• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..

ముఖ్యఅతిథులుగా హాజరైన హీరో నందు, వంశీ నందిపాటి, శశికిరణ్ టిక్క.

admin by admin
September 1, 2026
in Gallery, movies, politics, Special Photo
0 0
0
ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఎకో క్రాఫ్ట్ మీడియా సమర్పణలో, మూవీ బ్రాట్స్ బ్యానర్ పై రమేష్ జిల్లా నిర్మాతగా, చాణక్య జిల్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం గుడ్ టైం. సన్ స్టూడీయోస్, లహరి మ్యూజిక్ ఆధ్యర్యంలో తాజాగా గుడ్ టైం మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రమణారెడ్డి, లక్షమన్ గుంటూరు, వంశీ నందిపాటి, శశికిరణ్ టిక్క, నందు, ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు.

యు ఎఫ్ ఓ జోనల్ హెడ్ లక్ష్మణ్ గుంటూరు మాట్లాడుతూ… గుడ్ టైం సినిమాకు ఇక్కడి నుంచి మంచి టైం మొదలవుతుందని, తెలుగు సినిమా పరిశ్రమకు కూడా ఇది గుడ్ టైం అని తెలిపారు. చిన్న సినిమాలు ఈ సమయంలో అద్భుతంగా ఆడుతున్నాయని తెలిపారు. 

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దినేష్ కార్తీక్ మాట్లాడుతూ.. సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం డైరెక్టర్ చాణక్య తనకు కథ చెప్పి, సినిమా పేరు గుడ్ టైం అని చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది మా గుడ్ టైం నడుస్తుంది అని అప్పుడే అనిపించింది అని తెలిపారు. సినిమా అవుట్ పుట్ చూసి కాన్ఫిడెంట్ తో ఉన్నట్లు తెలిపారు. మూవీ టీమ్ అందరికీ ఇది గుడ్ టైం అని తెలిపారు.

హీరోయిన్ అన్యుక్త నలాని మాట్లాడుతూ… దర్శకుడు కథ చెప్పినప్పుడు ఎక్సైట్ అయ్యానని ఇలాంటి పాత్రలో తనను సెలెక్ట్ చేసిన దర్శకుడు చాణక్యకు ధన్యవాదాలు తెలిపారు. ఇకనుంచి తమ గుడ్ టైం మొదలైందని వెల్లడించారు. నిర్మాత రమేష్ జిల్లా మాట్లాడుతూ.. టీజర్ లంచ్ ఈవెంట్ కు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. గుడ్ టైం సినిమాతో టీంకు గుడ్ టైం వస్తుందని పేర్కొన్నారు. 

హీరో నిఖిల్ మాట్లాడుతూ… యాక్టర్ అవ్వాలి అనుకున్నప్పటి నుంచి ఎన్నో కలలు ఉండేవి, అది ఈ సినిమాతో ఫుల్ ఫిల్ అవుతున్నట్టు తెలిపారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని, మధ్యతరగతి నుంచి వచ్చిన తనపై నమ్మకంతో ఇంత పెద్ద సినిమా బాధ్యతను తన భుజాలపై పెట్టిన డైరెక్టర్ చాణక్య, నిర్మాత రమేష్ ఇద్దరికీ ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో తన ప్రయాణం ఆరు సంవత్సరాల క్రితమే మొదలైందని, కానీ ఇప్పుడు గుడ్ టైం వచ్చిందని తెలిపారు. సినిమాను చిన్న సినిమా అనడం ఇష్టం లేదని ఇదొక నిజాయితీగా తీసిన అద్భుతమైన సినిమా అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన హీరో నందుకు ధన్యవాదములు తెలిపారు. ఆయన సైక్ సిద్ధార్థ్ సినిమాను ఎలా ప్రమోట్ చేశారో దాని నుంచి చాలా నేర్చుకొని గుడ్ టైమ్ మూవీని ప్రమోట్ చేస్తానని తెలిపారు. అలాగే వంశీ నందిపాటి, శశికిరణ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

డైరెక్టర్ చాణక్య జిల్లా మాట్లాడుతూ.. మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ కు విచ్చేసిన మీడియా మిత్రులకు, ముఖ్య అతిథులకు, చిత్ర యూనిట్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా తర్వాత అందరి టైం గుడ్ గా మారుతుంది అని పేర్కొన్నారు. ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన ఎమోషన్ ఉంటుందని దాన్ని అందరూ థియేటర్లో బాగా ఎంజాయ్ చేస్తారంటూ తెలిపారు.

వంశీ నందిపాటి మాట్లాడుతూ.. సినిమాను సపోర్ట్ చేయడానికి వచ్చిన హీరో నందు డైరెక్టర్ శశికిరణ్ తిక్క ఇద్దరికీ స్పెషల్ థాంక్స్ చెప్పారు. సినిమాను నిజంగా ప్రేమించే వాళ్లే ఇలా సపోర్ట్ చేస్తారని వ్యాఖ్యానించారు. ఇక సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి గుడ్ టైం రావాలని తెలిపారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించి ప్రొడ్యూసర్ కు కాసుల వర్షం కురవాలని కోరారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత దర్శకుడు చాణక్య తండ్రి ప్రొడ్యూసర్ రమేష్ జిల్లా అని గుర్తించాలని కోరారు. 

హీరో నందు మాట్లాడుతూ.. టీజర్ నచ్చితేనే మూవీ ప్రమోషన్స్ కు వస్తా అని మాటిచ్చా.. ఈరోజు వచ్చా, నిజంగా గుడ్ టైం మూవీ టీజర్ చాలా బాగా నచ్చిందన్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏమి లేదు కంటెంట్ బాగుంటే చాలు అని తెలిపారు. గుడ్ టైం సినిమాలో అందరూ మల్టీట్యాలెంటెడ్ లా ఉన్నారని తెలిపారు. సినిమా చాలా వైబ్ ఉండబోతుందని తెలిపారు. టీజర్ చూస్తే కోమా షాట్, బోరాన్ బ్లాస్ట్ లా అనిపించిందని హైదరాబాద్ స్టైల్ లో చెప్పారు. సినిమా తీయడం ఒక ఎత్తు, ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడం ఒక ఎత్తు అని, సినిమాను లాస్ట్ మినిట్ వరకు ప్రమోట్ చేస్తూనే ఉండండి అని గుడ్ టైం టీమ్ కు చెప్పారు.  

చిత్రం: గుడ్ టైం

నటీనటులు: నిఖిల్ గాజుల, అన్యుక్త నలాని, హృతిక్ శెట్టి, ధనరాజ్, సునీతా మనోహర్, సౌందర్య, హరి మున్నంగి తదితరులు

కధనం- మాటలు: అభిరామ్ రాయప్రోలు

ఎడిటర్: సాయి తరుణ్ రెడ్డి 

సంగీతం: నిర్వాన్ ఆత్రేయ 

డిఓపి: అన్వేష్ యాదవ్ 

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దినేష్ కార్తీక్ 

సీ.ఈ.ఒ: ఐశ్వర్య జిల్లా

నిర్మాతలు: రమేష్ జిల్లా

దర్శకత్వం: చాణక్య జిల్లా  

రమణారెడ్డి, లక్షమన్ గుంటూరు, వంశీ నందిపాటి, శశికిరణ్ తిక్క, నందు.

Previous Post

‘ధర్మస్థల నియోజకవర్గం’ “ఆది” అంత గొప్ప సినిమా అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో – స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..
Gallery

ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..

by admin
September 1, 2026
0

...

Read more
‘ధర్మస్థల నియోజకవర్గం’ “ఆది” అంత గొప్ప సినిమా అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో – స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్

‘ధర్మస్థల నియోజకవర్గం’ “ఆది” అంత గొప్ప సినిమా అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో – స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్

August 31, 2026
మిస్సింగ్ మేఘన 2nd  లిరికల్ ను లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

మిస్సింగ్ మేఘన 2nd లిరికల్ ను లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

August 30, 2026
యం.యస్‌ వారాహి, శిమమ్‌ మీడియా పతాకాలు నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌

యం.యస్‌ వారాహి, శిమమ్‌ మీడియా పతాకాలు నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌

August 29, 2026
విభిన్నమైన సందర్భాలుకు వినూత్నమైన సాహిత్యం అందించే అవకాశం “రంగస్థలం” తర్వాత ఈ సినిమాకే  దక్కింది – “ధర్మస్థల నియోజకవర్గం” ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్

విభిన్నమైన సందర్భాలుకు వినూత్నమైన సాహిత్యం అందించే అవకాశం “రంగస్థలం” తర్వాత ఈ సినిమాకే దక్కింది – “ధర్మస్థల నియోజకవర్గం” ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్

August 29, 2026
రాఖీ వేడుకల్లో మానవత్వాన్ని చాటుకున్న నటుడు సంజోష్

రాఖీ వేడుకల్లో మానవత్వాన్ని చాటుకున్న నటుడు సంజోష్

August 28, 2026
శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు

శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు

August 28, 2026
దిల్ రాజు ముఖ్య అతిథిగా… శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు

దిల్ రాజు ముఖ్య అతిథిగా… శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు

August 26, 2026
గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

August 24, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In