ఈ వయస్సులో వారిని ఇంత ఇబ్బంది పెట్టడం అవసరసమా చంద్రబాబు..?
* మా ఓటు మాత్రం జగన్ కే
* వాలంటీర్లు ఉన్నపుడు మా ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవారు
* ఇప్పుడు చంద్రబాబు వల్ల 5 కి.మీ దూరంలో ఉన్న బ్యాంక్ దగ్గర క్యూలో నిలబడాల్సి వస్తుంది ఆవేదన చెందుతున్న అవ్వతాతలు
చంద్రబాబు అండ్ కో కుట్రల వల్ల అవ్వతాతలు బలి అయ్యారు. 40 డిగ్రీల పైచిలుకు ఎండల్లో ఆ పండుటాకులు మలమల మాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల నెలా ఇంటివద్దకే వస్తున్న పింఛ న్ ను అడ్డుకుని చంద్రబాబు తమకు తీరని వేధనను మిగిల్చాడని వారు ఆవేదన చెందుతున్నారు. ఒకటోతారీఖు తెల్లారగానే వాలంటీర్ లు వచ్చి ఇచ్చే పెన్షన్ ను… ఇప్పుడు కిలోమీటర్ల మేర ఎండలో నడుచుకుంటూ… ఆటోలలో వచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండలకు వడదెబ్బ తగిలి ప్రాణాలు పోతే అది ఎవ్వరి పాపం అని అవ్వతాతలు ప్రశ్నిస్తున్నారు.
ఇళ్ల వద్ద పెన్షన్స్ ఇవ్వకపోవడంతో పెన్షన్ల కోసం బ్యాంకుల వద్ద బారులు తీరిన అవ్వ, తాతలు ఎక్కడ చూసినా ఉన్నారు. ఈ వయస్సులో వారిని ఇంత ఇబ్బంది పెట్టడం అవసరసమా చంద్రబాబు..? అని ఇది చూసిన వారంతా ప్రశ్నిస్తున్నారు. అందుకే మాకు టాంచనుగా ఫస్ట్ తారీఖున పెన్షన్ ఇంటికే వచ్చేలా చూస్తున్న జగన్ కే మా ఓటు అని నినదిస్తున్నారు. వాలంటీర్లు ఉన్నపుడు మా ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవారు… ఇప్పుడు చంద్రబాబు వల్ల 5 కి.మీ దూరంలో ఉన్న బ్యాంక్ దగ్గర క్యూలో నిలబడాల్సి వస్తుంది ఆవేదన చెందుతున్న అవ్వతాతలు.