జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలకు ఎన్నడూ లేని విదంగా తీరని అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన బుధవారం ప్రకటన విడుదల చేస్తూ..
ముస్లిం మైనారిటీలు ఎంతో నమ్మకంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మాకు ఎన్నో విధాలుగా మేలు జరుగుతుందని ఊహించారు, నమ్మారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకోకుండా సంక్షేమాన్ని గాలికి వదిలేసారు అని పేర్కొన్నారు.
చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు దుల్హన్ అనే పధకం పెట్టి పేద ముస్లిం యవతి వివాహానికి రూ.50,000 పెళ్లి కానుకగా వేలాది మందికి ఇచ్చి బృహత్తర కార్యక్రమం చేపట్టారు అని పేర్కొన్నారు.
కానీ ఈ మూడేళ్ళలో దుల్హన్ పథకాన్ని పూర్తిగా రద్దు చేశారు. ఇంతే కాదు తత్కాల్, రోహిణి, దుకాన్, మకాన్ పథకాలకు పంగణామాలు పెట్టారు.
అంతేకాక ముస్లిం మైనారిటీలకు ఆనందంగా పండుగ జరుపుకోడానికి గతంలో చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న రంజాన్ తోఫా ఇచ్చాము కానీ ఇప్పుడు వాటి ఆచూకీ లేదు.
టీడీపీ ప్రభుత్వ హయంలో 1500 షాధికానాలు నిర్మాణంతో పాటు 7500 మసీదులు మరమ్మతులు చేయడం జరిగిందని వివరించారు. కానీ ఇప్పటికీ వీరి హయాంలో ఒక్క షాధికానా నిర్మాణం కానీ, మరమ్మతులు కానీ లేవు.
రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని మసీదులుకు ఎలెక్టరీఫికేషన్ మరియు తాగునీటికి , శానిటేషన్ కొరకు, మసీదులుకు సున్నం వేయడానికి పండుగ సందర్భంగా పది వేల నుంచి ఇరవై వేల వరకు గ్రాంటు ఇచ్చే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆ ఆచూకి లేదు.దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు.
కనీసం సున్నం కొట్టుకోడానికి ఒక రూపాయి కూడా ఇవ్వడం లేదు. ముస్లిం మైనారిటీలకు విదేశీ విద్యకు , ట్రైనింగులకు, ఉపాధి కల్పనకు, కుట్టు మిషన్లకు కోట్లాది రూపాయల ఖర్చు చేస్తే ఇప్పుడు దాని ఆచూకి లేదు.
వాక్ఫ్ భూములు అన్ని అన్యాక్రాంతం అవుతున్న పట్టించుకునే నాధుడే లేదు. వాటికి దిక్కే లేదు. బడ్జెట్లో ఆర్భాటంగా ప్రకటించడమే తప్ప మైనారిటీ సంక్షేమం నిల్ , ప్రచారం మాత్రం ఫుల్.
ఇప్పటికైనా పై పథకాలు అన్ని కొనసాగించి, మాటలు చెప్పడం వదిలిపెట్టి, నూటికి నూరు శాతం ఆ పేదలకు కొనసాగించాలని తెలుగుదేశం తరుపున డిమాండ్ చేస్తున్నాం అని పేర్కొన్నారు.