బిగ్ బాస్ హౌస్ లో ఈ తరం కుర్రాడు అర్జున్ కళ్యాణ్
వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో కొత్త వినోదాలకు వేదిక . ఈ రియాలిటీ గేమ్ చాలామంది ని సెలబ్రిటీస్ ని చేసింది . ఈ సిక్స్త్ సీజన్ లో అర్జున్ కళ్యాణ్ ఈ తరం కుర్రాళ్లకు ప్రతినిధి లా ఉన్నాడు. ఈ జనరేషన్ కి ఉండే లక్షణాలతో ఆట లో తన ప్రత్యేకతను చూపిస్తున్నాడు .
తన మాటతీరు ఎక్కడా పరిధి దాటదు. తన ఆట తీరు ప్రతి వారం మెరుగు అవుతూనే ఉంది.
సత్య తో తన రిలేషషన్ కూడా ఈ సీజన్ కి ఆహ్లాదం గా మారింది. ఈ రిలేషన్ లో అర్జున్ లో ఈ తరం కుర్రాళ్ళు చాలా మంది కనపడతారు . అందుకే ఆడియెన్స్ నుండి కూడా మాకు ఆ రిలేషన్ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కావాలనే డిమాండ్ కూడా కనపడింది.
అర్జున్ యు ఎస్ లో మాస్టర్స్ చేసి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ లో యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నాడు . ఉప్మా తినేసింది అనే షార్ట్ ఫిల్మ్ తో ఫేమ్ అయిన అర్జున్ తెలుగు సినిమా పరిశ్రమ లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చు కున్నాడు. డిజిటల్ ఇండస్ట్రీ లో తన మార్క్ ని
వేయగలిగాడు. ప్రేమమ్ , వరుడు కావలి , ప్లే బాక్ వంటి సినిమాలలో అర్జున్ చేసిన పాత్రలు
మంచి పేరుని తెచ్చి పెట్టాయి . మిస్సమ్మ , నారి నారి నడుమ మురారి వంటి వెబ్ సిరీస్ లు యూత్ లో గుర్తింపు ని తెచ్చాయి. నటుడి గా ఎస్టాబ్లిష్ అవుతున్న టైం లో వచ్చిన బిగ్ బాస్
అవకాశం అర్జున్ ని ప్రేక్షకులకు దగ్గర చేసింది.
బిగ్ బాస్ హౌస్ లో అర్జున్ ఇచ్చే ఎంటెర్టైమెంట్ ఆడియన్స్ కి సరదాలను పంచుతుంది.
హౌస్ లో అతని రిలేషన్స్ కూడా చాలా బాగుంటాయి. అతని ఆట తీరు మాట తీరు కూడా హద్దుల్లో ఉంటుంది. బాలన్స్ గా ఆటను ఆడుతూ బిగ్ హౌస్ లో తన ప్రయాణం కొనసాగిస్తున్న అర్జున్ కి ఆడియన్స్ సపోర్ట్ కూడా బాగానే దొరుకుతుంది .
అర్జున్ ఈ సీజన్ కి అందించిన వినోదం ఆడియన్స్ కి నచ్చింది.