“కిక్ బాక్సింగ్, హార్స్ రైడింగ్, డాన్సింగ్” తదితర కళల్లో శిక్షణ పొందడంతో పాటు… ‘ధియేటర్ ఆర్ట్స్’ చేసి, పలు ప్రదర్శనలిస్తూ ప్రశంసలు పొందుతున్న ‘సంజన ఆకాశం” మిస్ సౌత్ ఇండియా కిరీటం సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ‘వెస్ట్రన్ పాప్ సింగింగ్’ లోనూ మంచి ప్రావీణ్యమున్న సంజన… లండన్ లోని ట్రినిటీ మ్యూజిక్ కాలేజీ నుంచి సంగీతంలో డిప్లొమా తీసుకుంది. “కైకేయి” అనే చిత్రంలో ప్రముఖ నటి ఆమనితో స్క్రీన్ షేర్ చేసుకున్న సంజన… తన ప్రతిభకు తగ్గ అవకాశాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది!!
వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ మరియు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్… ప్రవృత్తి రీత్యా టెన్నిస్ ప్లేయర్ అయిన తన తండ్రి “రఘునాథ్ ఆకాశం” తన రోల్ మోడల్ అంటున్న సంజన… ప్రస్తుతం ‘లా’ చదువుతోంది. లాయర్ గానూ, యాక్టర్ గానూ తన కెరీర్ బ్యాలన్స్ చేసుకోవాలన్నదే తన లక్ష్యమంటోంది. అవకాశాలకు హద్దులంటూ లేని ఈ రెండు రంగాల్లో అంకితభావంతో, అద్భుతంగా రాణించగలననే నమ్మకం తనకు ఉందంటోంది సంజన!!
“పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్” నిర్వహిస్తున్న “మిస్ సౌత్ ఇండియా” పోల్ లో తనకు ఓటు వేసి ఈ రేసులో తాను ముందుకు వెళ్లేందుకు సహకరించాలని సంజన విజ్ఞప్తి చేస్తోంది!!