శ్రీరామ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం… మాతృ. దర్శకుడు జాన్ జిక్కి సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. నిర్మాత బూర్లే శివ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం ఇటీవలే విడుదల అయింది. ప్రేక్షకులని ఈ చిత్రం ఏమాత్రం థ్రిల్ కు గురిచేసిందో చూద్దాం పదండి.
కథ:
నగరంలో వరుస కిడ్నాప్‌ల వెనుక ఒక రహస్య కోడ్ ఉంటుంది. ఈ కోడ్ కారణంగా ప్రేమలో పడిన వశీ (సుగి విజయ్) అనుమానితుడిగా జైలుకు వెళ్తాడు. కానీ అతని ప్రేయసి మన్విత (రూపాలి) కూడా కిడ్నాప్ కావడంతో నిజం బయటపడుతుంది. అసలైన నేరస్థుడు ప్రొఫెసర్ విశ్వనాథన్ (శ్రీరామ్) అని తెలిసిన తర్వాత కథ మరింత ఉత్కంఠగా మారుతుంది.
శ్రీరామ్ ప్రొఫెసర్ పాత్రలో అద్భుతంగా నటించారు. సుగి విజయ్ – రూపాలి జంట తెరపై బాగా మెప్పించింది. అలీ, పృథ్వి కామెడీ కొంత ఊరట కలిగించాయి. ఆమని, రవికాలే, దేవి ప్రసాద్ వంటి సీనియర్ నటులు సినిమాకు బలం చేకూర్చారు. మిగతా పాత్రలు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
దర్శకుడు జాన్ జక్కి కొత్తదనం ఉన్న కథను థ్రిల్లింగ్‌గా తెరకెక్కించారు. రాహుల్ శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ, శేఖర్ చంద్ర బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా స్థాయిని ఎత్తారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాత బూర్లే శివ ప్రసాద్ రాజీ లేకుండా ఎంతో క్వాలిటీగా తెరకెక్కించారు. ప్రేక్షకులు బాగా థ్రిల్ అయ్యే చిత్రం ఇది. సరదాగా వెళ్ళి దగ్గర్లో ఉన్న థియేటర్ లో చూసేయండి.
రేటింగ్: 3.25