‘ఆర్ఎక్స్ 100’ తో అందరి దృష్టి ఆకర్షించిన దర్శకుడు అజయ్ భూపతి. తన సొంత బ్యానర్ ‘ఎ క్రియేటివ్ వర్క్స్’ మరియు ‘ముద్ర మీడియా వర్క్స్’ పతాకాల పై న్యూ జానర్ కథతో తన మూడవ చిత్రం చేయనున్నారు.
‘విక్రాంత్ రోనా’ ‘కాంతార’ వంటి చిత్రాలకి సెన్సేషనల్ ఆల్బమ్ అందించిన ‘అజనీష్ లోకనాథ్’ ఒకవైపు డివైన్ ఆల్బమ్స్ ఇస్తూనే మాస్ పాటలతో ఉర్రూతలూగించారు.
ఎలాంటి కథలో అయినా తన నేపథ్య సంగీతం, పాటలతో మరో స్థాయికి తీసుకెళ్లే అజనీష్ లోకనాథ్ అజయ్ భూపతి మూడవ చిత్రానికి సంగీతం అందించనున్నారు.
సరికొత్త కథ కథనాలతో తెరకెక్కనున్న ఈ చిత్ర టైటిల్ ని ఇతర నటీ నటుల వివరాలని త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపిన దర్శకుడు అజయ్ భూపతి, అజనీష్ లాంటి ప్రతిభ గల సంగీత దర్శకుడితో తన సొంత బ్యానర్ లో చేయనున్న మొదటి చిత్రంలో పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.