• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను… ఇద్దరి స్నేహితుల కథ

admin by admin
October 13, 2023
in movies
0 0
0
మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను… ఇద్దరి స్నేహితుల కథ
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

అక్కడొకడుంటాడు ఫేమ్ శివ కంఠ‌మ‌నేని హీరోగా భ‌ద్రాద్రి, క‌త్తి చిత్రాల ద‌ర్శ‌కుడు మల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను. క్యాథ‌లిన్ గౌడ హీరోయిన్‌గా న‌టించింది. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందించాడు. ముప్పా వెంక‌య్య చౌద‌రి సార‌థ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ ప‌తాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

కథ:
మధురపూడి గ్రామంలోనే ఈ కథ అంతా సాగుతుంది. ఆ ఊరే తన ఆత్మకథ చెప్పుకున్నట్టుగా ఆ కోణంలోనే కథ జరుగుతుంది. ఊర్లో సూరి (శివ కంఠమనేని) ఓ మొరటోడు, మొండోడు. సూరి తన స్నేహితుడు బాబ్జీ కోసం ఎంత వ‌ర‌కైన నిలబడతాడు. తన ఫ్రెండ్ మంచి కోసం ప్రాణాలిచ్చేందుకైనా, తీసేందుకైనా ఏమాత్రం వెనకాడ‌ని మనస్తత్వం. ఒక ర‌కంగా చెప్పాలంటే క‌ర్ణుడు, ధుర్యోదనుడు లాంటి క్యారెక్ట‌ర్స్‌. త‌న స్నేహితుడి కోసం ప్రాణాలైన ఇవ్వ‌గ‌లిగే సూరి జీవితంలోకి హీరోయిన్ (క్యాథ‌లిన్ గౌడ) ఎలా వస్తుంది? ఆమె వచ్చాక సూరి జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి? చివరకు బాబ్జీ సూరి స్నేహబంధం ఎలా మలుపు తిరిగింది? ఊర్లోని రాజకీయాల్లో సూరి పాత్ర ఏంటి? అస‌లు ఈ క‌థ‌కు 700 కోట్ల రూపాయ‌ల డిజిట‌ల్ స్కామ్‌కు సంబంధం ఏంటి అన్నది థియేటర్లో చూడాల్సిందే.

నటీనటులు
ఇది రెగ్యుల‌ర్ హీరోలు చేయ‌గలిగే క్యారెక్ట‌ర్ కాదు..క‌చ్చితంగా ఇలాంటి క‌థ‌లు కొత్త న‌టీన‌టులు చేస్తేనే ఆ మూడ్ క్యారీ అవుతుంది. ఈ క‌థ‌కి త‌గ్గ‌ట్టుగా సూరి పాత్రలో శివ కంఠ‌మ‌నేని చక్కగా నటించాడు. కామెడీ, ఎమోషనల్ సీన్స్‌తో పాటుగా యాక్షన్ సన్నివేశాల్లోనూ అద‌ర‌గొట్టాడు. రెగ్యులర్ హీరో వేసే పాత్రలా కాకుండా.. కాస్త కొత్తగా ఉన్నా సూరి కారెక్టర్‌కు శివ కంఠమనేని ప‌ర్‌ఫెక్ట్ యాప్ట్ అనేలా న‌టించారు. హీరోయిన్ క్యాథ‌లిన్ గౌడ త‌న వ‌య‌సుకి మించిన పాత్ర చేసినా లుక్స్ పరంగా ఆకట్టుకుంది. త‌న‌కి చివ‌రి 30 నిమిషాలు న‌ట‌న‌కి మంచి స్కోప్ ద‌క్కింది. క‌థ‌లో కీల‌క‌మైన హీరో స్నేహితుడిగా బాబ్జీ పాత్రను మలిచిన తీరు కూడా బాగుంది. భ‌ర‌ణిశంక‌ర్ త‌న ప‌రిదిలో న‌టించి త‌న పాత్ర‌కు న్యాయం చేశారు. వ‌నితా రెడ్డి, జ‌బ‌ర్‌ద‌స్త్ నూక‌రాజు, మ‌హేంద్ర‌న్ వారి వారి పరిది మేర న‌టించారు.

విశ్లేషణ…
ఓ కథలో రివేంజ్, పొలిటికల్, లవ్, యాక్షన్ డ్రామాను యాడ్ చేయడం.. కమర్షియల్‌గా అన్ని అంశాలను కలగలపి తీయడం మామూలు విషయం కాదు. అన్ని అంశాలను జోడిస్తూనే సమాజానికి ఏదైనా సందేశాన్ని ఇవ్వడం మరింత కష్టం. కానీ ఈ చిత్రంతో దర్శకుడు అన్ని రకాలుగా ప్రయత్నం చేసి స‌క్సెస్ అయ్యారు. అన్ని కారెక్టర్లను అద్భుతంగా మలిచిన తీరు ప్ర‌శంస‌నీయం. క్యారెక్ట‌ర్స్ రిజిస్ట‌ర్ అవ్వ‌డానికి కాస్త టైమ్ ప‌ట్ట‌డంతో ప్ర‌థ‌మార్ధం నిదానంగా సాగినట్టు అనిపించినా.. మ‌ణిశ‌ర్మ సంగీతం ఆ లోటుకి తీర్చుతుంది. ముఖ్యంగా ఎల్లే గోరింక పాట ఫ‌స్టాఫ్‌లో హైలైట్ కాగా లింగా లింగా పాట సెకండాఫ్‌ని న‌డిపిస్తుంది. మ‌ణిశ‌ర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మెయిన్ పిల్ల‌ర్ అని చెప్పొచ్చు. ఇంటర్వెల్‌కు ఆసక్తి పెరుగుతుంది. ఇక ద్వితీయార్దం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌లో ట్విస్టులు అందరినీ మెప్పిస్తాయి. క్లైమాక్స్‌లో హీరో పర్ఫామెన్స్, దర్శకుడు తెరకెక్కించిన తీరు మెప్పిస్తుంది. ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌తో ప్రేక్షకుడు బయటకు వచ్చేలా దర్శకుడు చేయడంలో సక్సెస్ అయ్యారు.

టెక్నికల్‌గా మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను అందరినీ ఆకట్టుకుంటుంది. మణిశర్మ పాటలు, ఆర్ఆర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సురేష్ భార్గవ్ విజువ‌ల్స్ సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. ప‌ల్లెటూరి విజువల్స్ ఎంతో సహజంగా అనిపిస్తాయి. తక్కువ నిడివితో ప్రేక్షకుడ్ని బోర్ కొట్టించకుండా చక్కగా కత్తిరించాడు ఎడిటర్ గౌతంరాజు గారు. ఇక నిర్మాతలు కె శ్రీనివాసరావు, వై అనిల్ కుమార్ పెట్టిన ప్ర‌తి రూపాయి తెరపై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమాని నెక్ట్స్ లెవ‌ల్ కి తీసుకెళ్లాయి.

చివ‌ర‌గా: మ‌ధుర‌పూడిగ్రామం అనే నేను..ఒక స్వ‌చ్చ‌మైన ఊరిక‌థ‌

రేటింగ్ః 3/5

Tags: Madhurapudi Gramam Ane Nenu Movie Review
Previous Post

ఆకతాయిల భరతం పట్టే… సరోజ

Next Post

నవంబర్ 17న ‘నేనెక్కడున్నా’ చిత్రం  విడుదల

Next Post
నవంబర్ 17న ‘నేనెక్కడున్నా’ చిత్రం  విడుదల

నవంబర్ 17న 'నేనెక్కడున్నా' చిత్రం  విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…
movies

లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

by admin
August 12, 2026
0

...

Read more
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న యానిమేషన్ మూవీ

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న యానిమేషన్ మూవీ

August 11, 2026
నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఆధ్వర్యంలో పద్మశ్రీ మురళీమోహన్ కు ఘన సన్మానం

నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఆధ్వర్యంలో పద్మశ్రీ మురళీమోహన్ కు ఘన సన్మానం

August 11, 2026
ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా పోస్టర్ లాంఛ్

ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా పోస్టర్ లాంఛ్

August 6, 2026
ఆగస్టు 7న “జి.డి.నాయుడు” గా వస్తున్న ఆర్. మాధవన్

ఆగస్టు 7న “జి.డి.నాయుడు” గా వస్తున్న ఆర్. మాధవన్

August 6, 2026
కళాంజలి: విభా యడవల్లి కూచిపూడి నాట్య ప్రయాణం

కళాంజలి: విభా యడవల్లి కూచిపూడి నాట్య ప్రయాణం

August 3, 2026
ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం

ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం

August 1, 2026
ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్

ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్

July 24, 2026
నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

July 21, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In