ది కింగ్ అఫ్ ఎంటర్ టైన్మెంట్ హీరో నవీన్ పోలిశెట్టి ఈజ్ బ్యాక్. గాయం నుంచి కోలుకున్న తర్వాత నవీన్ పోలిశెట్టి ఆహాలో అలరించారు. ఈ వారం తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3, 21, 22వ ఎపిసోడ్‌లలో మరోసారి తన ఎనర్జీటిక్ ప్రజెన్స్ అదరగొట్టారు. షో లో నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ని క్రియేట్ చేశారు.
ట్యాలెంట్ పవర్ హౌస్ అయిన నవీన్ పోలిశెట్టి క్రేజీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎపిసోడ్ ఈ వారం రాబోతోంది. తన ఎనర్జీ, డ్యాన్స్, కామెడీ టైమింగ్ తో కంటెస్టెంట్స్, జడ్జ్ లని మెస్మరైజ్ చేశారు. నవీన్ పడిన రెండు పాటలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
ఈ ఎపిసోడ్స్ లో చాలా హైలెట్స్ వున్నాయి. నవీన్ గాయం నుంచి కోలుకున్న తన జర్నీని చెప్పిన తీరు చాలా స్ఫూర్తిని ఇచ్చింది. ఆ కష్టమైన క్షణాలని కూడా చాలా హ్యూమర్స్ గా చెప్పడం అలరించింది. కష్టాన్ని కూడా ఎంత తేలిగ్గా దాటోచ్చో నవీన్ చెప్పిన తీరు గిలిగింతలు పెడుతూనే హార్ట్ టచ్చింగ్ గా అనిపించింది.
ఈ ఇక ఎపిసోడ్ లో నవీన్ పేల్చిన కామెడీ పంచులకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ గ్రౌండ్ బ్రేకింగ్ ఎంటర్ టైన్మెంట్ ఎపిసోడ్ కోసం ఆహా లో శుక్రవారం,శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3ని మిస్ అవ్వకండి.