యువ కథానాయకుడు నాగశౌర్య హీరోగా నటించిన తాజా చిత్రం కృష్ణ వ్రింద విహారి చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నది..ఈ శుక్రవారం విడుదలైన చిత్రాల్లో ఇది మంచి కలెక్షన్స్ ని రాబడుతోంది. రివ్యూస్ తో సంబంధం లేకుండా పాజిటివ్ మౌత్ టాక్ తోనే బజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా U.S.లోనూ కలెక్షన్స్ లో దూసుకుపోతోంది. విడుదలైన రెండురోజుల్లోనే 100K డాలర్స్ గ్రాస్ ని వసూలు చేసి… హెలేరియస్ హిట్ గా నిలిచింది.
ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత ఉషా ముల్పూరు నిర్మించారు. శంకర్ ప్రసాద్ ముల్పూరు సమర్పణ. అనీష్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కలెక్షన్స్ వసూలు చేయడం పట్ల చిత్ర నిర్మాత ఆనందం వ్యక్తం చేశారు. యూత్ తో పాటు… ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా ఆదరిస్తున్నారని తెలిపారు. నాగ శౌర్య నటన చాలా సెటిల్డ్ గా వుందని… కామెడి, సెంటిమెంట్, యాక్షన్ ఇలా అన్ని విషయాల్లోనూ మంచి పర్ఫార్మెన్స్ కనబరిచాడన్నారు.