2018 డిసెంబర్‌లో అనంతపురం జిల్లా రాప్తాడు నుంచి జాకీ పరిశ్రమ సేలంకు తరలిపోయింది.. మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించ లేదు అంటూ రామకృష్ణను నిలదీశారు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి.. ఆరోజే చంద్రబాబు పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ ను ఎందుకు తిట్టలేదన్న ఆయన.. పరిటాల వారు గుడ్ విల్ అడిగినందుకే అప్పుడు పరిశ్రమ పోయిందని ఆరోపించారు.. కమ్యూనిస్టు భావాలను పక్కన పెట్టి.. అమ్ముడుపోయారు అంటూ రామకృష్ణపై ఫైర్ అయ్యారు. ఇక, రాప్తాడులో పరిటాల వారికి డిపాజిట్ రావని.. ధర్మవరం, పెనుకొండ చూస్తున్నారని.. కానీ, చంద్రబాబు వాళ్లను రాప్తాడు తిరిగి పంపారని.. రాప్తాడులో పరిటాల వాళ్లు గెలవాలంటే నన్నైనా చంపాలి.. నా క్యారెక్టర్ నైనా చంపాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారికి కమ్యూనిస్టులు అండగా ఉంటారని చంద్రబాబు చెప్పారు.. ఇప్పుడే అందుకే జాకీ పరిశ్రమ ఇష్యూని తెరపైకి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.