• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

నిజాయతీ గల ప్రేమ కథ… ఐ హేట్ లవ్

admin by admin
February 16, 2024
in movies, reviews
0 0
0
నిజాయతీ గల ప్రేమ కథ… ఐ హేట్ లవ్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

రావి ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వెంకటేష్‌ వి.దర్శకత్వంలో సుబ్బు, శ్రీవల్లి జంటగా నటించిన చిత్రం ‘ఐ హేట్ లవ్’. నిర్మాత డా॥ బాల రావి (యు.ఎస్‌.ఏ) నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు ఈ రోజే వచ్చింది. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఇన్నర్ గా యూత్ కి ఓ మెసేజ్ కూడా ఇచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి.

కథ: రాంబాబు(సుబ్బు) బుద్ధిగా ఊళ్లో తల్లిదండ్రుల మాట వింటూ పొలం పనులు చేసుకుంటూ ఉంటాడు. అమ్మాయిలంటే అస్సలు గిట్టదు. అలాంటి సిద్ధూ… అదే గ్రామానికి చెందిన సీత(శ్రీవల్లి)ని ఒక సందర్భంలో చూసి… ప్రేమలో పడతాడు. అయితే… వీరి ప్రేమను తల్లిదండ్రులు మాత్రం అంగీకరించరు. దాంతో వీరిద్దరూ ప్రేమను గెలిపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకసారి ఇద్దరూ బైక్ లో వెళుతుండగా… అదే గ్రామానికి చెందిన వీరబాబు అనే పత్రికా విలేకరి… వీరిద్దరి ఫొటోని ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేస్తాడు. దాంతో వీరిద్దరి ప్రేమకు మరింత ప్రతి బంధకం ఏర్పడుతుంది. దాంతో రాంబాబు, సీత తమ ప్రేమను గెలిపించుకోవడానికి ఏమి చేశారు? మొదట్లో రాంబాబుకి అమ్మాయిలంటే ఎందుకు గిట్టదు? ఎంతో స్నేహంగా ఉన్న రాంబాబు, సీత కుటంబాలు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ: సరైన కథ… కథనాలు కుదిరితే గ్రామీణ ప్రేమకథలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కోనసీమలాంటి గ్రామాల్లో తెరకెక్కిన ప్రేమకథలు బాగా ఆకట్టుకుంటాయి. వాటిలో కాస్త ఫన్, మెచ్యురిటీ ఉండటంతో ఆడియన్స్ కూడా ఇట్టే కనెక్ట్ అవుతారు. తాజాగా తెరకెక్కిన ‘ఐ హేట్ లవ్’ సినిమా కూడా అంతే. ఈ సినిమాలో హీరో రగ్ డ్ లుక్ లో … హీరోయిన్ గ్రామీణ యువతిగా పక్కింటి అమ్మాయిలా చాలా సౌమ్యంగా కనిపించే లుక్… ఇద్దరి మధ్య లవ్ పుడితే… వారి కెమిస్ట్రీ ఎలా ఉంటుందనే దాన్ని దర్శకుడు తీర్చిదిద్దిన విధానం యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. గ్రిప్పింగ్ కథ.. కథనాలతో ఎక్కడా బోరింగ్, వల్గారిటీ లేకుండా సినిమాని ఫ్యామిలీతో చూసేలా తెరకెక్కించారు. కోనసీమలో సాధారణంగా మాట్లాడుకునే భాషలో చాలా సరదా సంభాషణలు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. తన ఇంట్లో జరిగిన ఓ సంఘటనతో మొదట్లో హీరోకి అమ్మాయిలంటే గిట్టకపోవడం… అది ఎంతో కాలం అబ్బాయిల్లో ఉండదని… ఆ తరువాత ఏదో ఒక టైంలో అమ్మాయిలను ఇష్టపడాల్సిందే అనే కోణంలో యూత్ మనస్తత్వాలు ఎలా ఉంటాయనేదాన్ని దర్శకుడు చాలా మెచ్యూర్ గా చూపించారు. అలాగే సోషల్ మీడియాను అనవసర విషయాలకు ఉపయోగిస్తే.. దానివల్ల ఎలాంటి అనర్థాలకు దారితీస్తాయో అనేదాన్ని చూపించి… ఏదైనా చేసే ముందుకు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలనే దాన్ని ఇన్నర్ మెసేజ్ గా ఇచ్చాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ లో హీరో ఫెరోషియస్ నెస్… ఆ తరువాత అమ్మాయి ప్రేమలో పడటంతో ఇంటర్వల్ కార్డు వేసి… ఆ తరువాత ప్రేమను దక్కించుకోవడానికి హీరో, హీరోయిన్లు పడే తపనను చూపించి మెప్పించారు. క్లీన్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ‘ఐ హేట్ లవ్’… యూత్ ను అలరిస్తుందనడంలో సందేహం లేదు.
హీరో సుబ్బు మొదట్లో ఫెరోషియస్ నెస్ తోనూ… ఆ తరువాత ప్రేమను గెలిపించుకోవడానికి పడే ఓ నిజయతీ గల ప్రేమికునిగా… రెండు వేరియషన్స్ లోనూ బాగా పరిణితి కనబరచారు. అలాగే అతనికి జోడీగా నటించిన శ్రీవల్లి కూడా గ్రామీణ యువతి పాత్రలో మెప్పించింది. మనసు నిండా ప్రేమను నింపుకుని… తల్లిదండ్రుల మాట కోసం ఆ ప్రేమను త్యాగం చేయడానికి సిద్దపడే సౌమ్యంగా ఉండే సగటు గ్రామీణ యువతి పాత్రలో ఒదిగిపోయి నటించింది. వీరిద్దరి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ పై యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. అలాగే వీరిద్దరికి తల్లిదండ్రులగా నటించిన నటులు కూడా మెప్పించారు. విలన్ మణి పాత్రలో నటించిన నటుడు బాగానే చేశారు. అలాగే విలేకరి పాత్రలో చేసిన నటుడు కూడా బాగానే చేశారు. హీరో స్నేహితునిగా నటించిన కుర్రాడు పర్వాలేదు అనిపించారు. ఇక మిగతా పాత్రలన్నీ తమ తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.
దర్శకుడు వెంకటేశ్ వి రాసుకున్న ప్రేమకథ బాగుంది. గ్రామీణ ప్రాంతాల్లో యువతీ యువకుల మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుంది… దాన్ని పొందడానికి వాళ్లు పడే పాట్లన్నీ ఇందులో చూపించారు. ఈ సినిమాకి సంగీతం ప్లస్ అయింది. నేపథ్య సంగీతం బాగుంది. కోనసీమ గ్రామీణ ప్రాంతాల అందాలను సినిమాటోగ్రాఫర్ చక్కగా చూపించారు. గ్రామీణ అందాలు బాగా ఒడిసిపట్టి… తెరపై చూపించారు. ఎడిటింగ్ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంది. నిర్మాత డా॥ బాల రావి (యు.ఎస్‌.ఏ) ఎక్కడా రాజీపడకుండా సినిమాని ఎంతో క్వాలిటీగా నిర్మించారు. ఈ నిజాయతీ గల ప్రేమ కథని ఓ సారి చూడండి.
రేటింగ్: 3

Previous Post

“డర్టీ ఫెలో” నుంచి “సందెవేళ” పాట విడుదల

Next Post

ఒకే పాత్ర‌తో రూపొందిన `నేటి భార‌తం` చిత్రం ట్రైలర్ లాంచ్!

Next Post
ఒకే పాత్ర‌తో రూపొందిన `నేటి భార‌తం` చిత్రం ట్రైలర్ లాంచ్!

ఒకే పాత్ర‌తో రూపొందిన `నేటి భార‌తం` చిత్రం ట్రైలర్ లాంచ్!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ముందుచూపున్న దర్శకుడు జయశంకర్: అప్పట్లో ఆయన చేసిన ‘కాన్సెప్ట్స్’.. ఇప్పుడు బాక్సాఫీస్ ‘హిట్స్’!
movies

ముందుచూపున్న దర్శకుడు జయశంకర్: అప్పట్లో ఆయన చేసిన ‘కాన్సెప్ట్స్’.. ఇప్పుడు బాక్సాఫీస్ ‘హిట్స్’!

by admin
April 7, 2026
0

...

Read more
నిర్మాత కేఎస్ రామారావు, డైరెక్టర్ వి.వి.వినాయక్ అతిథులుగా ఘనంగా “అహోం” సినిమా ప్రారంభం

నిర్మాత కేఎస్ రామారావు, డైరెక్టర్ వి.వి.వినాయక్ అతిథులుగా ఘనంగా “అహోం” సినిమా ప్రారంభం

April 7, 2026
ఘనంగా శ్రీజ స్వీయ దర్శకత్వంలో నిర్మించి హీరోయిన్ గా నటించిన “కొత్త కొత్తగా” సాంగ్ ఆల్బమ్ లాంఛ్

ఘనంగా శ్రీజ స్వీయ దర్శకత్వంలో నిర్మించి హీరోయిన్ గా నటించిన “కొత్త కొత్తగా” సాంగ్ ఆల్బమ్ లాంఛ్

April 7, 2026
విచిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన దర్శకులు విఎన్. ఆదిత్య

విచిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన దర్శకులు విఎన్. ఆదిత్య

April 6, 2026
జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్

April 4, 2026
హీరోయిన్ మానస వారణాశి చేతుల మీదుగా నెల్లూరులో లాడియా (LADIA) 6వ స్టోర్ ప్రారంభం

హీరోయిన్ మానస వారణాశి చేతుల మీదుగా నెల్లూరులో లాడియా (LADIA) 6వ స్టోర్ ప్రారంభం

April 4, 2026
టాలీవుడ్ యువ హీరోలు నటించిన “క్విట్ డ్రగ్స్” థియేట్రికల్ యాడ్ ఫిల్మ్  అండ్ పోస్టర్ ను లాంచ్ చేసిన తెలంగాణ ఈగల్ ఫోర్స్

టాలీవుడ్ యువ హీరోలు నటించిన “క్విట్ డ్రగ్స్” థియేట్రికల్ యాడ్ ఫిల్మ్ అండ్ పోస్టర్ ను లాంచ్ చేసిన తెలంగాణ ఈగల్ ఫోర్స్

April 3, 2026
ఏప్రిల్ 17న  గ్రాండ్ గా ధియేటర్ లలో ‘కాల గమనం’  విడుదల

ఏప్రిల్ 17న గ్రాండ్ గా ధియేటర్ లలో ‘కాల గమనం’ విడుదల

March 31, 2026
మే 22న థియేటర్స్  సందడి చెయ్యనున్న ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన  హార్రర్ త్రిల్లర్ చిత్రం “విచిత్ర”

మే 22న థియేటర్స్ సందడి చెయ్యనున్న ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన హార్రర్ త్రిల్లర్ చిత్రం “విచిత్ర”

March 29, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In