రవితేజ చేతుల మీదుగా అధర్వ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ విడుదల
యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న కొత్త సినిమా అధర్వ. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ రాబోతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను ఎంతో గ్రాండ్‌గా రూపొందిస్తున్నారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా మాస్ మహారాజా రవితేజ చేతులు మీదుగా ఈ సినిమా తెలుగు టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ విడుదల చేశారు. నేను నమ్మిన సత్యం, వెతికే లక్ష్యం, దొరకాల్సిన సాక్ష్యం చేధించేవరకు ఈ కేసును వదిలిపెట్టను సార్.. అంటూ హీరో చెబుతున్న డైలాగ్స్ ఈ మోషన్ పోస్టర్ లో హైలైట్ అయ్యాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మేజర్ అట్రాక్షన్ గా నిలిచింది. అతి చిన్న వీడియోతోనే సినిమాపై ఆసక్తి పెంచేశారు మేకర్స్. అధర్వ అంటూ పడిన టైటిల్ బోల్డ్ నలుపు అక్షరాలతో వ్రాయబడి ఉండగా, మధ్య పదం మాత్రం DNA రేఖాచిత్రంతో ఎరుపు రంగులో పెయింట్ చేయబడటం సినిమాలో ఉన్న వైవిధ్యాన్ని బయటపెడుతోంది.
ది సీకర్ ఆఫ్ ది ట్రూత్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పోల్చితే ఈ సినిమా డిఫరెంట్ అనుభూతి కలిగిస్తుందని తాజాగా వదిలిన మోషన్ పోస్టర్ స్పష్టం చేస్తోంది. అదేవిధంగా డీజే టిల్లు, మేజర్ లాంటి సినిమాలకు మ్యూజిక్ అందించిన శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు బాణీలు కట్టడం విశేషం. ఆయన మ్యూజిక్ సినిమాకు మేజర్ అసెట్ అంటున్నారు మేకర్స్.
ఈ సినిమాకు చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చిత్రంలో సిమ్రాన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్, కల్పిక గణేష్, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్, విజయరామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
టెక్నికల్ క్రూ:
రైటర్, డైరెక్టర్: మహేష్ రెడ్డి
ప్రొడ్యూసర్: సుభాష్ నూతలపాటి
బ్యానర్: పెగ్గో ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ: నూతలపాటి నరసింహం, అనసూయమ్మ
మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల
DOP: చరణ్ మాధవనేని
ఎడిటింగ్: SB ఉద్ధవ్
ఆర్ట్: రామ్ కుమార్
లిరిక్స్: కాసర్ల శ్యామ్, కిట్టు విస్సప్రగడ
PRO: సాయి సతీష్, పర్వతనేని
Karthik Raju, Mahesh Reddy, Peggo Entertainments’ Atharva Title Logo & Motion Poster Out
Young hero Karthik Raju has teamed up with director Mahesh Reddy for a crime thriller movie being produced by Subhash Nuthalapati under the banner of Peggo Entertainments. The multi-lingual movie being made in Telugu, Tamil, Kannada and Malayalam languages is presented by Nuthalapati Narasimham and Anasuyamma.
Mass Maharaja Ravi Teja launched the Telugu title logo and motion poster of the movie, while Aishwarya Rajesh did the honors in Tamil. The title logo poster sees a clues vehicle, crime scene and evidence. “Every contact leaves a trace”, reads the poster. The Seeker of truth is the tagline.
While the title is written with bold black letters, the middle word A is painted red with a DNA diagram in it. All these things hint, Atharva is going to be a first of its kind crime thriller with a novel concept.
The motion poster is much more engrossing. The protagonist is introduced as a Clues team official who goes any lengths to solve his cases and doesn’t care the stumbling blocks in the process. “I won’t leave the case until I find the mystery behind the case. I’ll bring the criminal out even if he’s a big shot and I don’t care if i get any support or not from anybody. Until then, Atharva is off duty,” utters he which signifies his intense character and attitude.
A popular team of technicians are taking care of different crafts of the movie. Sricharan Pakala of DJ Tillu and Major fame renders soundtracks, wherein Charan Madhavaneni is the cinematographer and SB Uddhav is the editor.
The movie also features ensemble Simran Choudhary, and Ayraa playing the female leads. Arvind Krishna, Kabir Singh Duhan, Kalpika Ganesh, Vijay Rama Raju, Gagan Vihari, Ram Mittakanti, Kiran Macha, Marimuthu and Anand in important roles.
Cast: Karthik Raju, Simran Choudhary, Ayraa, Arvind Krishna, Kabir Singh Duhan, Kalpika Ganesh, Vijay Rama Raju, Gagan Vihari, Ram Mittakanti, Kiran Macha, Marimuthu, Anand and others
Technical Crew:
Writer and Director: Mahesh Reddy
Producer: Subhash Nuthalapati
Banner: Peggo Entertainments
Presents: Nuthalapati Narasimham and Anasuyamma
Music: Sricharan Pakala
DOP: Charan Madhavaneni
Editing: SB Uddhav
Art: Raam Kumar
Lyrics: Kasarla Shyam, Kittu Vissapragada
Ex-Producers: Vijaya, Jhansi
PRO: Sai Satish, Parvataneni