మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సొంతం ఇల్లు అనేది ఒక కల ఈ రోజుల్లో ఆ కల కల గానే మిగిలిపోతుంది అటువంటి ఈ రోజుల్లో సామాన్యుడికి అందుబాటులో ఉండే రేట్లలో గ్రీన్ స్పేస్ సెలెస్టియల్ (Green Space Celestial) సంస్థ అధినేత అల్లు గోవింద రెడ్డి గతంలో రూ. 5 కోట్లతో సేవా కార్యక్రమాలు గ్రీన్ స్పేస్ సీఎండీ గోవిందరెడ్డి
నార్సింగి ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ గ్రీన్ స్పేస్ కోకాపేటలో ఆదివారం కొత్త వెంచర్ సెలెస్టియల్ బ్రౌచర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎ.గోవిందరెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల పరిధిలో రూ.5 కోట్లతో పేద విద్యార్థుల చదువులు, పేదలకు మౌళిక సదుపాయాల కల్పనకు ఖర్చుచేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థ కోకాపేటలో 8.5 ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్ 9 అంతస్తులలో 769 ఫ్లాట్ల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. అందులో మద్య తరగతి నుంచి సంపన్న వర్గాల వారికి అనుగుణంగా ఫ్లాట్ సైజులు ఉంటాయన్నారు. ఒక ఎస్.ఎఫ్.టి.ని రూ.7,300లకు అమ్ముతున్నామన్నారు.
కోకాపేటలోని 8.51 ఎకరాలలో సెలెస్టియల్ పేరుతో ప్రారంభించిన వెంచర్ బ్రౌచర్ ని విడుదల చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా గోవిందరెడ్డి మాట్లాడుతూ… ఇప్పటివరకు నన్ను, మా సంస్థలను, మా కుటుంబాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే ఈ వెంచర్ లో మమ్మల్ని నమ్మి పెట్టుబడులు పెట్టిన అందరి సమక్షంలో గ్రీన్ స్పేస్ సెలెస్టియల్ బ్రౌచర్ విడుదల చేయడం నాకు చాలా ఆనందంగా వుంది. అలాగే మీకు చెప్పినట్టుగా డిసెంబర్ లో కన్ స్ట్రక్షన్ పూర్తి అవ్వాలి… కానీ కొన్ని అనివార్య కారణాల వలన మార్చ్ 2024 లో పూర్తి చేసి మీ అందరికీ అప్పగిస్తామని మాటిస్తున్నాను. అలాగే కొత్తగా వచ్చే కస్టమర్స్ కు 7,300 ఉన్న sq.ft. 6,999/- కే ఇస్తున్నాం ఈ ఆఫర్ మూడు రోజులు మాత్రమే ఈ అవకాశాన్ని కొత్తగా వచ్చే కస్టమర్లు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే తక్కువ సమయంలో నేను పిలవగానే విచ్చేసిన కస్టమర్లకు, బందువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ల్యాండ్ ఓనర్లకు, మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి గ్రీన్ స్పేస్ సెలెస్టియల్ సంస్థ యాజమాన్యం సుజాత, వేణుగోపాల్ రెడ్డి ,శ్రీమతి వైష్ణవి, అల్లురాజశేఖర్ రెడ్డి, అల్లు శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి (స్ట్రక్చరల్ ఇంజనీర్ -GSC), అనురాగ్, కిరణ్ కుమార్, ఎ.వి రెడ్డి, సురేష్ రెడ్డి, మధు, బాలరాజు, లక్ష్మి రెడ్డి, వెన్నెల, భాష, ల్యాండ్ ఓనర్స్, కస్టమర్స్, అండ్ శ్రేయోభిలాషులు తమ అభిప్రాయాలను పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.