• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

admin by admin
February 2, 2026
in movies
0 0
0
ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

సుబ్బు, ప్రియాంక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “దక్షిణ కాళీ”. హీరోయిన్ అర్చన అమ్మవారి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి కథను అందించి శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు సత్యవాణి మీసాల. డివోషనల్ కథతో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు తోట కృష్ణ. ఈ సినిమా ఈ నెల 6న తెలుగు, తమిళ, కన్నడలో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర సాంగ్స్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ దర్శకుడు వి సముద్ర, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. పాటల విడుదల అనంతరం *దర్శకుడు వి సముద్ర* మాట్లాడుతూ “దక్షిణ కాళీ” సినిమా పాటలు, ట్రైలర్ చాలా బాగున్నాయని అన్నారు. ఈ సినిమా కంటెంట్ చూస్తుంటే అమ్మోరు మూవీ గుర్తుకు వస్తోందని అన్నారు. అరుంధతి సినిమాలో సోనూ సూద్ లా ఈ చిత్రంలో విలన్ గా నటించిన ఆజాద్ కు పేరు రావాలని ఆయన చెప్పారు. సోనూసూద్ ను అంత రెమ్యునరేషన్ ఇచ్చి పెట్టుకోలేని నిర్మాతలకు ఆజాద్ మంచి ఆప్షన్ అవుతాడని వి.సముద్ర అన్నారు.

నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ కొత్త సినిమాలు ఇండస్ట్రీకి రావాల్సిన అవసరం ఉందన్నారు. “దక్షిణ కాళీ” సినిమా కంటెంట్ చూస్తుంటే తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం కలుగుతోంది అన్నారు. అమ్మోరు సినిమాలా ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని కోరారు. *నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ* సినిమా నిర్మాణం అంటే మాటలు కాదు. ఒక లేడీ ప్రొడ్యూసర్ ఎంతో ప్రయాసతో “దక్షిణ కాళీ” చిత్రాన్ని నిర్మించడం అభినందనీయం. ఈ సినిమా టీమ్ అందరికీ మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అన్నారు.

దర్శకుడు తోట కృష్ణ మాట్లాడుతూ అమ్మవారి మహిమలు తెలిపేలా దక్షిణ కాళీ చిత్రాన్ని రూపొందించామని అన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు ఓ కీలక పాత్రలో నటించానని తెలిపారు. ప్రేక్షకుల్ని నిరాశపరచకుండా, వాళ్లు కోరుకునే అన్ని అంశాలతో సినిమా ఆకట్టుకుంటుందని ఆయన అన్నారు. *నిర్మాత సత్యవాణి మీసాల మాట్లాడుతూ* సినిమా నిర్మాణం నుంచి రిలీజ్ దాకా అమ్మవారే మమ్మల్ని నడిపిస్తూ వచ్చారని అన్నారు. అమ్మవారి దయ వల్లే ఎక్కడా ఇబ్బంది లేకుండా షూటింగ్ చేశామని, ఈ సినిమాను డబ్బుల కోసం చేయలేదని, కేవలం దక్షిణ కాళీ అమ్మవారి గొప్పదనం, మహిళలు తెలిపేందుకే నిర్మించామని ఆమె తెలిపారు. తమకు సపోర్ట్ చేస్తున్న సముద్ర, ప్రసన్నకుమార్, రామసత్యనారాయణ వంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

నటుడు ఆజాద్ మాట్లాడుతూ దక్షిణ కాళీ చిత్రంలో కీలక పాత్రలో నటించానని, ఈ సినిమాతో తనకు మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. ఇంతమంచి రోల్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు ఆజాద్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్ర కంటెంట్ చూసిన వారు తనను సోనూసూద్ లా ఉన్నావని అనడం గొప్ప ప్రశంసగా తీసుకుంటున్నట్లు ఆయన అన్నారు. *హీరో సుబ్బు మాట్లాడుతూ* మనకు ఎన్నో గ్రామ దేవతలు, నవ దేవతలు ఉన్నారు. వారి గొప్పదనం, మహిమలు ప్రేక్షకులకు తెలియాలి. అలాంటి ఉద్దేశంతోనే మా ప్రొడ్యూసర్ సత్యవాణి గారు దక్షిణకాళీ సినిమాను రూపొందించారు. ఈ చిత్రాన్ని మీరంతా ఆదరించాలి అన్నారు. రాజేందర్ ఫిలింస్ ఈ చిత్రాన్ని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.

నటీనటులు -అర్చన, సుబ్బు, ప్రియాంక, ఆజాద్, తదితరులు

టెక్నికల్ టీమ్
ఫైట్స్ – డైనమిక్ మధు
ఎడిటింగ్ – మేనగ శ్రీను
సినిమాటోగ్రఫీ – వెంకట్
మ్యూజిక్ – ఘంటాడి కృష్ణ
కథ, నిర్మాత – సత్యవాణి మీసాల
స్క్రీన్ ప్లే, దర్శకత్వం – తోట కృష్ణ
పీఆర్ఓ – వీరబాబు

Previous Post

లగ్జరీ సిల్వర్ జువెలరీ ‘గోయాజ్ (GOYAZ)’ –22వ స్టోర్ హైదరాబాద్ కొండాపూర్‌లో ప్రారంభం

Next Post

“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

Next Post
“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

"వన్ బై ఫోర్" (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఏప్రిల్ 17న  గ్రాండ్ గా ధియేటర్ లలో ‘కాల గమనం’  విడుదల
movies

ఏప్రిల్ 17న గ్రాండ్ గా ధియేటర్ లలో ‘కాల గమనం’ విడుదల

by admin
March 31, 2026
0

...

Read more
మే 22న థియేటర్స్  సందడి చెయ్యనున్న ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన  హార్రర్ త్రిల్లర్ చిత్రం “విచిత్ర”

మే 22న థియేటర్స్ సందడి చెయ్యనున్న ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన హార్రర్ త్రిల్లర్ చిత్రం “విచిత్ర”

March 29, 2026
దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాతో   జోరా వరల్డ్ ఆధ్వర్యంలో భారీ లైవ్ కాన్సర్ట్   ఈ నెల 28న

దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాతో జోరా వరల్డ్ ఆధ్వర్యంలో భారీ లైవ్ కాన్సర్ట్ ఈ నెల 28న

March 27, 2026
మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డ్స్ లో మన్యం ధీరుడు చిత్రం కి ఉత్తమ చిత్ర అవార్డు

మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డ్స్ లో మన్యం ధీరుడు చిత్రం కి ఉత్తమ చిత్ర అవార్డు

March 27, 2026
వారాహి సిల్వర్ జ్యువెలరీ ను ప్రారంభించిన సినీనటుడు తేజ సజ్జ, మరియు సినీనటి మీనాక్షి చౌదరి

వారాహి సిల్వర్ జ్యువెలరీ ను ప్రారంభించిన సినీనటుడు తేజ సజ్జ, మరియు సినీనటి మీనాక్షి చౌదరి

March 23, 2026
కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

March 21, 2026
ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

March 21, 2026
హైద్రాబాద్ లో రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ …

హైద్రాబాద్ లో రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ …

March 20, 2026
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో కొత్త సినిమా…

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో కొత్త సినిమా…

March 20, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In