సొంత మరదలను లైంగికంగా వేధించిన మాజీ మంత్రి నారాయణ
* ఏమో సార్ మాకు కనబడదూ!
* కిక్కురుమనని ఎల్లోమీడియా, పవన్ కళ్యాణ్
నారాయణ కాలేజీల చైర్మన్, మాజీ మంత్రి పొంగూరు నారాయణ తనను లైంగికంగా వేధించారని, హింసించారని అయన మరదలు ప్రియ పొంగూరు సోషల్ మీడియా వేదికలుగా చేసిన ఆరోపణలు, వీడియోలు నిన్నంతా రాష్ట్రంలో విస్తృతంగా సర్క్యులేట్ అయ్యాయి. అయితే ఎల్లోమీడియా కానీ, రాష్ట్రంలో మహిళల భద్రతకు, వారి సంక్షేమానికి కంకణం కట్టుకున్నాను అని చెప్పిన జనసేనాని పవన్ కళ్యాణ్‌గానీ రెండ్రోజులుగా చప్పుడు చేయడం లేదు. అదేంటి రాష్ట్రంలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోంది అంటూ పెద్దపెద్ద కేకలు వేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన రాజకీయ మిత్రుడు నారాయణ, తన మరదలు పట్ల వ్యవహరించిన తీరుపై కిక్కురుమనకపోవడం చూస్తుంటే అయన తనకు రాజకీయంగా ప్రయోజనకరం అంటేనే స్పందిస్తారు, లేదంటే ఇలాగే ఏమోసార్ మాకు కనబడదు.. మాకు వినబడదూ అని నాటకాలు ఆడతారని అర్థం అవుతోంది. వాస్తవానికి టీడీపీలో మొదటి నుంచీ ఈ అరాచకాలు ఉన్నాయి. ఇది మొదటిది కాదు.. చివరిది కాదు.
కాల్ మనీకి అరాచకాలకు కేరాఫ్ టీడీపీ
తెలుగుదేశంనాయకులు, కార్యకర్తలు పార్టీలోనివారిని, కుటుంబీకులను లేదా ఆర్థిక సాయం చేసిన నెపంతో బయటివారిని సైతం లైంగికంగా లేదా శారీరకంగా మానసికంగా వేధించడం కొత్తకాదు. అవసరానికి పేదలకు పదివేలు అప్పు ఇచ్చి లక్షరూపాయలు వసూలు చేసింది చాలక తల్లీ బిడ్డను, ఒకే ఇంట్లోని అక్కాచెల్లెళ్లను లైంగికంగా హింసించిన ఘటనలు కోకొల్లలు. విజయవాడ కాల్ మనీ కేసు అప్పట్లో రాష్ట్రంలో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇక మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సైతం తన కుమారుడు శివరామకృష్ణతో కలిసి కోడలు పద్మప్రియను వేధించిన కేసు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఇక ప్రస్తుతం సత్తెనపల్లి టిడిపి ఇంచార్జ్ గా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ, అయన భార్య, కొడుకు నాగరాజు సైతం కోడలి కీర్తిని వేధించిన కేసుల్లో విచారణ ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా నారాయణ ఏకంగా తన తమ్ముడి భార్య ప్రియను లైంగికంగా వేధించడం సంచలనం అయింది. అప్పట్లో సినీ నటి కవిత, దివ్య వాణి సైతం ఇలాగె పార్టీలో తమకు జరిగిన అవమానాలు, ఇబ్బందులను సమాజానికి ఏకరువు పెట్టి పార్టీకి ఒక దండం అంటూ నిష్క్రమించారు
అప్పట్లో బాలయ్య.. ఇప్పుడు ప్రియకు పిచ్చి అంట
ఇదిలా ఉండగా తమకు, తమ ప్రతిష్టకు భంగం కలుగుతున్నదని గుర్తించిన మరుక్షణమే టీడీపీ నాయకులు, పెద్దలు లైన్లోకి వస్తారు. వెంటనే తమను, తమ ప్రతిష్టను కాపాడుకునేందుకు ఏదో ఒక కొత్త అంశాన్ని తెరమీదకు తెచ్చి అసలు విషయాన్ని నీరుగారుస్తారు. అప్పట్లో తన ఇంటిలో సెక్యూరిటీ గార్డులు ఇద్దరినీ కాల్చి చంపిన బాలకృష్ణ సైతం కేసు నుంచి తప్పించుకునేందుకు మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుని బయటపడ్డారు. ఇప్పుడు కూడా ప్రియా పొంగూరుకు పిచ్చి ఉందని, అందుకే ఆమె ఏదేదో మాట్లాడుతున్నారని ఆమె భర్త, నారాయణ సొంత తమ్ముడు సుబ్రహ్మణ్యం చెప్పడం దీనికి మరో ఉదాహరణ. అంటే ఆమె పిచ్చిది కాబట్టి అలా మాట్లాడుతోంది కాబట్టి.. ఆ మాటలకు విలువలేదు.. పట్టించుకోవద్దని చెబుతూ ఆ అంశాన్ని డైల్యూట్ చేస్తున్నారు.
ఆమె వీర మహిళ … అయినా కిక్కురుమనని పవన్
వాస్తవానికి ప్రియ పొంగూరు జనసేన సానుభూతిపరురాలు అని అంటున్నారు. గతంలో వాలంటీర్ల మీద పవన్ కళ్యాణ్ వివాదాస్పద కామెంట్స్ చేసినపుడు ప్రియ ఆయనకు అండగా నిలబడ్డారు. హ్యూమన్ ట్రాఫికింగ్ అంశం మీద పవన్ చేసిన ఆరోపణలు, లేవనెత్తిన ప్రశ్నలకు ప్రియా మద్దతు తెలుపుతూ పవన్ అడిగిన సందేహాలకు సమాధానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పోస్టర్, ఫోటో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. మరి తనకు మద్దతుగా నిలిచిన మహిళా ఇప్పుడు లైంగిక వేధింపులకు గురవుతుంటే పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన అవసరం లేదా? వీర మహిళకు అన్యాయం జరుగుతున్నా అయన వినబడనట్లే, కనబడనట్లే ఉంటారా? కనీసం ఎల్లో మీడియా అయినా ఈ అంశాన్ని ప్రశ్నించాలి కదా అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.