సినిమా: కరణ్ అర్జున్
విడుదల తేది: 24.06.2022
నటీ నటులు: అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా, మాస్టర్ సునీత్, అనితా చౌదరి, రఘు.జి, జగన్, ప్రవీణ్ పురోహిత్, మోహిత్, వినోద్ బాటి, ప్రసన్న తదితరులు
నిర్మాతలు: డా. సోమేశ్వరరావు పొన్నాన, బాలక్రిష్ణ ఆకుల, సురేష్, రామకృష్ణ, క్రాంతి కిరణ్
కథ -మాటలు -స్క్రీన్ ప్లే- దర్శకత్వం: మోహన్ శ్రీవత్స
ఎడిటర్: కిషోర్ బాబు
మ్యూజిక్: రోషన్ సాలూర్
పాటలుః సురేష్ గంగుల
డి .ఓ .పి: మురళి కృష్ణ వర్మన్;
పిఆర్. ఓ: చందు రమేష్ (బాక్సాఫీస్)
థ్రిల్లర్ మూవీస్ కి ఆడియెన్స్ లో మంచి రెస్పాన్స్ వుంది. సరైన కథ… కథనాలతో సినిమాని తెరకెక్కిస్తే… బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. అలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిందే… కరణ్ అర్జున్. అంతా కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రానికి అయిదు మంది నిర్మాతలు. రెడ్ రోడ్ థ్రిల్లర్స్ పతాకంపై తెరకెక్కిన ఈచిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రోడ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఎలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో చూద్దాం పదండి.
కథ: కరణ్ (నిఖిల్ కుమార్) తనకి కాబోయే భార్య వృషాలి (షిఫా)తో కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం పాకిస్తాన్ బోర్డర్ లో వున్న జైసల్మేర్ ఎడారి ప్రాంతానికి వెళతాడు. అక్కడ అర్జున్ (అభిమన్యు) వీళ్ళని ఇద్దరినీ వెంటాడుతూ ఇబ్బందులకు గురి చేస్తుంటాడు. ఒకానొక సమయంలో వీల్లిద్దరినీ వెంబడిస్తూ షూట్ చేసి చంపాలనుకుంటాడు అర్జున్. అర్జున్ నుంచి తప్పించుకోవడానికి ఎడారి ప్రాంతంలో నానా పాట్లు పడతారు కరణ్, వృషాలి. ఈ క్రమంలో అక్కడ స్థానికంగా ఉండే లారీ డ్రైవర్ అతనితో పాటు వుండే క్లీనర్ వృషాలిని ఎత్తుకుపోతారు. వారి బారి నుంచి వృశాలిని, అర్జున్ కాపాడుతాడు. చంపాలనుకున్న వృషాలీని అర్జున్ ఎందుకు కాపాడాడు? వృషాలినీ లారీ డ్రైవర్లు ఎత్తుకు పోతుంటే కరణ్ ఏమి చేస్తున్నాడు? అసలు వీరి ముగ్గురి మధ్య వున్న రిలేషన్ ఏంటి? చివరకు క్లైమాక్స్ లో ఏమి తేలింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే…!!!
కథ… కథనం విశ్లేషణ: దర్శకుడు మాంచి పెన్ పవర్ వున్నోడని చివర్లో చెప్పే నీతి వాక్యాలే చెబుతాయి. ప్రేమ మంచిదే… ప్రాణాలు తీసేంత అతి ప్రేమ మంచిది కాదని ఓ చిన్న మెసేజ్ తో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో ఒకరు అమ్మ మీద వున్న అమితమైన ప్రేమతో…. మరొకరు అమ్మాయి మీద వున్న భగ్న ప్రేమతో… ప్రాణాలు తీసేదాకా వెళ్ళడం… అది మంచిది కాదని దర్శకుడు మోహన్ శ్రీవత్స చాలా థ్రిల్లంగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ లో కథలోకి వెళ్ళడానికి దర్శకుడు కొంచం టైం తీసుకున్నా… ప్రీ ఇంటర్వల్ నుంచీ సినిమా వేగంగా ముందుకు సాగుతుంది. ఇంటర్వల్ బ్యాంగ్ నుంచి క్లైమాక్స్ దాకా ఆసక్తికరమైన థ్రిల్లింగ్ మలుపులతో కథ… కథనాలను నడిపించాడు దర్శకుడు. నటీ నటులు అంతా కొత్తవారు అనేదే తప్ప… కొంచం వెల్ నొన్ ఆర్టిస్టుల తో తీసుంటే… సినిమాకి మాంచి బజ్ వచ్చేది. బిజినెస్ కూడా బాగా అయ్యేది. దర్శకుడు రాసుకున్న ఈ వైవిధ్యమైన కథ… కథనాలు ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తాయి.
నూతన నటుడు నిఖిల్ కుమార్ రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో చక్కగా నటించాడు. తల్లిని అమితంగా ప్రేమించే కరణ్ పాత్రకు బాగా సూట్ అయ్యాడు. అభిమన్యు కూడా టూ షేడ్స్ లో మెప్పించాడు. తన ప్రియురాలిని గాఢంగా ప్రేమించే అర్జున్ గానూ…. సోషియల్ కాజ్ కోసం పనిచేసే బాధ్యత గల యువకునిగా ఆకట్టుకుంటాడు. అలానే హీరోయిన్ షిఫా కూడా తన పాత్రకు న్యాయం చేసింది. తల్లి పాత్రలో నటించిన సునీత చౌదరి చాలా కాలం తరువాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించి తన పాత్ర పరిధి మేరకు నటించింది. మిగతా పాత్రన్నీ ఓకే.
రోషన్ సాలూర్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. సురేష్ గంగుల రాసిన సాంగ్స్ బాగున్నాయి. రాజస్థాన్ లోకేషన్స్ ని సినిమాటోగ్రాఫర్ బాగా చూపించారు. ఎడారిలో చేజింగ్ సీక్వెన్స్ బాగా చిత్రీకరించారు. ఎడిటింగ్ చాలా క్రిస్ప్ గా వుంది. ఓవరాల్ గా… రోడ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కరణ్ అర్జున్… మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకలను రెండు గంటల పాటు కూర్చునేలా బాగా ఎంగేజ్ చేస్తుంది. థ్రిల్లర్స్ ని ఇష్టపడే ఆడియెన్స్ కి ఈ వీకెండ్ లో పర్ ఫెక్ట్ ఛాయిస్ కరణ్ అర్జున్. ఎంజాయ్ ఇట్..!!!
రేటింగ్: 3