• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

అన్నప్రసాదాలపై సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు -టీటీడీ ఈవో

admin by admin
July 23, 2024
in politics
0 0
0
అన్నప్రసాదాలపై సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు -టీటీడీ ఈవో
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

శ్రీవారి కల్యాణ కట్టలో పరిశుభ్రత ఇంకా మెరుగుపరచాలని, తలనీలాలు సమర్పించే భక్తులకు నిరంతరాయంగా వేడి నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఈవో శ్రీ జె.శ్యామలరావు ఆదేశించారు. తిరుమలలోని ప్రధాన కళ్యాణ కట్టను ఈవో, జేఈఓ (విద్యా, ఆరోగ్యం) శ్రీమతి గౌతమితో కలిసి కళ్యాణకట్టలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.

కళ్యాణ కట్టలో ఇంకను శుభ్రపరచని తల వెంట్రుకలను ఎప్పటికప్పుడు తీసివేసి ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. బాత్ రూంలు, ఇతర హాల్స్ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడం ద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. కళ్యాణ కట్టలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి డిటిఎస్ ఏజెన్సీ వారు నాణ్యమైన శానిటరీ పరికరాలు, వస్తువులు ఎప్పటికప్పుడు సరఫరా చేసేటట్లు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా కళ్యాణ కట్టలోని అత్యంత పాత గీజర్లు, పగిలిన టైల్స్ ను గమనించి వాటిని వెంటనే మార్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే విరిగిన నీటి కొళాయిలు, పనిచేయని ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డులు స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న సివిల్, ఎలక్ట్రికల్, ఇతర ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

అనంతరం ఈవో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని తనిఖీ చేశారు. టిటిడి అందిస్తున్న అన్న ప్రసాదాలలో అన్నం బాగా ఉడికిందా, కూరలు ఎలా ఉన్నాయని భక్తులను అడిగి తెలుసుకున్నారు. అన్నప్రసాదాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. తరువాత చేతులు కడుగుకునే కుళాయిలు కొన్ని పనిచేయడం లేదని, వాటిని మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, అన్నదానం డిప్యూటీవో శ్రీ రాజేంద్ర, ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి, ఆరోగ్యశాఖ డిప్యూటీ ఈవో శ్రీమతి ఆశాజ్యోతి, ఇన్ ఛార్జ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్, ఎస్ ఈ- 2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డిఇ (ఎలక్ట్రికల్) రవి శంకర్ రెడ్డి, ఈఈ జగన్మోహన్ రెడ్డి, కెకెసి ఏఈఓ శ్రీ రమాకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Previous Post

భార్య గ్రాడ్యుయేషన్ వేడుక‌కు హాజ‌రైన పవన్ కళ్యాణ్

Next Post

 ‘ఫస్ట్ లవ్’ సాంగ్ లో బ్యూటీఫుల్ లవ్ స్టొరీ చాలా నచ్చింది- హీరో శ్రీవిష్ణు

Next Post
 ‘ఫస్ట్ లవ్’ సాంగ్ లో బ్యూటీఫుల్ లవ్ స్టొరీ చాలా నచ్చింది- హీరో శ్రీవిష్ణు

 'ఫస్ట్ లవ్' సాంగ్ లో బ్యూటీఫుల్ లవ్ స్టొరీ చాలా నచ్చింది- హీరో శ్రీవిష్ణు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్
movies

‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

by admin
April 25, 2026
0

...

Read more
‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

April 25, 2026
ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు “The 3rd” ఎంపిక

ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు “The 3rd” ఎంపిక

April 25, 2026
నటుడిగా వెండితెరపై.. సేవామూర్తిగా నిజ జీవితంలో: బహుముఖ ప్రజ్ఞాశాలి అఫ్సర్ ఆజాద్

నటుడిగా వెండితెరపై.. సేవామూర్తిగా నిజ జీవితంలో: బహుముఖ ప్రజ్ఞాశాలి అఫ్సర్ ఆజాద్

April 23, 2026
శ్రీకాకుళంలో విద్యాశాఖలో ఉద్యోగాల పేరిట లక్షల్లో వసూళ్లు.. ఎవరీ శేషగిరి?

శ్రీకాకుళంలో విద్యాశాఖలో ఉద్యోగాల పేరిట లక్షల్లో వసూళ్లు.. ఎవరీ శేషగిరి?

April 23, 2026
భవిష్యత్తరాలకు కూడా చోటిద్దాం… పుడమితల్లిని కాపాడుకుందాం…రాధే దగ్గుమల్ల

భవిష్యత్తరాలకు కూడా చోటిద్దాం… పుడమితల్లిని కాపాడుకుందాం…రాధే దగ్గుమల్ల

April 23, 2026
ఘనంగా ‘పరమపద సోపానం’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా ‘పరమపద సోపానం’ ప్రీ రిలీజ్ ఈవెంట్

April 21, 2026
దర్శకులు కౌశిక్ పెగల్లపాటి, మురళీకాంత్ దేవసోత్ చేతుల మీదగా “సూర్య బి పాజిటివ్” చిత్ర టీజర్ లాంచ్

దర్శకులు కౌశిక్ పెగల్లపాటి, మురళీకాంత్ దేవసోత్ చేతుల మీదగా “సూర్య బి పాజిటివ్” చిత్ర టీజర్ లాంచ్

April 21, 2026
మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన “ది బ్రేకింగ్ న్యూస్” ఫస్ట్ లుక్

మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన “ది బ్రేకింగ్ న్యూస్” ఫస్ట్ లుక్

April 18, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In