‘పలాస 1978’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న హీరో రక్షిత్ అట్లూరి కొత్త చిత్రం “ఆపరేషన్ రావణ్”. సుధాస్ మీడియా బ్యానర్ మీద ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్న ఈ న్యూ ఏజ్ యాక్షన్-సస్పెన్స్ థ్రిల్లర్ ఆపరేషన్ రావణ్ లో రక్షిత్ అట్లూరి సరసన సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటించారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోన్న ఈ మూవీ నుంచి ‘ఫస్ట్ థ్రిల్’ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకులు మారుతి, కళ్యాణ్ కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా
గేయ రచయిత ప్రణవం మాట్లాడుతూ.. “నాకు ఈ అవకాశం ఇచ్చిన టీమ్ కు ధన్యవాదాలు. నేను ఈ చిత్రంలో మూడు పాటలు రాశాను. ఈ గ్లింప్స్ చాలా బాగా వచ్చింది. మొత్తం టీమ్ కు ఆల్ ద బెస్ట్ చెబుతున్నాను.. “అన్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ” ఓ తండ్రి కొడుకును పెట్టి డైరెక్ట్ చేయడం అరుదుగా జరుగుతుంది. ఆ అరుదైన ఘటన ఈ ఆపరేషన్ రావణ్ కు జరిగింది.నాకు ప్రసాద్ గారు మంచి ఫ్రెండ్. ఆయనలో చాలా ప్యాషన్ ఉంది. సినిమాను జాగ్రత్తగా తీయించుకునేవారు. అందుకు పలాస, లండన్ బాబులు ఉదాహరణలు. అలాంటి తను ఓ రోజు కథ రాసుకున్నాను. నేనే డైరెక్ట్ చేస్తున్నాను అన్నారు. ఆశ్చర్యపోయాను. తర్వాత టీజర్ చూపించారు. చూడగానే చాలా ప్రామిసింగ్ గా ఉంది. కథను మాత్రమే నమ్మి సినిమా తీసినట్టు అనిపించింది. అసలు తండ్రి కొడుకుతో ఇలాంటి సినిమా తీయాలన్న ఆలోచనే గొప్పగా ఉంది. మీ ఆలోచనలే మీ శతృవులు అనే క్యాప్షన్ కూడా బావుంది. ఈ ఫస్ట్ థ్రిల్ బావుంది. రక్షిత్ తో పాటు ఎంటైర్ టీమ్ కు ఆల్ ద బెస్ట్.. “. అన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ .. ” రక్షిత్ అంతకు ముందు రెండు సినిమాలు చేశాడు. పలాసలో స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ చూపించాడు. ప్రసాద్ గారు డైరెక్షన్ చేస్తా అన్నప్పుడు నవ్వుకున్నా. బట్ ఇప్పుడు ట్రైలర్ చూశాక చాలా బావుంది. అద్భుతంగా ఉంది. రాధిక గారు ఒప్పుకున్నారు అంటే దర్శకుడిలో విషయం ఉందనుకున్నాను. మంచి తండ్రి, మంచి టేస్ట్ ఉన్న దర్శకుడు, నిర్మాత ప్రసాద్. వెంకట్ సత్య అనే పేరుతో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. రక్షిత్, ప్రసాద్ ను అభినందిస్తూ.. ఈ ఫస్ట్ థ్రిల్ చాలా బావుంది. నాకు కథ కూడా తెలుసు. ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను.. ” అన్నారు.
దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ .. ” చాలామంది సినిమా చేద్దాం అనుకున్నప్పుడు వెరైటీ స్టోరీ అని చెబుతున్నారు. హీరో ఎవరు అంటే ఫస్ట్ టూ ఆప్షన్స్ లో రక్షిత్ పేరు ఉంటుంది. అది అతని సక్సెస్ అని నేను అనుకుంటున్నా. రెగ్యులర్ కథల్లో ఎవరైనా చేయొచ్చు. ఓకొత్త కథ అనుకున్న ఓ హీరో మైండ్ లోకి వచ్చాడంటే అతను ఎంత ఇంప్రస్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అతను చేస్తోన్న ఆపరేషన్ రావణ్, నరకాసుర, శశివదనే అన్నీ బావుండాలని కోరుకుంటున్నా. ఇక దర్శకుడు ప్రసాద్ గారు ఏ ఫీల్డ్ లో ఉన్నా సక్సెస్ అవుతారు. ఆయన చాలామంచి వ్యక్తి. ఆయన నిర్మాతగా, దర్శకుడుగా సక్సెస్ కావాలి. రక్షిత్ తోనే కాకుండా వేరే హీరోలతో కూడా చేయాలి. రీ రికార్డింగ్ బావుంది. ఫస్ట్ థ్రిల్ కూడా ఎక్స్ పెక్ట్ చేసిన దానికంటే బావుంది. సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్.. ” అన్నారు.
సంగీత దర్శకుడు శ్రావణ వాసుదేవన్ మాట్లాడుతూ.. ” నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రసాద్ గారికి థ్యాంక్యూ. రెగ్యులర్ గా పాటలు చేయడం వేరు. కానీ ఈ మూవీ ప్రాసెస్ లో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాను. ప్రసాద్ గారు నాకు అలాంటి సిట్యుయేషన్స్ ఇచ్చారు. రాధికా మేడమ్ మీకు నేను పెద్ద ఫ్యాన్. పాటలకు సంబంధించి మంచి లిరిక్స్ ఇచ్చారు. అందరికీ ఆల్ ద బెస్ట్.. థ్యాంక్యూ.. ” అన్నారు.
శశివదనే నిర్మాత అహితేజ మాట్లాడుతూ.. ” ఈ గ్లింప్స్ చూశాను. చాలా చాలా నచ్చింది నాకు. ముందుగా డెబ్యూ డైరెక్టర్ గారి కంగ్రాట్స్. నా అక్షర సినిమా తర్వాత ప్రసాద్ గారు కాల్ చేశారు. కొంత గ్యాప్ తర్వాత నేను ఓ కథ చెప్పాను. అప్పటికే రావణ్, నరకాసుర కథలు డిఫరెంట్ గా ఉన్నాయి. మా సినిమా మంచి లవ్ స్టోరీగా వస్తోంది. నిర్మాతల గురించి ఆలోచించే వ్యక్తి రక్షిత్ గారు. నేను చూసిన హీరోలకు భిన్నమైన క్యారెక్టర్ రక్షిత్ గారిది. ఇలాంటి హీరోలు ఉండరు. ఆయన మార్కెట్ పెరిగినా.. అందులో సగంలోనే సినిమా చేద్దాం అంటారు రక్షిత్ గారు. క్యారవాన్ కూడా అడగరు. ఇలాంటి హీరోలుంటే నిర్మాతలకు మేలు జరుగుతుంది. పెద్ద బ్యానర్స్ కూడా రక్షిత్ లాంటి హీరోలను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను.. ” అన్నారు.
అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ .. “45డేస్ లో షూటింగ్ చేశాం అని ప్రసాద్ గారు చెబితే షాక్ అయ్యాను. చాలా చాలా బాగా చేశారు. విజువల్స్, ఆర్ఆర్ అదిరిపోయాయి. గ్లింప్స్ చూస్తోంటే అప్పుడే అయిపోయిందా అనిపించింది. రక్షిత్ లాంటి హీరో ఉంటే ఏ ప్రొడ్యూసర్ అయినా హ్యాపీగా ఉంటారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ .. ” అన్నారు.
స్వామి మాట్లాడుతూ.. ” ఈ చిత్ర దర్శకుడు సత్య గారు నాకు ఐదేళ్లుగా పరిచయం. ఎప్పుడు కలిసినా సినిమా గురించే మాట్లాడతారు. మంచి బిజినెస్ మేన్ అయినా గొప్ప సాహిత్యాభిలాషి. ఎన్నోపుస్తకాలు చదివారు. అప్పుడే ఆయన ఓ మంచి ఆలోచనతో సినిమా చేస్తారు అనుకున్నా. అలాగే మీ ఆలోచనలే మీ శతృవులు అనే మంచి పాయింట్ తో ఆపరేషన్ రావణ్ తీశారు. ఈ ఫస్ట్ థ్రిల్ చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఇది చూసిన తర్వాత ఆయన ఓ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అవుతాడు అనిపించింది. ఈ చిత్రం తండ్రి కొడుకులకు చాలా పెద్ద పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.. ” అన్నారు.
చిత్ర రచయిత లోహిత్ మాట్లాడుతూ.. ” రాధికా మేడమ్ గారి ముందు మీతోమాట్లాతున్నా అందుకు కారణం ప్రసాద్ గారే. ఎందరో మహానుభావులు.. శ్రీ రంగం శ్రీనివాసరావు గారి నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి వరకూ నేను రచయిత కావడానికి స్ఫూర్తినిచ్చిన అందరికీ వందనాలు.. ” అన్నారు.
జర్నలిస్ట్ మూర్తి మాట్లాడుతూ.. “ఇప్పటి వరకూ మీ అందరికీ స్వీట్ మ్యాజిక్ ప్రసాద్ గారు తెలుసు. వాళ్లబ్బాయి రక్షిత్ తెలుసు. కానీ ఈ సినిమా తర్వాత ఆయన స్క్రీన్ మ్యాజిక్ ప్రసాద్ అవుతారు. ఆపరేషన్ రావణ్ టీమ్ అందరికీ కాంగ్రాట్యులేషన్స్.. ఆల్ ద బెస్ట్.. థ్యాంక్యూ.. ” అన్నారు .
నటుడు రఘు కుంచె మాట్లాడుతూ.. ” పలాస మూవీ స్టోరీ డిస్కషన్స్ లో .. ప్రసాద్ గారి ఇన్వాల్వ్ మెంట్ చూసినప్పుడల్లా నాకో డౌట్ వచ్చేది. ఈయనకి చిన్నప్పుడు యాక్టర్ అవ్వాలని ఉందేమో అనిపించేది. అదే టైమ్ లో ఆయనలో మంచి రైటర్ కూడా ఉన్నాడు. పలాస టైమ్ లో ఆయన రైజ్ చేసిన క్వశ్చన్స్ చూస్తే ఆయన డైరెక్టర్ అవుతాడు అనుకున్నా. చూస్తే చాలా కామ్ గా ఉండే ప్రసాద్ గారు ఈ రేంజ్ వయొలెన్స్ తోసినిమా తీయడం చూస్తే ఆశ్చర్యంగా ఉంది. రక్షిత్ చాలా డీసెంట్ పర్సన్. గోల్డెన్ స్పూన్ తో పుట్టినా.. చాలా మర్యాదస్తుడు. బాలీవుడ్ లో రాకేష్ రోషన్, హృతిక్ రోషన్ లా మీ తండ్రి కొడుకులు పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. రాధిక మేడమ్ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ” అన్నారు.
దర్శకుడు వెంకట్ సత్య మాట్లాడుతూ.. ” పిలవగానే వచ్చిన ముఖ్య అతిథులకు ధన్యవాదాలు. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణం రాధిక మాడమ్ గారు. ఎన్నో సినిమాలు చేసి, ఎంతోమంది గొప్ప దర్శకులతో పనిచేసిన రాధిక గారు ఈ సినిమా చేయడం దైవానుగ్రహంగా భావిస్తున్నాను.. ” అన్నారు.
నటి రాధిక మాట్లాడుతూ.. “అందరూ వచ్చి ఈ ఫస్ట్ థ్రిల్ లాంచ్ ను బ్లెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. దర్శకుడు, హీరో తండ్రి కొడుకులు అని నాకు ఇప్పుడే తెలిసింది.నాకు కథ చెప్పినప్పుడు హీరో ఎవరూ అంటే రక్షిత్ అన్నారు. అతనెవరు అంటే పలాస చూడండి అన్నారు. నేను పలాస చూశాను. కానీ మరోసారి చూశాను. ఇక ఈ మూవీ షూటింగ్ లో కూర్చున్నప్పుడు నాకు ఆ ఫిల్మ్ బాగా నచ్చింది. పలాస రైటింగ్ ఎవరూ అంటే నేనే అన్నారు. చాలా ఆశ్చర్యపోయాను. ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్ చాలా కామ్ గా పనిచేసుకుంటూ వెళ్లారు. కామ్ గా ఉన్నా.. అవుట్ పుట్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. చాలా ఎఫర్ట్ పెట్టారు. నా ఎక్స్ పీరియన్స్ ప్రకారం ఎఫర్ట్ నెవర్ ఫెయిల్స్. హార్డ్ వర్క్ ఎప్పుడూ ఫెయిల్ కాదు. ఈ పిక్చర్ లో ఉన్న అందరు ఆర్టిస్టులు, హీరోయిన్, మాస్క్ విలన్ అంతా బాగా చేశారు. వాళ్లంతా సీజన్డ్ ఆర్టిస్టులు. వాళ్ల టాలెంట్ బయటకు తీసుకు రావడమే దర్శకుడి పని. నాకు ఎప్పుడూ డిఫరెంట్ రోల్స్ చేయాలనే కోరుకుంటాను. ఇలాంటి తెలుగు సినిమాలు వస్తే డేట్స్ అడ్జెస్ట్ చేసుకుని మరీ చేస్తాను. రక్షిత్ చాలా హార్డ్ వర్కింగ్ అండ్ సిన్సియర్ పర్సన్. అతని కళ్లు చాలా బావుంటాయి. అందరికీ ఆల్ ద బెస్ట్. ఆపరేషన్ రావణ్ హిట్ కావాలి.. థ్యాంక్యూ..” అన్నారు.
హీరో రక్షిత్ మాట్లాడుతూ.. ” అందరికీ నమస్కారం.. ఇక్కడికి వచ్చిన మారుతి గారు, భరద్వాజ గారికి, కళ్యాణ్ కృష్ణ గారికి థ్యాంక్యూ. ఈ మూవీ టెక్నీషియన్స్ గురించి తర్వాత ఈవెంట్స్ లోమాట్లాడతాను. మా సినిమా ఫస్ట్ సక్సెస్ రాధిక గారు ఒప్పుకున్నప్పుడే జరిగింది. వెంకట సత్య వర ప్రసాద్ .. మా నాన్నగారు.. నా ప్రాణం.. ఈ చిత్రానికి దర్శకుడు. 1995లో స్వీట్ మ్యాజిక్ స్థాపించారు. అప్పుడు ఏం లేదు. కానీ ఇప్పుడు కొన్ని వేలమందికి ఉద్యోగం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోస్వీట్ మ్యాజిక్ తెలియని వారు ఉండరు. ఇప్పుడు ఆపరేషన్ రావణ్ తీశారు. ఈ మూవీ దేశం అంతా తెలుస్తుందనుకుంటున్నా. ఏదో డైరెక్షన్ అంటే డైరెక్షన్ చేశారు అని కాకుండా.. అన్ని విషయాలు చాలా క్షుణ్నంగా పరిశీలించి నేర్చుకుని చేశారు. ఎర్లీ మార్నింగ్ అందరికంటే ముందే సెట్స్ లో ఉండేవారు. సినిమా చాలా బాగా వచ్చింది. మా ఈ కాన్ఫిడెంట్ కు కారణం అదే. పలాస గురించి ఓ కాలేజ్ ఈవెంట్ లో చెప్పాను. ఈ సినిమా చూడండి.. చూశాక నచ్చకపోతే నా కాలర్ పట్టుకోండి అని. ఇప్పుడు అంతకు మించిన కాన్ఫిడెన్స్ తో చెబుతున్నాను. నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందీ సినిమా. చాలా పెద్ద దర్శకుడు ఎలా హ్యాండిల్ చేస్తారో అలా హ్యాండిల్ చేశారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా ప్రయాణంలో మా తమ్ముడు, మా అమ్మ సపోర్ట్ మరలవలేనిది.. థ్యాంక్యూ.. ” అన్నారు.
నటీనటులు: రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్, రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, కెఎ పాల్ రాము, విద్యా సాగర్, టీవీ5 మూర్తి, కార్తీక్ తదితరులు
సంగీతం: శరవణ వాసుదేవన్
మాటలు: లక్ష్మీ లోహిత్ పూజారి
ఎడిటర్: సత్య గిద్దుటూరి
ఆర్ట్: నాని.టి
ఫైట్స్: స్టంట్ జాషువా
కొరియోగ్రఫీ: JD మాస్టర్
లిరిక్స్: వెంకట సత్య, ప్రణవం & పూర్ణాచారి
ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీపాల్ చొళ్లేటి
పి ఆర్ ఓ: జి.ఎస్.కె మీడియా
నిర్మాత: ధ్యాన్ అట్లూరి
రచన-దర్శకత్వం: వెంకట సత్య
Operation Ravaan’s ‘First Thrill’ launch takes place in a grand way
Rakshit Atluri, who won critical acclaim with ‘Palasa 1978’, is coming up with a unique film ‘Operation Raavan’. Bankrolled by Dhyan Atluri under Sudhas Media banner, this new-age action-suspense thriller has Rakshit Atluri and Sangeerthana Vipin in the lead roles.
The film has completed the shooting and is currently undergoing post-production work and is all set to hit the screens soon. Ahead of the film’s release, ‘First Thrill’ from the movie has been launched today and the directors Maruthi and Kalyan Krishna attended this event as chief guests. With this first thrill glimpse, it is understood that the film is a mystery action thriller that revolves around psycho killings. Holding the caption ‘Your Thoughts are your Enemies’, the film teaser raised curiosity.
Speaking at this teaser launch event, lyricist Pranavam said, “Thank you to the team for giving me this opportunity. I have written three songs for this film. This glimpse has come very well. I wish all the best to the entire team.”
Speaking at this event, director Maruti said, “It is rare for a father to direct his son and that rare incident happened to Raavan. Prasad is a good friend of mine. He has a lot of passion. He used to make films carefully. Palasa and London Babu are examples of that. One fine day, he said that he has written the story and he is directing it as well. I was surprised. Later, after a few days, he showed me the teaser of the film and it was very promising. The caption of the film; ‘Your thoughts are your enemies’ is soo good. All the best to Rakshit and the entire team.”
Tammareddy Bharadwaja said, “Rakshit has done two films before. He gave a stunning performance in Palasa. I laughed when Prasad said to me he is going to direct a film. But now I have seen the trailer and it is very good. It is amazing. Also, I believe that the film has great content as an actress like Radhika garu accepted the movie. Prasad is a good father, director and producer with good taste. I know the story too. I want this movie to do well at the box office.”
Speaking at this event, director Kalyan Krishna said, ” I have heard the name of Rakshit from most of the directors who are planning to do some innovative films. I think that is his success. Anyone can do regular stories. I wish all his upcoming films Operation Raavan, Narakasura and Sasivadana to be big hits.”
“Director Prasad is a very good person. I wish him great success as a producer and director. also with other heroes. The first thrill was better than what I had expected. I wish the film a big success and all the best”, he added.
Talking on this occasion, Music director Shravana Vasudevan said, “Thanks to Prasad for giving me this opportunity. I faced many challenges in this movie as all the songs in the film are different from regular songs. I am a big fan of Radhika Madam. I am happy to work with her. All the best to the entire team. Thank you.”
Sasivadane producer Ahiteja also attended this event and said.. “I like this glimpse very much. First of all, congratulations to the debut director. Prasad called after my film Akshara. I told him the Sasivadana story. Already the stories of Rakshit’s Raavan and Narakasura are different. Even Sasivadam gives the audience a unique feel. The film is going to be a good love story. Rakshit is a person who thinks about the producers. Rakshit’s character is different from the heroes I have seen. He didn’t even ask for a caravan. He is a producer’s hero.”
Abhilash Reddy stated, “I was shocked when Prasad told me that he shot the film in 45 days. It was done very well. The visuals and RR were amazing. Any producer would be happy with a hero like Rakshit. I wish everyone a big success with this film. All the best.”
Swamy said, “I have known the director of this film, Satya for five years. Whenever we meet, he talks about the film. He is a good businessman but also a great lover of literature. He has read many books. So I am sure that he would have made this film with a very good concept. Also, Operation Raavan has a good point that your thoughts are your enemies. This first thrill is amazing. After seeing this first thrill, I am sure that he will become a successful director. I want this film to bring a lot of fame to the father and son”
Talking at the event, the writer of the film Lohit said, ” I am grateful to Prasad as it is because of him that today I got a chance to talk on this stage before an actress like Radhika Madam. From Sri Rangam Srinivasa Rao to Trivikram Srinivas, I salute everyone who inspired me to become a writer.”
Journalist Murthy said, “We all know Prasad as sweet magic Prasad, but after this movie, he will become the screen magic Prasad. Congratulations to all the Operation Raavan team. All the best .”
Actor Raghu Kunche said, ” When I have seen Prasad’s discussions and involvement in Palasa, I thought he can become a great director. Mainly, looking at the questions raised by him during Palasa shooting, I thought he will surely become a director. At the same time, he also had a good writer in him. It is surprising to see that Prasad, who looks very calm, is directing such a violent film. Rakshit is a very decent person. Even though he was born with a golden spoon, he is very polite. Like Rakesh Roshan and Hrithik Roshan in Bollywood, I wish your father and son duo will have a great future in Tollywood. I am a big fan of Radhika madam and I am happy that she is part of this movie. I want the film to achieve success.”
Director Venkat Satya said, “Thank you to all the chief guests who came here today at my request. Also, I want to convey my heartfelt thanks to Radhika Madam. She has done many films and worked with many great directors. I feel it is a blessing from God to do this movie with such a great actress.”
Actress Radhika said, “Thank you very much to all the people who attended this event today and gave their blessing. In this event itself, I just came to know that the director and the hero are father and son. When I heard this story, I asked about the hero in the film and the director said Rakshit is going to play the lead actor role. However, as I don’t know who Rakshit is, he asked me to watch Palasa. I saw Palasa. I liked the movie very much and I saw it again. Coming to this film, the director and his team have never compromised in getting great output. A lot of effort has been put in and I can say their hard work will not fail. All the artists in this film have done their part very well. They are all seasoned artists. The director’s job is just to bring out their talent and he has done it perfectly. I always wanted to do different roles. If Telugu films like this come out to me, I will adjust my dates and will give high priority to those films. Rakshit is a very hard-working and sincere person. His eyes speak a lot. All the best to everyone. Thank you.”
Hero Rakshit said, ” Thank you to Maruti Gary, Bharadwaj Garu and Kalyan Krishna Garu for coming here. I will talk about the technicians of this movie at later events. The first success of our film happened when Radhika Garu agreed to this movie. My father Venkata Satya Vara Prasad who is my life has directed this film. He established Sweet Magic in 1995. We used to have nothing at those times. But now he has given jobs to thousands of people through Sweet Magic. There would be no one in Andhra Pradesh who does not know about the sweet magic. Now, he has taken the megaphone with Operation Raavan. I hope this movie will get recognition across the nation. He gave his best as a director and he used to be on the sets early in the morning before everyone else. He has handled the film very well and it is the reason for our confidence. During a Palasa event, I requested the audience to watch the film and if anyone doesn’t like it, they can grab my collar. Now again I could say the same with the same confidence. heartfelt thanks to everyone who worked on this film. Also, I could never forget the support of my brother and my mother in the journey of this film. It is irreplaceable. Thank you.”
Starring: Rakshit Atluri, Sangeerthana Vipin, Radhika Sarath Kumar, Charan Raj, Kanchi, Rocket Raghava, Raghu Kunche, KA Paul Ramu, Vidya Sagar, TV5 Murthy, Karthik etc.
Music: Saravana Vasudevan
Dialogues: Lakshmi Lohit Pujari
Editor: Satya Giddthuri
Art: Nani.T
Fights: Stunt Joshua
Choreography: JD Master
Lyrics: Venkata Satya, Pranavam & Poornachari
Cinematography: Nani Chamidishetty
Executive Producer: Sripal Cholleti
P R O: GSK Media
Producer: Dhyan Atluri
Written-Directed by: Venkata Satya