దర్శకత్వం : తల్లూరి మణికంట
నిర్మాత : కాసు శ్రీనివాస్ రెడ్డి
సంగీతం : రఘు కుంచె
సినిమాటోగ్రఫీ : ఆదిత్య వార్ధన్
నటీనటులు సంజన, కార్తిక్, ఖయ్యుం తదితరులు ..
విడుదల : 18-02-2022
రేటింగ్ : 3 / 5
సంజన, కార్తీక్, ఖయ్యూమ్ ప్రధాన పాత్రల్లో నటించిన నీకు నాకు పెళ్లంట సినిమా ఫిబ్రవరి 18, 2022న థియేటర్లలో విడుదలైంది. బిగ్ బాస్ ఫేమ్ సంజన ప్రధాన పాత్ర పోషించింది. ఇది చిన్న చిత్రంగా అనిపించినప్పటికీ కంటెంట్ చాలా ఆసక్తికరంగా ఉంది, ముఖ్యంగా ఇది యువతకు కనెక్ట్ అయ్యే సినిమా. బిగ్ బాస్ ఫేమ్ సంజన నటించిన ఈ సినిమా ఎలా ఉంది. అసలు నీకు నాకు పెళ్లి జరిగిందా లేదా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్దాం.
కథ
బిగ్ బాస్ ఫేం సంజన ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమాలో ఆమె చాలా చెడు అలవాట్లు అంటే సిగరెట్, మందు, డేటింగ్ అంటూ నానా రకాల బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒక బాయ్ ఫ్రెండ్ పరిచయం అవుతాడు. అతనితో ప్రేమలో పడుతుంది. కొన్నాళ్ళకు అతనితో బ్రేక్ అప్ అవుతుంది. సంజన అలవాట్లను భరించలేక బాయ్ ఫ్రెండ్ వదిలేసి వెళ్లిపోతాడు. ఇంతలోనే ఒక మర్డర్ జరుగడంతో కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. అసలు సంజన జీవితం టర్న్ తీసుకోవడానికి అసలు మర్డర్ ఎవరు చేసారు ? ఎందుకు చేసారు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల ప్రతిభ :
బిగ్ బాస్ 2 లోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న సంజన చాలా గ్యాప్ తరువాత హీరోయిన్ గా నటించిన చిత్రమిది. ఇందులో సంజన పాత్ర అందరికి నచ్చుతుంది. నేటితరం అమ్మాయిగా గ్లామర్, నటనలో ఆకట్టుకుంది. ముక్యంగా కొన్ని రొమాంటిక్ సీన్స్ లో బాగా చేసింది. హీరో పాత్రలో కార్తీక్ ఆకట్టుకున్నాడు. అందమైన అమ్మాయిప్రేమించే వ్యక్తిగా .. ఆ తరువాత ఆమె టార్చర్ తట్టుకోలేక విడిపోయే యువకుడిగా బాగా నటించాడు. ఇక కమెడియన్ ఖుయ్యుమ్ పాత్ర నవ్విస్తూనే మరోవైపు ఆసక్తి కనబరిచేలా ఉంది. చాలా కాలం తరువాత ఖయ్యుమ్ కు మంచి పాత్ర దక్కింది. అలాగే మిగతా పాత్రల్లో ఎవరికీ చేసారు. మొత్తానికి ఓ ఆసక్తికర థ్రిల్లర్ గా సాగిన ఈ ఫన్ సినిమాలో అందరి నటన ఆకట్టుకుంటుంది.
టెక్నీకల్ హైలెట్స్ :
ఈ సినిమా విషయంలో అంచనాలకు అందేలా ఉండదు. టైటిల్ చూసి ఇదేదో రొమాంటిక్ ఎంటర్ టైమెంట్ సినిమా అనుకుని వెళితే ఓ సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా మారుతుంది. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించింది ఆదిత్య వార్ధన్. కథ ప్రకారం ఈ సినిమాకు అద్భుతమైన అందించారు. ఇక రఘు కుంచె అందించిన పాటలు, ఆర్ ఆర్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో రెండు పాటలు బాగున్నాయి. ఐతే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. ఓ ఆసక్తికర కథను తీసుకుని దానిని మరో యాంగిల్ లో నడిపించిన దర్శకుడు తాళ్లూరి మణికంట మేకింగ్ సూపర్ చెప్పాలి. కథ, కథనం విషయంలో దర్శకుడు చక్కగా నడిపించాడు. అయితే ఊహించని ట్విస్టుల విషయంలో దర్శకుడి ప్లానింగ్ అదిరింది. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. ఒక దృష్టి కోణంతో కథను నడిపించి.. ఆ తర్వాత మనం చూసిన కోణమే తప్పు అన్నట్లుగా మొత్తం కథను మరో కోణంలో మార్చి చూపించడం ఒక స్క్రీన్ ప్లే టెక్నిక్. ఒకప్పుడు కొత్తగా అనిపించినా.. ఈ తరహాలో చాలా కథలు వచ్చేయడంతో మామూలుగానే అనిపిస్తుంటాయి ఈ కథలు. ఈ తరహా సినిమానే అయినప్పటికీ.. ఏం జరగబోతోందన్నది ముందే ఒక అంచనాకు అయితే రాలేం. రెండున్నర గంటల సినిమాలో రెండు గంటల వరకు ఒక తరహాలో.. ఫ్లాట్ గా సాగిపోతుందీ సినిమా. అందులో మరీ కొత్తదనం ఏమీ కనిపించదు. కానీ కథనం మాత్రం చాలా వరకు ఎంగేజ్ చేస్తుంది.
విశ్లేషణ :
నీకు నాకు పెళ్లంట కొన్నిచోట్లేమో ఇది చాలా సీరియస్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. కాస్త ఉత్కంఠను ఫీలై ఆ మూడ్ లోకి వెళ్లే లోపు ఒక సిల్లీ సీన్ తో మొత్తం వ్యవహారాన్ని కామెడీ చేసి పడేస్తారు. పోనీ కామెడీ మూడ్ తోనే సినిమా చూద్దాం అనుకుంటే మళ్లీ ఎక్కడలేని సీరియస్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. మొత్తానికి క్రైమ్ కామెడీగా తీద్దామనుకుని రెండు కలిపి తీసినట్టు అనిపిస్తుంది. కానీ ఫస్టాఫ్ మీద పెట్టిన దృష్టి సెకండాఫ్ మీద కూడా చూపిస్తే బాగుండేది. ఫస్టాఫ్ పరుగులు పెట్టినా సెకండాఫ్ మాత్రం సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా పెద్దగా ట్విస్టులు లేకుండా ఊహించినట్లే ఉంటుంది. స్నేహం, ప్రేమ, ఎమోషన్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అని తెలుస్తోంది. డైరెక్టర్ మధ్యతరగతి విలువలను తెరపై చక్కగా చూపించాడు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా సన్నివేశాలను రూపొందించాడు. కానీ కథ, కథనం విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది !!
————-
Neeku Naku Pellanta Tom Tom Tom Movie Review
Directed by: Talluri Manikanta
Producer: Kasu Srinivas Reddy
Music: Raghu Kunche
Cinematography: Aditya Wardhan
Cast Sanjana, Karthik, Khayyum etc.
Released: 18-02-2022
Rating: 3/5
The movie Neeku Naku Pellanta starring Sanjana, Karthik and Khayyum in the lead roles was released in theaters on February 18, 2022. Bigg Boss Fame Sanjana played the lead role. Although it may seem like a short film, the content is very interesting, especially since it is a film that connects young people. This is how the movie starring Bigg Boss fame Sanjana looks like. Let’s go into the story to find out if you’re actually married to me or not.
Story
Bigg Boss Fame Sanjana played the lead role. In this movie, she has a lot of bad habits like cigarettes, drugs, dating and all kinds of bad habits. In the background a boyfriend is introduced. Falls in love with him. Will break up with him for years. Unable to cope with Sanjana’s habits, the boyfriend leaves. Meanwhile the whole story revolves around a murder. Who did the original Murder to take the real Sanjana life turn? You have to watch the movie to know why it was done.
Cast:
Entering Bigg Boss 2, Sanjana got a good craze in a short time and acted as the heroine after a long gap. Everyone loves Sanjana’s role in this. Glamorous as today’s girl, impressed in acting. Especially well done in some romantic scenes. Karthik impressed in the role of hero. As a man who loves a beautiful girl .. After that she acted well as a young man who could not bear the torture and broke up. The character of comedian Quyum, on the other hand, seems to be showing interest while smiling. Khayyum got a good role after a long time. As well as any of the other characters. All in all, the performance in this fun movie, which turned out to be an interesting thriller, is impressive.
Technical Highlights:
Expectations do not live up to the expectations of this film. If you look at the title and feel like a romantic entertainment movie, it turns into a super suspense thriller. Aditya Wardhan provided the cinematography for the film. According to the story the film has provided excellent. The songs provided by Raghu Kunche, R.R. are impressive. Two songs are especially good in this movie. So it would be better to take care of the editing. Director Talluri Manikanta Making Super has taken an interesting story and directed it in another angle. The director is well versed in the story and narration. However the director’s planning was thrilled in terms of unexpected twists. The longer the construction values the better. Running the story from one point of view is a screenplay technique of changing the whole story from one angle to another as if the angle seen later is wrong. Once upon a time it seemed new .. With so many stories coming out in this series, these stories seem normal. Even though this is a ready-made movie .. let’s not come to an estimate before what is going to happen. In a two-and-a-half hour movie, in one hour for two hours .. the movie goes flat. There seems to be nothing new in it. But storytelling engages a lot.
Analysis:
It feels like a very serious thriller if you can get me married somewhere. Feel the suspense and comedy the whole affair with a silly scene before going into that mood. If you want to watch a movie with a pony comedy mood, you have to make an effort to bring seriousness that is nowhere to be found again. The whole thing seems to have been taken together as a crime comedy. But it would have been nice if the focus on Fastoff had been shown on Secondoff as well. The second half feels stretched even though the first half runs. The climax is also as expected without the big twists. Friendship, love, emotions seem to be the big plus for this movie. The director showed middle-class values on screen and created scenes to make the audience feel family emotions. But it would have been nice to take the utmost care in terms of story, narrative !!