• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

యూత్ ని #మాయలో… పడేస్తుంది

admin by admin
December 15, 2023
in movies, reviews
0 0
0
యూత్ ని #మాయలో… పడేస్తుంది
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

మత్తువదలరా, పంచతంత్ర సినిమాలతో ఆకట్టుకున్ననరేష్ అగస్త్య, మంత్ ఆఫ్ మధు సినిమాతో ఆకట్టుకున్న జ్ఞానేశ్వరి, సర్కారు నౌకరిలో నటిస్తున్న భావన నటించిన తాజా చిత్రం #మాయలో. ఈ చిత్రంలో మిగతా పాత్రల్లో RJ హేమంత్ తదితరులు నటించారు. మేఘా మిత్ర పేర్వార్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సినిమాని ఫ్రేమ్‌ బై ఫ్రేమ్ పిక్చర్స్‌ పై షాలిని నంబు, రాధా కృష్ణ నంబు సంయుక్తంగా నిర్మించారు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియన్స్ ను ఏమాత్రం అలరించిందో చూద్దాం పదండి.

కథ: మాయ (జ్ఞానేశ్వరి) తన ప్రియుడు పాల్ తో కలిసి వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుంది. ఆమెకు క్రిష్ అలియస్ శివ్ కృష్ణ (నరేష్ అగస్త్య), సింధు (భావన) చిన్ననాటి స్నేహితులుంటారు. వీరు అంతా కలిసి పెరిగి పెద్దవుతారు. అయితే వీరందరికీ ఒకరితో ఒకరికి రిలేషన్ ఉంటుంది. అయితే… మాయ క్రిష్, సింధుని తన వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. దాంతో వీరిద్దరూ కలిసి మాయ పెళ్లికి ఓ కారును అద్దెకు తీసుకుని రోడ్డు మార్గాన బయలుదేరుతారు. అయితే వీరిద్దరి ప్రయాణం ఎలా సాగింది? క్రిష్, సింధూల మధ్య ఉన్న బంధం ఎలాంటిది? అలాగే క్రిష్, మాయల మధ్య ఎలాంటి రిలేషన్ ఉండేది? మంచి స్నేహితులుగా ఉన్న మాయ, సింధూలు ఎందుకు దూరం అయ్యారు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: మోడ్రన్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా చాలా సినిమాలు ఈ మధ్య వస్తున్నాయి. అవన్నీ ఎక్కువ భాగం ఓటీటీని టార్గెట్ చేస్తూ నిర్మించినవే. అయితే మాయలో మాత్ర… వెండితెరపైనా అలరించే కంటెంట్ అండ్ క్వాలిటీతో తెరకెక్కించారు దర్శకుడు. యూత్ కి నచ్చే… ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎలా ఉంటుందో… ఇందులో అలాంటి స్క్రీన్ ప్లేకి సంభాషణల రూపంలో మసాలా జోడించి నవ్వులు పూయించారు దర్శకుడు. ఈ చిత్రం ఎక్కువ భాగం రోడ్డు ప్రయాణంలోనే సాగిపోతుంది. నరేష్ అగస్త్య, భావనలిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఎక్కడా బోర్ లేకుండా సినిమాను నడిపించారు.

నటీనటులు ఎలా చేశారంటే…
మత్తు వదలరా, పంచతంత్ర సినిమాలతో మంచి నటుడుగా గుర్తింపు పొందిన నరేష్ అగస్త్య… ఈ సినిమాలో కూడా తన మార్క్ నటనతో యూత్ ని బాగా ఆకట్టుకున్నాడు. భావనతో తన కెమిస్ట్రీ బాగా కుదిరిందది. ఇద్దరూ రోడ్డు జర్నీలో టామ్ జెర్రీ గుర్తొచ్చేలా నటించి ఆకట్టుకున్నారు. అలాగే మాయ పాత్రలో జ్ఞానేశ్వరి తన మార్కు మోడ్రన్ గాళ్ గా మెప్పిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో భావనతో పోటీ పడినటించింది. వీరిద్దరి సంభాషణలు క్లైమాక్స్ లో నేటి యూత్ ని బాగా ఎంజాయ్ చేసేలా ఉన్నాయి. ఆర్జే హేమంత్ పోలీసు పాత్రలో కాసేపు కనిపించి మెప్పించారు. మంత్ ఆఫ్ మధులో జ్ఞానేశ్వరి ఎంతబాగా ఆకట్టుకుందో… ఇందులో కూడా అలానే ఆధునిక భావాలున్న అమ్మాయిగా నటించి కుర్రకారును ఆకట్టుకుంది. సర్కారు నౌకరిలో నటిస్తున్న భావన కూడా ఇన్ స్టా ఇన్ ఫ్లూయెన్సర్ గా మెప్పించింది.

సాంకేతిక నిపుణుల విషయానికొస్తే…

చిత్ర దర్శకుడు మేఘా మిత్ర పేర్వార్… నేటి యూత్ ని టార్గెట్ చేసుకుని రాసుకున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్… ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే ఓ రొమాంటిక్ కామెడీని బెస్ట్ కామెడీతో వెండితెరపై ఆవిష్కరించారు. ముఖ్యంగా సంభాషణలు నేటి మోడ్రన్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. నటీనటులను చాలా మోడ్రన్ గా చూపించారు. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్పీగా ఉంది. ఎక్కడా బోరింగ్ లేకుండా స్క్రీన్ ప్లేను చాలా గ్రిప్పింగ్ గా నడిపించారు. సంగీతం పర్వాలేదు. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా సినిమాని చాలా క్వాలిటీతో నిర్మించారు. సరదాగా ఈ వీకెండ్ లో చూసేయండి.
ప్లస్ పాయింట్స్
కథ… స్క్రీన్ ప్లే
లీడ్ రోల్స్ నటన
సంభాషణలు

మైనస్ పాయింట్స్
సంగీతం
నోన్ ఆర్టిస్ట్స్ లేకపోవడం

 

రేటింగ్: 3

Tags: #Mayalo Movie Telugu Review
Previous Post

ఘనంగా ‘కలశ’ డిసెంబర్ 15న విడుదల 

Next Post

ప్రశాంత్ కిషోర్.. టీడీపీకి వ్యూహకర్తగా వ్యవరిస్తారన్నది ఓ వర్గం తప్పుడు ప్రచారం

Next Post
ప్రశాంత్ కిషోర్.. టీడీపీకి వ్యూహకర్తగా వ్యవరిస్తారన్నది ఓ వర్గం తప్పుడు ప్రచారం

ప్రశాంత్ కిషోర్.. టీడీపీకి వ్యూహకర్తగా వ్యవరిస్తారన్నది ఓ వర్గం తప్పుడు ప్రచారం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఏప్రిల్ 17న  గ్రాండ్ గా ధియేటర్ లలో ‘కాల గమనం’  విడుదల
movies

ఏప్రిల్ 17న గ్రాండ్ గా ధియేటర్ లలో ‘కాల గమనం’ విడుదల

by admin
March 31, 2026
0

...

Read more
మే 22న థియేటర్స్  సందడి చెయ్యనున్న ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన  హార్రర్ త్రిల్లర్ చిత్రం “విచిత్ర”

మే 22న థియేటర్స్ సందడి చెయ్యనున్న ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన హార్రర్ త్రిల్లర్ చిత్రం “విచిత్ర”

March 29, 2026
దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాతో   జోరా వరల్డ్ ఆధ్వర్యంలో భారీ లైవ్ కాన్సర్ట్   ఈ నెల 28న

దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాతో జోరా వరల్డ్ ఆధ్వర్యంలో భారీ లైవ్ కాన్సర్ట్ ఈ నెల 28న

March 27, 2026
మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డ్స్ లో మన్యం ధీరుడు చిత్రం కి ఉత్తమ చిత్ర అవార్డు

మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డ్స్ లో మన్యం ధీరుడు చిత్రం కి ఉత్తమ చిత్ర అవార్డు

March 27, 2026
వారాహి సిల్వర్ జ్యువెలరీ ను ప్రారంభించిన సినీనటుడు తేజ సజ్జ, మరియు సినీనటి మీనాక్షి చౌదరి

వారాహి సిల్వర్ జ్యువెలరీ ను ప్రారంభించిన సినీనటుడు తేజ సజ్జ, మరియు సినీనటి మీనాక్షి చౌదరి

March 23, 2026
కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

March 21, 2026
ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

March 21, 2026
హైద్రాబాద్ లో రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ …

హైద్రాబాద్ లో రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ …

March 20, 2026
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో కొత్త సినిమా…

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో కొత్త సినిమా…

March 20, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In