఆయన పెన్ను బహుకరించారు. దాని గురించి నేషనల్ ఛానల్ లో ప్రసారం చేస్తే కింద కామెంట్స్ అన్నీ కూడా నెగిటివ్ గా వస్తున్నాయి. ఆరా తీస్తే ఆర్గనైజ్డ్ గా చేస్తున్నట్లుగా సమాచారం ఉంది. పోలవరం విషయానికి వస్తే పాపం చేసింది…తప్పు చేసిందీ చంద్రబాబు. నీటికి అడ్డంగా గోడ కట్టాలనే ప్రయత్నం చేశారు.ఆ ప్రయత్నంలో కాలవ తవ్వకుండా పనిచేయడం వల్ల అంతా దెబ్బతింది.ఇది అందరికి తెలిసిందే.కాని ఈ రోజు కూడా మనదే తప్పన్నట్లుగా రాస్తుంటారు. వాటిని సరైనరీతిలో క్రియేటివిటీతో,సృజనాత్మకతతో ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలి.మన పార్టీ సోషల్ మీడియా బాధ్యతతో పనిచేసినప్పుడు సాధ్యమవుతుంది.
అబద్దానికి,నిజానికి మధ్య జరుగుతోంది.అబద్దం ఆ వైపు ఉంది.నిజం మనవైపు ఉంది.ఈ రెండింటి మధ్య పోరాటం జరుగుతుంటే సాధారణ పరిస్ధితులలో ఎదుర్కొవడం కష్టం అవుతుంది కాబట్టి వర్చువల్ ద్వారానే ఢీకొనాల్సిన పరిస్తితి ఉంది. మనం ప్రజలకు చేయాల్సిన దానికంటే అత్యధిక మేలు చేస్తున్నాం కాబట్టి అది ప్రజలకు ధైర్యంగా చెప్పవచ్చు. ఆల్ ఈజ్ నాట్ వెల్ కాదు ఆల్ ఈజ్ డబుల్…త్రిబుల్ వెల్ అని చెప్పడానికి మన వద్ద మంచి ఇది ఉన్నా దానిలోకి వెళ్లడం కష్టం కాబట్టి మంచి ఎఫర్ట్ పెట్టడం ప్రారంభించడమే కాదు. వచ్చే రెండు మూడు నెలల్లో స్ట్రీమ్ లైన్ కావాలనేది నా ఆకాంక్ష.
పార్టీ సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మందిని మోటివేట్ చేయాలి.కిందిస్దాయిలో జరుగుతున్నవాటి గురించి కూడా ఆలోచించాలి. సోషల్ మీడియాకు సంబంధించి అందరికి మంచి ప్రోత్సాహం ఉంటుంది.ముఖ్యంగా అందరూ గుర్తించాల్సిన అంశం ఏమంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో శ్రీ వైయస్ జగన్ తప్ప అందరూ కార్యకర్తలే అని వాస్తవాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
సమావేశంలో రాష్ర్ట జలవనరుల శాఖమంత్రి శ్రీ అంబటి రాంబాబు, మాజిమంత్రి శ్రీ పేర్నినాని, సోషల్ మీడియా రాష్ర్ట అధ్యక్షులు శ్రీ చల్లామధుసూధన్ రెడ్డి,గుర్రంపాటి దేవేందర్ రెడ్డి,శివశంకర్,పామిరెడ్డి మధు తదితరులు పాల్గొన్నారు.