• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

‘సాక్షి’ చిత్రం టైటిల్ విడుదల…

admin by admin
August 14, 2022
in movies
0 0
0
‘సాక్షి’ చిత్రం టైటిల్ విడుదల…
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా ‘సాక్షి’ చిత్రం టైటిల్ విడుదల

చేతన్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై మట్టిపల్లి ఆంథోనీ దర్శకత్వంలో ఆదర్శ్, చిత్ర శుక్ల హీరో, హీరోయిన్లుగా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, జయలలిత, సుదర్శన్, భరణి ముఖ్య తారాగణంగా నిర్మాత చేతన్ రాజ్ నిర్మించిన చిత్రం ‘సాక్షి’. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ఈ సందర్బంగా ..
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. సమాజంలో నేడు ఆడపిల్లలపై లైంగిక దాడులు, అరాచకాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలు ఎన్నో మనం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తరుణంలో జనాన్ని ఉద్రేకపరిచే, ఉత్తేజపరిచే వాళ్లకు విజ్ఞానాన్ని పెంపొందింపజేసే చిత్రాలు రావలసిన అవసరం ఉంది. అలాంటి చిత్రమే ఈ ‘సాక్షి’ అని అనుకుంటున్నాను. ఈ చిత్రం మహిళా ఇతివృత్తమని చెప్పారు. చేతన్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై మట్టిపల్లి ఆంథోనీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో నటించిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
లైన్ ప్రొడ్యూసర్ సూర్య సూర్యాని మాట్లాడుతూ.. చేతన్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ అనేది గుజరాత్ లో ప్రారంభమైంది. అయితే.. తెలుగు సినిమా మీద ప్రేమతో ఇక్కడికి వచ్చి ‘సాక్షి’ అనే చిత్రాన్ని మీ ముందుకు తెస్తున్నాం. ఈ సందర్బంగా మా చిత్రం టైటిల్ ని ఆవిష్కరించి, మాకు ఎంతో ఆనందాన్ని కలగజేసిన ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. తమ తొలి ప్రయత్నగా నిర్మించిన ‘సాక్షి’ని ఆశీర్వదించి..ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇదే బ్యానర్ లో వరుసగా సినిమాలు చేయాలన్న సంకల్పంతో ఉన్నాం. ఈ చిత్రంతో పాటు, మరో రెండు సినిమాలు ఫ్లోర్ మీద ఉన్నాయి. ప్రతీ ఏడాది 3 నుంచి 4 సినిమాలు నిర్మించాలన్న పట్టుదలతో ఉన్నాం. అందుకు మీ అందరి సహకారం ఎప్పుడూ ఉంటుందని.. ఉండాలని ఆకాక్షిస్తున్నాం అని పేర్కొన్నారు.
హీరో ఆదర్శ్ మాట్లాడుతూ…చేతన్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఒక మంచి సినిమా ద్వారా హీరోగా టాలీవుడ్ కు పరిచయమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకు అవకాశమిచ్చిన దర్శకులు మట్టిపల్లి ఆంథోనీతో పాటు, లైన్ ప్రొడ్యూసర్ సూర్య సూర్యానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. డైరెక్టర్ ఆంథోనీ టేకింగ్, మేకింగ్ స్టైల్ ఎంతో డిఫరెంట్ గా ఉంటుంది. ఆ స్టైల్స్ నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఈ చిత్రానికి సంగీతం అందించిన గోపి సుందర్, ఛాయాగ్రహణం సమకూర్చిన కోటి, కొరియో గ్రఫీ గణేష్ మాస్టర్ లకు ఇతర టెక్నీషియన్లకు నా కృతజ్ఞతలు. అందరి కృషివల్లే ఈ ‘సాక్షి’ అవుట్ ఫుట్ అనుకున్న రేంజ్ లో వచ్చింది అని నేను చెప్పడం కాదు.. సినిమా చూశాక మీరే చెబుతారు. మా చిత్రం టైటిల్ ని ఆవిష్కరించిన ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అని అన్నారు.
క్రియేటివ్ క్రాఫ్ట్స్, మీడియా పార్ట్ నర్ పోణంగి హరీష్ మాట్లాడుతూ… మహిళా ఇతివృత్తము ప్రధానంగా నిర్మించిన ఈ ‘సాక్షి’ చిత్రం టైటిల్ ని ఆవిష్కరించి మమ్మల్ని ఆశీర్వదించిన ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇక నుంచి మంచి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాలన్నదే మా లక్ష్యంగా పెట్టుకున్నాం. మీ అందరి ఆశీర్వాదాలు చేతన్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఉంటాయని ఆశిస్తున్నాం అని తెలిపారు.
ఈ సందర్బంగా జరిగిన ‘సాక్షి’ చిత్రం టైటిల్ ఆవిష్కరణ లో తెహల్కా న్యూస్ ఎడిటర్ కె. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Previous Post

ఆగస్ట్ 26న ‘భళా చోర భళా’ థియేటర్లలో విడుదల

Next Post

ఓటీటీలో దూసుకెళ్తోన్న‌ లెస్బియ‌న్ చిత్రం `హోలీ వుండ్‌`

Next Post
ఓటీటీలో దూసుకెళ్తోన్న‌ లెస్బియ‌న్ చిత్రం `హోలీ వుండ్‌`

ఓటీటీలో దూసుకెళ్తోన్న‌ లెస్బియ‌న్ చిత్రం `హోలీ వుండ్‌`

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…
movies

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

by admin
May 31, 2026
0

...

Read more
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

May 31, 2026
జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

May 25, 2026
వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

May 23, 2026
మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

May 22, 2026
ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

May 19, 2026
నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

May 19, 2026
ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

May 16, 2026
తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

May 11, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In