లోకేష్ ఆరోపణల్లో నిజం ఎంత ?
ఈ ప్రభుత్వంలో బాగుపడింది వైవీ సుబ్బారెడ్డి, సజ్జల, పెద్దిరెడ్డి, జగన్ మాత్రమే
2014-19 లో నలుగురు రెడ్లకు మంత్రి పదవులు
ఈ ప్రాంతంలో చిన్నచిన్న కాంట్రాక్టర్లు రెడ్డి సామాజికవర్గం వారే ఎక్కువ
ఈ ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీల పేరుతో రెడ్లను ఇబ్బంది పెట్టింది..
ఏకంగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకువచ్చింది
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ఏడాది నెరవరుస్తా
జగన్ పాలనలో నష్టపోయింది రెడ్లే
జగన్ చేతిలో రెడ్డి సామాజిక వర్గం బాధితులుగా మారారు
టీడీపీ వస్తే రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న పేదలను ఆదుకుంటాం
రెడ్డి భవన్ ఏర్పాటుకు సహకరిస్తామని హామీ
ఇలా మాట్లాడుకుంటూ వెళ్లిన లోకేష్ ఒకసారి వెనక్కి తిరిగి తన తండ్రి పాలనలో రెడ్లను, రెడ్డి అధికారులను ఎలా వేధించారో ఒక్కసారి చూసుకోవాలి*
మీరు వేదించిన అధికారుల లిస్ట్ చూడండి.
1) వైయస్సార్ గారితో సన్నిహితంగా ఉన్నారని నాడు విద్యుత్ సంస్థ చైర్మన్ గా ఉన్న రమాకాంత్ రెడ్డిని ఎలా వేదించారో మర్చిపోయారా?
2) సీనీయర్ ఐపీయస్ అధికారిగా , పైగా ఆయన సర్వీసులో ఏ మచ్చ లేకుండా ఉన్న డీజీపీ ఆంజినేయ రెడ్డి గారిని కేవలం కుల వివక్ష కారణంగా వేదించి ఆయనను పక్కన పెట్టి రాములు గారికి అవకాశం ఇవ్వలేదా?
3) మరో ఐపీయస్ అధికారి దినేష్ రెడ్డిని కేవలం కుల వివక్షతో నాలుగేళ్ళు పక్కన పెట్టలేదా?
4) ఇంకో ఐపీయస్ అధికారి గోపీనాధ్ రెడ్డి కూడా మీ కుల వివక్షకు గురికాలేదా?
ఇది కాకుండా చంద్రగిరి ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డిని కేసుల్లో ఇరికించి పోలీస్ వ్యానులో కింద పడేసి కిలోమీటర్ల కొద్దీ తిప్పి స్టేషన్లో పెట్టీ కొట్టిన ఘటనను ఆయన శాసన సభలోనే వివరించిన సంగతి మరిచారా ?
ఇలా చెప్పుకుంటూ పోతే కేవలం కులం మాటున మీరు వేధించిన రెడ్డి అధికారుల లిస్ట్ చాలానే ఉంది. అధికారం కొసం రెడ్లపై ప్రేమ నటించడం ఆ తరువాత రెడ్లపై అన్ని రకాలుగా దాడులు చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్యని తెలుసుకోలేనంత పిచ్చివాళ్ళు కాదు జనాలు..
అంతెందుకు.. రెడ్ల మీద అవాజ్యమైన ప్రేమ చూపుతున్న లోకేష్ ఆయన తండ్రి సాక్షాత్తు జగన్ మోహన్ రెడ్డిని ఎలా టార్గెట్ చేశారో లోకానికి తెలుసు.. తనతోబాటు తన ఎల్లోమీడియా , తన చెంచా అధికారులతో కలిసి జగన్, దివంగత వైయస్సార్ వ్యక్తిత్వాలను ఎంతలా దిగజార్చి రాక్షసానందం పొందారో మర్చిపోయారా.. అవసరానికి ఒక తీరున మారిపోయే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు లోకేష్