దర్శకుడు వి.ఎన్. ఆదిత్య చేతుల మీదుగా ‘నెక్స్ట్ లెవల్’ ఫస్ట్ లుక్ విడుదల
తాహిర్, పల్లవి హీరోహీరోయిన్లుగా బత్తిని ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత బి. నరేష్ కుమార్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘నెక్స్ట్ లెవల్’. ఈ చిత్రంతో గోపీ దేవెళ్ళ దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. శ్రీనివాస్ వంగపల్లి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని ప్రముఖ నిర్మాత వి.ఎన్. ఆదిత్య తాజాగా విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఫస్ట్ లుక్ విడుదల అనంతరం దర్శకుడు వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ.. ‘‘బత్తిని ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత నరేష్‌గారు నిర్మించిన చిత్రం ‘నెక్ట్స్ లెవల్’. ఇప్పుడున్న టాప్ నిర్మాతలలో చాలా మంది NRIలే. వారి లిస్ట్‌లో నరేష్‌గారు కూడా చేరాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా విజయం సాధించి.. సినిమా టైటిల్‌కి తగ్గట్టుగా ఆయన కూడా ‘నెక్ట్స్ లెవల్’ ప్రొడ్యూసర్‌గా ఎదగాలని.. అందుకు ఈ సినిమా పునాది కావాలని కోరుకుంటున్నాను. మాములుగా అయితే.. కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడానికి చాలా మంది సీనియర్ నిర్మాతలే భయపడుతుంటారు. అలాంటిది నిర్మాతను ఒప్పించి.. నాకెంతో ఆప్తుడైన దర్శకుడు గోపి ఈ సినిమాని తెరకెక్కించాడు. ఆయన కూడా వేరే లెవల్ నుండి.. ఇప్పుడు నెక్ట్స్ లెవల్‌కి వచ్చాడు. అలాగే సంగీత దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణులు, హీరోహీరోయిన్లు ఇతర నటీనటులు అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా చాలా ప్రామిసింగ్‌గా ఉంది. నేను అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు చూశాను. ఈ సినిమా ఎవరినీ డిజప్పాయింట్ చేయదు. తప్పకుండా అందరూ ఈ సినిమా చూసి.. ఈ టీమ్‌ని ప్రయత్నాన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాను..’’ అన్నారు.
చిత్ర నిర్మాత బి. నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా బత్తిని ఫిల్మ్స్‌లో చేస్తున్న మొట్టమొదటి చిత్రమిది. కో ప్రొడ్యూసర్ శ్రీనివాస్‌గారు. మా మొదటి చిత్రంతో అంతా కొత్తవారిని ఎంకరేజ్ చేయాలనే ప్రయత్నం చేశాం. మంచి మెసేజ్ ఓరియంటెడ్ చిత్రమిది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన చిత్రమిది. ఫస్ట్ లుక్ విడుదల చేసిన దర్శకులు వి.ఎన్. ఆదిత్యగారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు..’’ అని అన్నారు.
చిత్ర దర్శకుడు గోపీ దేవెళ్ల మాట్లాడుతూ.. ‘‘ఇది నా మొదటి చిత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. అలాగే ఫస్ట్ లుక్ విడుదల చేసి.. మా టీమ్‌ని బ్లెస్ చేసిన వి.ఎన్. ఆదిత్యగారికి ధన్యవాదాలు. మంచి మెసేజ్‌తో ఈ చిత్రం తెరకెక్కించడం జరిగింది. అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇందులో ఉంది. స్లీపింగ్ ట్యాబ్లెట్‌పై ఈ సినిమా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాల్సిన అవసరం ఉంది. సహకరించిన అందరికీ ధన్యవాదాలు..’’ అని తెలిపారు.
కో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ వంగపల్లి మాట్లాడుతూ.. ‘‘బత్తిని ఫిల్మ్స్‌పై నా మిత్రుడు నరేష్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం చాలా గ్రాండ్‌గా తెరకెక్కుతోంది. మంచి మెసేజ్ ఇందులో ఉంది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా నిర్మిస్తున్నారు. దర్శకుడు గోపీ తన టాలెంట్ మొత్తం ఈ సినిమాకి చూపిస్తున్నారు. కొత్త నటీనటులు ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. అందరికీ ఆల్ ద బెస్ట్’’ అని అన్నారు.
హీరో తాహిర్, హీరోయిన్ పల్లవి మాట్లాడుతూ.. ఈ అవకాశం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.
తాహిర్, పల్లవి, మహేందర్ నాథ్, కోటి యాదవ్, తులసి మోహన్, శ్వేతాంజలి, మమత, రుషిత, సావిక తదితరులు నటించిన ఈ చిత్రానికి
రైటర్: సి.హెచ్. కిరణ్
సంగీతం: జై
సినిమాటోగ్రఫీ: ఎమ్‌డి. రఫీ
ఎడిటర్: ప్రసాద్ త్రిపర్ణం
పీఆర్వో: బి. వీరబాబు
సహనిర్మాత: శ్రీనివాస్ వంగపల్లి
నిర్మాత: బి. నరేష్ కుమార్ రెడ్డి
దర్శకత్వం: గోపీ దేవెళ్ల