• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

admin by admin
August 18, 2026
in Gallery, movies, politics
0 0
0
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

*పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్*

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

బహుజన చక్రవర్తిగా కీర్తి పొందిన చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి రూపొందించిన యానిమేషన్ మూవీ “సర్దార్ సర్వాయి పాపన్న”. ఈ సినిమాను వి.జి.మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. దీపక్ న్యాతి నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు వహిస్తున్నారు. ఈ యానిమేషన్ మూవీ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – మేము ఆహ్వానించగానే మా కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని ఈ నెల 21న రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఈ చిత్రాన్ని మా ఆర్కే ఫిలింస్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. పన్నుల దోపిడీ నుంచి పేద ప్రజలను కాపాడిన వీరుడు సర్దార్ పాపన్న. బడుగు, వెనకబడిన కులాల వారిని ఒక్కటి చేసి పోరాడం సాగించాడు, 30 కోటలను జయించాడు. గోల్కొండ కోటపై కూడా తిరుగుబాటు చేశాడు. అలాంటి ధీరుడిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. నేను పాతికేళ్ల కిందట సర్వాయి పాపన్న సినిమా రూపొందించాను. అప్పటికి ప్రజల్లో ఆయన గురించి అవగాహన లేదు. ఈ రోజు పల్లె పల్లెనా సర్దార్ పాపన్న విగ్రహాలు ఉన్నాయి. ఆయన చరిత్ర గురించి తెలిసింది. ఆ ధీరుడి నేపథ్యంతో సినిమా రూపొందించిన వెంకటేష్ గౌడ్ ను అభినందిస్తున్నా. సర్దార్ సర్వాయి పాపన్న సినిమాకు పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా అన్నారు.

దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి మాట్లాడుతూ – సర్దార్ సర్వాయి పాపన్న 376 జయంతి సందర్భంగా ఈ రోజు మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నాం. పాపన్న గురించి అనేక గ్రంథాల్లో సమాచారం సేకరించి ఈ సినిమాను రూపొందించాను. బాహుబలి లా మా సినిమా కూడా అలాంటి భారీ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇస్తుందని నమ్ముతున్నాం. నాకున్న పరిమితుల్లో అనేక వ్యయప్రయాసలకు ఓర్చి ఈ సినిమాను రూపొందించాను. ప్రేక్షకులు మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా అన్నారు.

హీరోయిన్ పాయల్ ముఖర్జీ మాట్లాడుతూ – సర్దార్ సర్వాయి పాపన్న మూవీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. ఆ సీన్స్ అన్నీ నాకు బాగా నచ్చాయి. సినిమా కూడా ఇలాగే మనందరికీ నచ్చేలా ఉంటుందని నమ్ముతున్నాను. ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా అన్నారు.

సింగర్ ఏపూరి సోమన్న మాట్లాడుతూ – కోట్లాది మంది బహుజనులు ఈ సినిమా చూసేందుకు వేచి ఉన్నారు. సబ్బండ కులాలను ఏకం చేసి గెరిల్లా పోరాటంతో జైత్రయాత్ర చేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఆయన చరిత్రతో రూపొందించిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అన్నారు.

ప్రముఖ రచయిత, పాత్రికేయుడు పొన్న రవిచంద్ర మాట్లాడుతూ – సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను చాలా మంది వక్రీకరించారు. కానీ దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ చరిత్రను సమగ్రంగా అధ్యయనం చేసి ఆయన చరిత్రను నిజంగా ప్రజల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ ప్రయత్నం చేసినందుకు వెంకటేష్ గౌడ్ ను, మూవీని రిలీజ్ చేస్తున్న రామకృష్ణ గౌడ్ ను అభినందిస్తున్నా అన్నారు.

మాజీ ఎంపీ మధు యాస్కి గౌడ్ మాట్లాడుతూ – సమసమాజాన్ని స్థాపించేందుకు కృషి చేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఈ రోజు ఆయన 376 జయంతి. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం, ఆ కార్యక్రమంలో నేను అతిథిగా పాల్గొనడం సంతోషంగా ఉంది. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ట్యాంక్ బండ్ మీద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది. లక్షలాది మంది కోరిక నెరవేరుతున్న రోజు ఇది. అందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి , మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అభినందనలు. అలాగే తెలంగాణ తొలి మండలి ఛైర్మన్ గా స్వామి గౌడ్ గ్రామ గ్రామాన తిరిగి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలు ఏర్పాటు చేయించారు. అలాంటి వీరుడి చరిత్రను కళ్లకు కట్టినట్లు తెరకెక్కించిన దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆయనకు సెల్యూట్ చేస్తున్నా. ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న రామకృష్ణ గౌడ్ గారు 2003లోనే సర్వాయి పాపన్న సినిమా తీసిన ఘనత పొందారు. ఆయనకు ఈ సినిమా మంచి విజయం అందించాలని కోరుకుంటున్నా అన్నారు.

తెలంగాణ శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ – మేమంతా ఎదురు చూస్తున్న రోజు ఇది. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేస్తుండటం సంతోషంగా ఉంది. పార్టీలకు అతీతంగా ఎంతోమంది ఇందుకోసం కృషి చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న సినిమాను అద్భుతంగా రూపొందించారు వెంకటేష్ గౌడ్ గారు. ఈ సినిమాను థియేటర్స్ లో ప్రతి ఒక్కరూ చూడాలి. ఈ నెల 21న మన రామకృష్ణ గౌడ్ గారు రిలీజ్ చేస్తున్నారు. వారి ప్రయత్నం సక్సెస్ కోవాలని కోరుకుంటున్నా అన్నారు.

ఈ కార్యక్రమంలో బి.సి. సాధికార సంఘం అధ్యక్షులు కొండ దేవన్న, గాయకుడు ఏపూరి సోమన్న, దిల్ సుఖ్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్ గౌడ్, సర్దార్ పాపన్న వారసుడు రాజన్న, గౌడ సంఘాల నాయకులు గట్టు రామచంద్రరావు, హీరోయిన్ పాయల్ ముఖర్జీ, డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ, డైరెక్టర్, రైటర్ దీపక్ న్యాతి, తదితరులు పాల్గొన్నారు.

టెక్నీషియన్స్
———————–
వీఎఫ్ఎక్స్, సూపర్ విజన్ – పి. శ్రీనివాస్
ఎడిటర్ – సతీష్ పెటేటి, మణి
సినిమాటోగ్రఫీ, విజువల్ డైరెక్షన్ – మిర్జాపురి సైమన్
లీడ్ ఏఐ విజువల్ డైరెక్టర్ – సురేష్ మల్ల
మ్యూజిక్ సూపర్ వైజర్, లిరిక్స్ – వెంకటేష్ గౌడ్ లింగంపల్లి
బ్యానర్ – వి.జి. మూవీ మేకర్స్
నిర్మాత, దర్శకత్వం – వెంకటేష్ గౌడ్ లింగంపల్లి
రిలీజ్ – ఆర్ కే ఫిలింస్ (డా.ప్రతాని రామకృష్ణ గౌడ్)
పీఆర్ఓ – చందు రమేష్

Previous Post

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

Next Post

రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

Next Post
రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా "దొరికిందా" చిత్రం ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్
movies

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

by admin
October 3, 2026
0

...

Read more
సీనియర్ దర్శకుడు  బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

సీనియర్ దర్శకుడు బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

October 3, 2026
‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

October 2, 2026
ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

September 30, 2026
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

September 22, 2026
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

September 22, 2026
లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

September 16, 2026
ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

September 10, 2026
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

September 8, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In