• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఆధ్వర్యంలో పద్మశ్రీ మురళీమోహన్ కు ఘన సన్మానం

ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

admin by admin
August 11, 2026
in movies
0 0
0
నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఆధ్వర్యంలో పద్మశ్రీ మురళీమోహన్ కు ఘన సన్మానం
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

నటుడిగా, నిర్మాతగా, ప్రజా నాయకుడిగా సుదీర్ఘ ప్రస్థానం కొనసాగిస్తున్నారు మురళీమోహన్. ఆయన సేవలను గుర్తించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రధానం చేసింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఆయనను ఘనంగా సత్కరించింది. ఈ సన్మాన కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో

నరెడ్కో ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి కొప్పుల మాట్లాడుతూ – ఏపీ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ను మురళీమోహన్ గారు స్థాపించి క్రమశిక్షణ గల అసోసియేషన్ గా తీర్చిదిద్దారు. అదే నరెడ్కోగా, ఇప్పుడు క్రెడాగా మారింది. నరెడ్కోలో నేను 2006లో జాయిన్ అయ్యాయ. 2009 నుంచి అసోసియేషన్ లో వివిధ బాధ్యతలు చేపట్టాను. మురళీమోహన్ గారు మా అసోసియేషన్ కు చేసిన దిశానిర్దేశాన్ని ఇప్పటికీ పాటిస్తున్నాం. నెలలో రెండు సార్లు సమావేశం అవుతాం. జాతీయ స్థాయిలో మన బిల్డర్ మంచి పేరు తెచ్చుకున్నారు. కోవిడ్ టైమ్ లో కూడా క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించుకున్నాం. ఇదంతా మురళీమోహన్ గారు సూచించిన మార్గం. పద్మశ్రీ అవార్డ్ పొందిన సందర్భంగా ఆయనను సత్కరించుకోవడం సంతోషంగా ఉంది. అన్నారు.

ఎమ్మెల్సీ భానుప్రసాద్ మాట్లాడుతూ – తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మన బిల్డర్స్ తమ భుజాలపై మోస్తున్నారు. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మీరంతా చాలా కీలకం. మిగతా ఏ రంగాలైనా మీ తర్వాతే. మురళీమోహన్ గారు స్థాపించిన రియల్ ఎస్టేట్ సంస్థలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆయన వయసు పెరుగుతున్నా, మంచి ఆరోగ్యంతో ఉన్నారు. ఆయన విషయంలో ఏజ్ ఒక నెంబర్ అనుకోవచ్చు. మురళీమోహన్ గారి సమయపాలన, కమిట్ మెంట్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. అన్నారు.

ప్రముఖ బిల్డర్ డీఎస్ రావు మాట్లాడుతూ – మురళీమోహన్ గారికి పద్మశ్రీ అవార్డ్ సినిమాల వల్లే రాలేదు. ఆయన ఆర్ట్ అండ్ సోషల్ వర్క్ కు వచ్చింది. ఆయన ఎంతోమంది విద్యార్థులకు సాయం చేశారు, సపోర్ట్ గా నిలబడ్డారు. అలా సాయం పొందిన ఒక విద్యార్థి ఇటీవల మురళీమోహన్ గారికి పద్మశ్రీ వచ్చిన సందర్భంలో ఒక భావోద్వేగ లేఖ రాశారు. ఆ లెటర్ చదువుతుంటే ఎంతో ఎమోషనల్ అయ్యాను. మురళీమోహన్ గారికి ఈ రోజు జరుగుతున్న సత్కార కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. అన్నారు.

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ – ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. 1995లో ప్రారంభమైన నరెడ్కో ఇప్పుడు 350 మంది బిల్డర్స్ తో గొప్ప సంస్థగా ఎదిగింది. నిర్మాణరంగంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ అభివృద్ధిలో భాగస్వామిగా ఈ సంస్థ నిలుస్తోంది. ఏటా ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. వ్యాపారమే కాదు సమాజం బాగుంటే అందరం బాగుంటామనే ఆలోచనతో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మురళీమోహన్ గారు సినిమా, రాజకీయం, వ్యాపార రంగాల్లో విజయానికి మారుపేరుగా మారారు. ఆయన జీవితం ఎదగాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఆదర్శం. కృషి పట్టుదల క్రమశిక్షణతో మురళీమోహన్ గారు ప్రతి రంగంలో విజయం సాధించారు. వ్యక్తిగతంగా మంచి మనసున్న వారు మురళీమోహన్. మన తెలుగు నేలపై పుట్టిన వ్యక్తి దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అందుకోవడం మనందరికీ గర్వకారణం. కృష్ణ గారు, మురళీమోహన్ గారి నటనను నేను అభిమానిస్తాను. ఈ వేదిక మీద మురళీమోహన్ గారిని కలవడం ఆనందంగా ఉంది. అన్నారు.

పద్మశ్రీ అవార్డ్ గ్రహీత మురళీమోహన్ మాట్లాడుతూ – పద్మశ్రీ అవార్డ్ పొందిన తర్వాత ఎన్నో సత్కారాలు జరిగాయి. కానీ ఈ కార్యక్రమం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. వీళ్లంతా నా కుటుంబ సభ్యులు. పద్మశ్రీ అవార్డ్ వచ్చిన వెంటనే చాలా మంది ఫోన్ అభినందించారు. ఈ రోజు ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. శోభన్ బాబు గారు ఇచ్చిన సలహాతో నేను రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టాను. నా తమ్ముడు కిషోర్ ప్రతి సందర్భంలో నాకు తోడుగా నిలబడ్డాడు. అప్పట్లో రియల్ ఎస్టేట్ రంగం చాలా ఇబ్బందుల్లో అస్తవ్యస్తంగా ఉండేది. అమ్మిన భూమినే మళ్లీ మళ్లీ అమ్మేవారు. అలాంటివి జరగకుండా ఒక సంస్థను స్థాపించాలని నరెడ్కో ఏర్పాటుచేశాం. మన దగ్గరకు వచ్చే కస్టమర్ ని దేవుడిలా చూడాలని భావించాం. అదే స్ఫూర్తితో ఇప్పటికీ ఈ సంస్థ కొనసాగుతుండటం సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తితో మీరు మరింతగా ఎదగాలి. రాబోయో రోజుల్లో హైదరాబాద్ దేశంలోనే నెం.1 సిటీగా మారుతుంది. అలాగే అటు అమరావతి కొత్త రాజధాని అయినా పోటాపోటీగా ఎదగాలని కోరుకుంటున్నా. అన్నారు.

Previous Post

ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా పోస్టర్ లాంఛ్

Next Post

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న యానిమేషన్ మూవీ

Next Post
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న యానిమేషన్ మూవీ

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న యానిమేషన్ మూవీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”
movies

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

by admin
September 22, 2026
0

...

Read more
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

September 22, 2026
లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

September 16, 2026
ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

September 10, 2026
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

September 8, 2026
ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

September 6, 2026
ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

September 5, 2026
టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన  “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

September 5, 2026
పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

September 4, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In