సోషల్ మిడియా పై గట్టి నిఘా ఉంచాలని కర్నూలు జిల్లా ఎస్పీ సిధ్ధార్థ్ కౌశల్ సైబర్ ల్యాబ్ పోలీసులకు తెలిపారు.
ఈ సంధర్బంగా శనివారం కర్నూలు నగరంలోని ఆంధ్రప్రదేశ్ రీజినల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ – కర్నూలు ను జిల్లా ఎస్పీ గారు ఆకస్మిక తనిఖీ చేశారు.
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని , సాంకేతిక నైపుణ్యం తో సైబర్ నేరాలను అరికట్టే దిశగా అవసరమైన గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ నేరాల డేటా విశ్లేషణ , ప్రతి ఒక్క వింగ్ గురించి సైబర్ ల్యాబ్ ఎస్సై గారిని అడిగి తెలుసుకున్నారు.
ఏదైనా అవసరమైనప్పుడు డేటా ను వెంటనే విశ్లేషణ చేసి సత్వరమే స్పందించే విధంగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారి వెంట స్పెషల్ బ్రాంచ్ సిఐలు పవన్ కిశోర్, ప్రసాద్, సైబర్ ల్యాబ్ ఎస్సై వేణుగోపాల్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై రమేష్ , సైబర్ ల్యాబ్ టెక్నిషియన్స్ సిబ్బంది ఉన్నారు.