కక్ష సాధింపు రాజకీయాలు, తప్పుడు కేసులతో నాయకులను, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న సైకో జగన్కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వత నేని శ్రీధర్ బాబు అన్నారు.
నిజం గెలవాలి.. న్యాయం గెలవాలి అంటూ టీడీపీ నాయకులు ఆదివారం. సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలంలోని రెడ్డి పల్లి గ్రామంలోని స్థానిక పెద్దమ్మ గుడి వద్ద కళ్లకు గంతలు కట్టుకొని జిల్లా టిడిపి అధికార ప్రతినిధి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో రెడ్డిపల్లి టిడిపి నేతలు నరసింహారెడ్డి ఆనంద్ రెడ్డి వేణుగోపాల్, రెడ్డిపల్లి నాయుడు తో పాటు టిడిపి నేతలు హాజరై నిరసన తెలిపారు. అనంతరం చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారని అన్నారు.చంద్రబాబు బయటకొచ్చేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు నరేంద్ర యాదవ్, సురేష్ చౌదరి, అరికెల రాజు ,రామకృష్ణ, రాము, చౌడయ్య, శంకర, తిరుపతయ్య వడ్డె వీరయ్య, నాగరాజు,రాజేష్, అది తదితరులు పాల్గొన్నారు.