యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ హీరోగా రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్’ ప్రసన్న వదనం’. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
ఉగాది శుభ సందర్భంగా ఈ చిత్రంలోని నిన్నా మొన్న పాటని విడుదల చేశారు. విజయ్ బుల్గానిన్ ఈ పాటని వినగానే ఆకట్టుకునే లవ్లీ మెలోడీగా కంపోజ్ చేశారు. కిట్టు విస్సాప్రగడ అందించిన సాహిత్యం మరో ఆకర్షణగా నిలిచింది. శక్తిశ్రీ గోపాలన్, ఆదిత్య ఆర్.కె తమ అద్భుతమైన వోకల్స్ తో మెస్మరైజింగ్ చేశారు. ఈ పాటలో సుహాస్, పాయల్ కెమిస్ట్రీ చాలా అద్భుతంగా వుంది.
ఎస్.చంద్రశేఖరన్ డీవోపీ గా పని చేస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.
మే 3న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
నటీనటులు : సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ నందు, వైవాహర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని
నిర్మాతలు : మణికంఠ జె ఎస్, ప్రసాద్ రెడ్డి టి ఆర్
రచన, దర్శకత్వం: అర్జున్ Y K
డీవోపీ ఎస్.చంద్రశేఖరన్
సంగీతం: విజయ్ బుల్గానిన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎడ్వర్డ్ స్టీవెన్సన్ పెరేజీ, కందాళ నితీష్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ఆర్ట్: క్రాంతి ప్రియం
కాస్ట్యూమ్ డిజైన్: అశ్వంత్ బైరి & ప్రతిభా రెడ్డి కె
లైన్ ప్రొడ్యూసర్: వరద వెంకట్రమణ
పీఆర్వో : తేజస్వి సజ్జా
మార్కెటింగ్: ఫస్ట్ షో