మహంకాళి మూవీస్ పతాకంపై అది సాయి కుమార్ హీరో గా జి బి కృష్ణ దర్శకత్వంలో మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న చిత్రం “బ్లాక్”. ఈ చిత్రం లో ఆది క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. తన కెరీర్ లో బ్లాక్ చిత్రం ఒక స్పెషల్ ఫిల్మ్ గా నిలిచిపోతుంది. ఇటీవల విడుదల అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని మే నెల 28న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు జి బి కృష్ణ మాట్లాడుతూ “బ్లాక్ చిత్రం చాలా కొత్తగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో మే 28న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఆది గారి నటన, కథ, కథనం ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. మా నిర్మాత మహంకాళి దివాకర్ గారు రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మా చిత్రం ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. ఆడియన్స్ కి సరికొత్త చిత్రాన్ని అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నిర్మాత దివాకర్ గారు ఖర్చు వెనకాడకుండా చిత్రాన్ని నిర్మించారు. ఆది గారికి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది ఈ సినిమా. మంచి విజయం సాధిస్తుంది” అని తెలిపారు.
నిర్మాత మహంకాళి దివాకర్ మాట్లాడుతూ “మా బ్లాక్ చిత్రం మే 28న విడుదల అవుతుంది. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా. సినిమా చాలా బాగా వచ్చింది. హీరో ఆది గారు అద్భుతంగా నటించారు. ఆయన గత చిత్రాలకన్నా చాలా భిన్నంగా ఉంటుంది. అది గారికి చాలా కొత్తగా చూస్తారు. ఈ చిత్రం మా మహంకాళి బ్యానర్ కి మంచి విజయం తెచ్చిపెడుతుంది” అని తెలిపారు.
ఆటగాళ్లు ఫేమ్ దర్శన బానిక్, బిగ్ బాస్ కౌషల్ మందా, ఆమని, పృథ్వి రాజ్, సూర్య, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, ఆనంద్ చక్రపాణి తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ : సతీష్ ముత్యాల
సంగీతం : సురేష్ బొబ్బిలి
ఎడిటింగ్ : అమర్ రెడ్డి
ఫైట్స్ : రామకృష్ణ
ఆర్ట్ : కె వి రమణ
పి ఆర్ ఓ : పాల్ పవన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శంకర్
నిర్మాత : మహంకాళి దివాకర్
రచన – దర్శకత్వం : జి బి కృష్ణ