అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాలతో అదనపు ఎస్పీ మీడియాకు వివరాలు వెల్లడి
అరెస్టయిన ముఠా సభ్యుల వివరాలు:
1) షేక్ మైనుద్దిన్ @ మైను, వయస్సు 43 సం,రాలు, జండా స్ట్రీట్, వాటర్ ట్యాంక్ దగ్గర, నెల్లూరు పట్టణం.
2) సయ్యద్ మహమ్మద్ ఇలియాజ్, వయస్సు 30 సం,రాలు భేతంచెర్ల గ్రామము మరియు మండలము, నంద్యాల జిల్లా
3) ఎం. అబ్దుల్ రసూల్, వయస్సు 42 సం,రాలు, కొత్తపేట గ్రామము, బనగానిపల్లి మండలము, నంద్యాల జిల్లా.
4) కండి శివ నారాయణ రెడ్డి, వయస్సు – 40 సం,రాలు, భవానిపురము, విజయవాడ.
5) కోటా కిరణ్ కుమార్, వయస్సు- 42 సం,లు, ఊర్మిళ సుబ్బారావు నగర్, భవానిపురము, విజయవాడ.
** స్వాధీనం చేసుకున్నవి:
* 3 నకిలీ (మనిగిన్నెలు) గిన్నెలు మరియు 2 రాగి నాణేలు
** నేపథ్యం :
అరెస్టయిన వీరిలో షేక్ మైనుద్దిన్ @ మైను ముఖ్యుడు. ఇతను నెల్లూరులో వెండి విక్రయాల దుకాణం పెట్టి నష్టపోయాడు. అప్పులు పాలయ్యాడు. తనకు పరిచయమున్న సయ్యద్ మహమ్మద్ ఇలియాజ్ ఇతని ద్వారా ఎం.అబ్దుల్ రసూల్ పరిచయమై సులువుగా డబ్బు సంపాదించేందుకు రైస్ పుల్లింగ్ మోసాన్ని ఎంచుకున్నారు. ఈక్రమంలో షేక్ మైనుద్దిన్ @ మైను నకిలీ గిన్నెలను తయారు చేశాడు. వాటిపై దేవుని ప్రతిమలు మరియు శివలింగములు వెల్డింగ్ ద్వారా అమర్చాడు. గిన్నె మధ్య భాగంలో వినాయక విగ్రహాలు పెట్టి వాటి మధ్యలో క్వార్ట్జ్ స్టోన్ ఉంచాడు. పాత్ర కింది భాగంలో 3A బాటరీస్ మూడు పెట్టి అందులో నీరు పోయగానే ఆ స్టోన్ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులోకి మారేవిధంగా ఏర్పాటు చేశాడు. ఇవి పురాతనమైనవి, చాలా విలువైనవి, పవిత్రమైనవని వీటిని ఇంటిలో పెట్టుకుంటే శుభాలు జరుగుతాయని నమ్ముబలికేలా ప్లాన్ చేసుకున్నారు. ముందుగా… కండి శివ నారాయణ రెడ్డి, కోటా కిరణ్ కుమార్ లను ఎంచుకున్నారు. ఈ తరహా నమ్మబలికి డబ్బులు గుంజి నకిలీ పాత్ర ఇచ్చారు. ఈ పాత్ర ద్వారా కండి శివ నారాయణ రెడ్డి, కోటా కిరణ్ కుమార్ లు ఎవర్నైనా మోసాలు చేయాలని విఫలయత్నం చేశారు. దీంతో ఈ ఐదుగురు ముఠాగా ఏర్పడి ఇదివరకే తయారు చేసుకున్న నకిలీ పాత్రలు, రాగి నాణేలు తీసుకుని రైస్ పుల్లింగ్ పేరున ప్రజలను మోసం చేసేందుకు అనంతపురం వచ్చారు.
అరెస్టు ఇలా: నెల్లూరు నుండీ అనంతపురం వచ్చి అమాయక ప్రజలను రైస్ పుల్లింగ్ పేరున మోసం చేసేందుకు ఈ ముఠా సంచరిస్తున్నట్లు జిల్లా SP డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారికి సమాచారం అందింది. ఈనేపథ్యంలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు అనంతపురం ఇన్ఛార్జి డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు మరియు CCS డీఎస్పీ ఎస్ మహబూబ్ బాషాల ఆధ్వర్యంలో ఒన్ టౌన్ సి.ఐ రవి శంకర్ రెడ్డి మరియు CCS ఇన్స్పెక్టర్ నాగశేఖర్, ఎస్సైలు విజయభాస్కర్ , వెంకటేష్ , రామకృష్ణలు …ఏఎస్సై రమేష్, హెడ్ కానిస్టేబుళ్లు హుమయూన్, షేక్సా, మురళి, బయ్యన్న,శ్రీనివాసులు,విక్టర్ ,శ్రీధర్ ఫణి, భాస్కర్ , కానిస్టేబుళ్లుఫరూక్ , మల్లికార్జున, మాధవ, రామాంజిలు బృందముగా ఏర్పడి ఈ ఐదుగుర్ని ఈరోజు ఉదయం 8.00 గంటలకు స్థానిక చెరువు కట్ట దగ్గర అరెస్ట్ చేశారు.
** రైస్ పుల్లింగ్ ముఠాల మోసాల పట్ల జాగ్రత్తలు తీసుకోండి — అదనపు ఎస్పీ
రైస్ పుల్లింగ్ ముఠాల మోసాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు ఎస్పీ ఇ.నాగేంద్రుడు విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలు తరచూ వెలుగులోకి వస్తున్నా…వాటిని నమ్మి మోసపోయే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదన్నారు. ఎంత పెట్టుబడి పెడితే అంత రెట్టింపు, మూడింతలు వస్తుంది. ఇలా రైస్ పుల్లింగ్ ముఠాలు చెప్పే డైలాగులు నమ్మకండి. రైస్ పుల్లింగ్ మిషన్ అమ్మకం పేరిట అందినకాడికి దండుకుంటారన్నారు.