• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

హన్సిక తో సింగిల్ షాట్ లో సింగిల్ క్యారెక్టర్ తో తీసిన ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’

admin by admin
January 30, 2023
in movies
0 0
0
హన్సిక తో సింగిల్ షాట్ లో సింగిల్ క్యారెక్టర్ తో తీసిన ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే తొలి ప్రయత్నంగా సింగిల్ షాట్ లో సింగిల్ క్యారెక్టర్ తో హన్సిక ప్రధాన మరియు ఒకే పాత్ర పోషించగా రాజు దుస్సా రచన దర్శకత్వంలో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ గా రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మిస్తున్న చిత్రం ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ రెడీ అయిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. అతి త్వరలో ట్రైలర్ విడుదల కానుంది.

ప్రపంచం లోనే మొదటి సారిగా సింగిల్ షాట్.. సింగిల్ క్యారక్టర్ తో హన్సిక నటించగా తీసిన సినిమా ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’. ఒక గంటా నలభై అయిదు నిముషాల పాటూ సాగే ఒక ఉత్కంఠ రేపే కథను సింగిల్ షాట్ లో అంతే ఎంగేజింగ్ గా తెరకెక్కించడం సాహసమే. హాలీవుడ్ లో సింగిల్ షాట్ టెక్నిక్ లో తెరకెక్కిన బర్డ్ మన్, 1917 చిత్రాల తరహాలో ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ చిత్రం రూపొందించబడింది. ఆ చిత్రాలు సింగిల్ షాట్ తో తీసినా చాలా క్యారక్టర్ల చుట్టూ కథ నడుస్తుంది. కానీ ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ ఒకే పాత్రతో రన్ అయ్యే సినిమా. ఇంకా రీల్ టైం, రియల్ టైం ఒకేలా ఉండి మనం ఆ సన్నివేశంలో ప్రత్యక్షంగా ఉన్నట్లు అనుభూతి చెందుతాం. డైలాగులు కూడా చాలా తక్కువగా అవసరమైనంత వరకే పరిమితమై గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోనే సినిమా జరుగుతుంది. ఈ వినూత్న ప్రయోగాన్ని భారతదేశం లోనే తొలిసారిగా తెలుగు లో చేయడం గొప్ప విషయం. ఈ చిత్రానికి ఎక్కడా గ్రీన్ మ్యాట్ వాడకుండా లైవ్ గా షూట్ చేసి సి జీ వర్క్ యాడ్ చేయడం ప్రత్యేక ఆకర్షణ. ఇది డైరెక్టర్ విజన్ కు డి ఓ పి ప్రతిభకు తార్కాణం. ఫస్ట్ కాపీ రెడీ అయిన ఈ సినిమా అనుకున్నదానికంటే చాలా బాగా వచ్చిందని చిత్రం బృందం కాన్ఫిడెంట్ గా ఉన్నారు. టెక్నికల్ గా సింగిల్ షాట్ లో సింగిల్ క్యారక్టర్ తో చేసిన ఈ మూవీ ఒక బెంచ్ మార్క్ గా నిలిచిపోతుంది.

సింగిల్ క్యారక్టర్ తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలోని పాత్రకు హన్సిక యాప్ట్. ఆవిడ సినిమాకి చాలా హెల్ప్ అయ్యారు. చిత్రం అంతా సింగిల్ షాట్ లో కేవలం తన పాత్ర మీదే నడిచే సినిమా కాబట్టి తన స్క్రీన్ ప్రెజెన్స్, ఎక్స్ప్రెషన్స్ తో మొత్తం చిత్రాన్ని తనే క్యారీ చేయాలి. తను ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. ఒక అదృశ్య శక్తి నుండి తనను తాను కాపాడుకునే అమ్మాయిగా ప్రతి షాట్ లో అద్భుతమైన హావభావాలు పలికించింది. హన్సిక కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. సినిమా చూశాక అందరి అభిప్రాయం ఇదే ఉంటుంది. సామ్ సి ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రీ రికార్డింగ్ ప్రాణం. దర్శకులు ఈ చిత్రం గురించి చెప్పినప్పుడే ఆయన ఈ చిత్రాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని ప్రత్యేక శ్రద్ధతో చేసిన బిజీఎం సినిమా ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. సినిమా చూస్తున్నంత సేపు పాత్రతో పాటూ మనం ప్రయాణిస్తున్న ఫీలింగ్ వస్తుంది. సామ్ తన మ్యూజిక్ తో ఆద్యంతం టెన్షన్ నీ క్రియేట్ చేశారు. బ్రహ్మ కడలి గారి ఆర్ట్ వర్క్ అద్భుతంగా కుదిరింది. ఆయన పనితనం అడుగడుగునా కనిపిస్తుంది. సింగిల్ షాట్ తో రన్ అయ్యే సినిమా కావడంతో అనుకున్న షేడ్ రావడం కోసం కెమెరామన్ కిషోర్ బోయిదాపు లైటింగ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని టెక్నికల్ గా చాలా కొత్తగా ప్రయత్నించారు. ఆయన సినిమాటోగ్రఫీ సినిమా మూడ్ కి అనుగుణంగా ఒక పర్ఫెక్ట్ సింక్ లో ఉండేలా చూసుకున్నారు. ఇక దర్శకులు రాజు దుస్సా గారు తను ఈ సింగిల్ షాట్ సింగిల్ క్యారక్టర్ తో సాగే స్టొరీ నీ నెరెట్ చేసిన దానికంటే బెటర్ గా తెరపైకి తీసుకురాగలిగారు. ప్రతి ఫ్రేమ్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది ప్రతి సెకండ్ కథతో లింక్ అయ్యి ముందుకు నడిపిస్తుంది. అంత పర్జెక్ట్ స్క్రీన్ ప్లే తో సినిమా తీశారు ఆయన. అందరూ ఇన్వాల్వ్ అయ్యి డెడికేటెడ్ గా చేయడంతో చిత్రం చాలా బాగా వచ్చింది. దేశంలోనే తొలిసారిగా సింగిల్ షాట్ సింగిల్ క్యారక్టర్ తో అతి తక్కువ డైలాగులతో తెరకెక్కిన ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చిన నిర్మాత బొమ్మక్ శివ గట్స్ ను మెచ్చుకోకుండా ఉండలేం. ఆయనకి ఉన్న ప్యాషన్ వల్ల చిత్రం ఔట్ పుట్ లావిష్ ప్రొడక్షన్ వాల్యూస్ తో తెరకెక్కింది. చిత్ర బృందం త్వరలోనే ట్రైలర్ విడుదల చేయనున్నారు. సినిమా కూడా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

టైటిల్ : వన్ నాట్ ఫైవ్ మినిట్స్
జానర్ : సైకలాజికల్ థ్రిల్లర్
హన్సిక మోత్వాని నటిస్తున్న ఈ చిత్రానికి
సాంకేతిక నిపుణులు
పోస్టర్ డిజైనర్ : సుధీర్ దొమ్మేటి
వి ఎఫ్ ఎక్స్ సూపర్వైజర్ : ఫణి విహారి గంటల
డి ఐ & కలరిస్ట్ : బి వి ఆర్ శివకుమార్
మేకప్ మాన్ : డెక్క బాలు
స్టంట్ మాస్టర్ : మల్లి
స్టిల్స్ : గుణకర్
ప్రొడక్షన్ ఎక్జిక్యూటివ్ : అట్లూరి సురేష్ బాబు
ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ & స్క్రిప్ట్ చీఫ్ అసోసియేట్ : రూప కిరణ్ గంజి
ఎస్ ఎఫ్ ఎక్స్ సూపర్వైజర్ : జైసన్ జోస్
పిఆర్ఓ : బి ఎ రాజు’s టీం
ఎడిటర్ : శ్యామ్ వడవల్లి
ప్రొడక్షన్ డిజైనర్ : బ్రహ్మ కడలి
డి ఓ పి : కిషోర్ బోయిదాపు
మ్యూజిక్ : సామ్ సి ఎస్
కో ప్రొడ్యూసర్ : బొమ్మక్ యషిత
ప్రొడ్యూసర్ : బొమ్మక్ శివ
రచన & దర్శకత్వం : రాజు దుస్సా

Previous Post

హీరో కార్తికేయ ‘బెదురులంక 2012’ షూటింగ్ పూర్తి, విడుదలకి సిద్ధం!

Next Post

రివ్యూ ; సువర్ణ సుందరి

Next Post
రివ్యూ ; సువర్ణ సుందరి

రివ్యూ ; సువర్ణ సుందరి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఇళయరాజా గారి ఆ ఒక్క మాటతోనే మేము విజయం సాధించాం- ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’ సక్సెస్ మీట్‌లో హీరో తక్ష్
movies

ఇళయరాజా గారి ఆ ఒక్క మాటతోనే మేము విజయం సాధించాం- ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’ సక్సెస్ మీట్‌లో హీరో తక్ష్

by admin
February 18, 2026
0

...

Read more
ప్ర‌భుత్వ కొలువుల‌కు చిరునామా- య‌ర్ర‌బండ‌

ప్ర‌భుత్వ కొలువుల‌కు చిరునామా- య‌ర్ర‌బండ‌

February 17, 2026
When Goodbye Becomes the Most Romantic Hello Story

When Goodbye Becomes the Most Romantic Hello Story

February 13, 2026
“ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల

“ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల

February 11, 2026
WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

February 10, 2026
టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

February 10, 2026
గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన  సినీ నటి మాళవిక మోహన్

గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన సినీ నటి మాళవిక మోహన్

February 9, 2026
“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

February 2, 2026
“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

February 2, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In