• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఔను వాళ్ళిద్దరూ ఒకటయ్యారు..!!

admin by admin
February 21, 2024
in politics
0 0
0
ఔను వాళ్ళిద్దరూ ఒకటయ్యారు..!!
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గo నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలోని రెండు వర్గాలు ఒకటయ్యాయి.  టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి,,  నియోజకవర్గ ఇన్చార్జి మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు ఉమ్మడిగా మీడియా సమావేశం పెట్టి ఇకపై తామంతా కలిసికట్టుగా పనిచేస్తామని ప్రకటించారు.

http://apvarthalu.com/wp-content/uploads/2024/02/VID-20240221-WA0084.mp4

గడిచిన ఎన్నికల్లో ఉమామహేశ్వర్ నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినప్పటి నుండి రెండు వర్గాలుగా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తమకే అంటూ ఇరు వర్గాలు పోటీపడ్డాయి.  అయితే అధిష్టానం వీరిద్దరినీ కాదని ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత సురేంద్రబాబును రంగంలోకి దించినట్లు సమాచారం అందడంతో వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారు.  టిడిపిలో కష్టపడిన వారికి టికెట్ ఎవరికిచ్చిన పార్టీ జెండా ఎగురవేస్తామని ప్రకటించారు.  బుధవారం స్థానిక ఎన్టీఆర్ భవన్లో ఇద్దరు నాయకులు ఉమ్మడిగా మీడియా సమావేశం పెట్టి మాట్లాడారు.  తమ ఇద్దరి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు రావడంతో పార్టీ కార్యక్రమాలు విడివిడిగా చేపట్టామని అయితే భవిష్యత్తులో సమన్వయంతో పని చేస్తూ పార్టీ విజయానికి కృషి చేస్తామని ఉన్నం హనుమంతరాయ చౌదరి ప్రకటించారు. టిడిపి ఇన్చార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఉన్నo  కుటుంబంతో కొన్ని విభేదాలు వచ్చి విడివిడిగా కార్యక్రమంలో చేసాం.  కానీ పార్టీకి నష్టం చేసే కార్యక్రమాలు ఏనాడు చేయలేదని తెలిపారు.  40 సంవత్సరాలుగా పార్టీ జెండా మోసిన వారిని కాకుండా వ్యాపారస్తులు ఇక్కడ నుండి పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్టడంతో తామంతా ఏకమై స్థానికంగా పనిచేసిన వారికే టికెట్ ఇవ్వాలని కోరుతున్నామన్నారు.  పార్టీ అధిష్టానం తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా విజయం సాధించి తీరుతామని తెలిపారు.

2019 ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కార్యకర్తలను అంటిపెట్టుకొని వారిలో భరోసా నింపుతూ పార్టీ విజయానికి బాటలు వేస్తే ఎవరో వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి పోటీ చేసి గెలుపొందుతామంటే కుదరదని టిడిపి యువనేత మారుతి చౌదరి అన్నారు.  తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా చంద్రబాబు నాయుడు కు కానుకగా ఇస్తామని పార్టీ అధిష్టానం ఆ దిశగా ఆలోచన చేయాలని కోరారు.

Previous Post

‘ఒక పథకం ప్రకారం’ విడుదలకు సిద్ధం

Next Post

ఫిబ్రవరి 23న ప్రపంచ వ్యాప్తంగా “14డేస్ లవ్” విడుదల

Next Post
ఫిబ్రవరి 23న ప్రపంచ వ్యాప్తంగా “14డేస్ లవ్” విడుదల

ఫిబ్రవరి 23న ప్రపంచ వ్యాప్తంగా “14డేస్ లవ్” విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

మీడియా వారి చేతుల మీదుగా “కలివి వనం” చిత్ర పోస్టర్ లాంచ్
movies

మీడియా వారి చేతుల మీదుగా “కలివి వనం” చిత్ర పోస్టర్ లాంచ్

by admin
May 19, 2025
0

...

Read more
మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

May 18, 2025
నవ్విస్తూ… భయపెట్టే “శుభం”

నవ్విస్తూ… భయపెట్టే “శుభం”

May 9, 2025
Review; “హిట్: ది థర్డ్ కేస్”

Review; “హిట్: ది థర్డ్ కేస్”

May 1, 2025
లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రి వద్ద అన్నదానం

లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రి వద్ద అన్నదానం

April 29, 2025
కాశ్మీర్ మనదే కాశ్మీర్ ప్రజలు మనవాళ్లే – హీరో విజయ్ దేవరకొండ

కాశ్మీర్ మనదే కాశ్మీర్ ప్రజలు మనవాళ్లే – హీరో విజయ్ దేవరకొండ

April 27, 2025
‘తుడరుమ్’ సినిమా రివ్యూ (తెలుగు డబ్బింగ్)

‘తుడరుమ్’ సినిమా రివ్యూ (తెలుగు డబ్బింగ్)

April 27, 2025
“సారంగపాణి జాతకం” (2025) సినిమా రివ్యూ

“సారంగపాణి జాతకం” (2025) సినిమా రివ్యూ

April 25, 2025
అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు

అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు

April 23, 2025
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In