• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని: చంద్రబాబు

admin by admin
June 11, 2024
in politics
0 0
0
అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని: చంద్రబాబు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇకపై మూడు రాజధానులు అంటూ ఆటలాడే పరిస్థితి రాష్ట్రంలో ఉండదని తేల్చి చెప్పారు. విశాఖపట్నంను ఆర్థిక, ఆధునిక రాజధానిగా అభివృద్ధి చేసుకుందామంటూ పిలుపునిచ్చారు. ఈమేరకు మంగళవారం విజయవాడలో జరిగిన ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. కూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు చెబుతూ ప్రజా తీర్పును గౌరవించి, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తామందిరిపైనా ఉందన్నారు.

గత పాలనలోనే పోలవరం దాదాపుగా పూర్తి..

సమష్టిగా ప్రజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారం ఎంతో అవసరమని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని వివరించారు. నిజానికి 2014లో అధికారంలోకి వచ్చి ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించినపుడే పోలవరం ప్రాజెక్టు పనులను 72 శాతం పూర్తిచేశామని చంద్రబాబు చెప్పారు. వరదలకు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని చెబుతూ.. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి నదులను అనుసంధానించడం ద్వారా రాష్ట్రంలోని ప్రతీ ఎకరానికీ నీళ్లందిస్తామని హామీ ఇచ్చారు.

గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం శిథిలమైంది..

గత ప్రభుత్వ హయంలో ఐదేళ్లలోనే రాష్ట్రం పూర్తిగా శిథిలమైందని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో సమస్యల సుడిగుండంలో చిక్కుకుందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు దెబ్బతిన్నాయని, రైతులు అప్పుల పాలయ్యారని చెప్పారు. సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను చక్కదిద్దే పని ప్రారంభిస్తామని వివరించారు. కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మకంగా ముందుకు వెళతామని చెప్పారు. ‘సీఎం పదవి హోదా కోసమే తప్ప పెత్తనం కోసం కాదు. సీఎం కూడా మామూలు మనిషే.. అలాగే మీ ముందుకు వస్తా. మిత్రుడు పవన్ కల్యాణ్ తో పాటు మేమంతా సామాన్యులుగానే ప్రజల వద్దకు వస్తాం’ అని చెప్పారు.

ప్రతి అడుగూ ప్రజాహితమే..

సీఎం పర్యటనల సందర్భంగా షాపులు, రోడ్లు మూసివేయడం, పరదాలు కట్టడం లాంటివి ఇకపై రాష్ట్రంలో కనిపించబోవని చెప్పారు. సిగ్నల్స్ దగ్గర వాహనాలను ఆపేయడం జరగదన్నారు. ‘ఐదు నిమిషాలు నాకు లేటైనా పర్వాలేదు కానీ ప్రజలకు అసౌకర్యం కలగవద్దని అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు చంద్రబాబు తెలిపారు. ఏ ఒక్కరి ఆత్మగౌరవానికీ భంగం కలగదని, ప్రతీ నిర్ణయం, ప్రతీ అడుగు ప్రజాహితం కోసమే ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

Previous Post

కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖలు

Next Post

కేంద్ర సహాయక మంత్రి రామ్ దాస్ అఠావలెను సన్మానించిన ఎ.ఆర్.మల్లు ఫౌండేషన్ ఛైర్మన్ మల్లు శివరాం

Next Post
కేంద్ర సహాయక మంత్రి రామ్ దాస్ అఠావలెను సన్మానించిన ఎ.ఆర్.మల్లు ఫౌండేషన్ ఛైర్మన్ మల్లు శివరాం

కేంద్ర సహాయక మంత్రి రామ్ దాస్ అఠావలెను సన్మానించిన ఎ.ఆర్.మల్లు ఫౌండేషన్ ఛైర్మన్ మల్లు శివరాం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

మే 22న థియేటర్స్  సందడి చెయ్యనున్న ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన  హార్రర్ త్రిల్లర్ చిత్రం “విచిత్ర”
movies

మే 22న థియేటర్స్ సందడి చెయ్యనున్న ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన హార్రర్ త్రిల్లర్ చిత్రం “విచిత్ర”

by admin
March 29, 2026
0

...

Read more
దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాతో   జోరా వరల్డ్ ఆధ్వర్యంలో భారీ లైవ్ కాన్సర్ట్   ఈ నెల 28న

దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాతో జోరా వరల్డ్ ఆధ్వర్యంలో భారీ లైవ్ కాన్సర్ట్ ఈ నెల 28న

March 27, 2026
మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డ్స్ లో మన్యం ధీరుడు చిత్రం కి ఉత్తమ చిత్ర అవార్డు

మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డ్స్ లో మన్యం ధీరుడు చిత్రం కి ఉత్తమ చిత్ర అవార్డు

March 27, 2026
వారాహి సిల్వర్ జ్యువెలరీ ను ప్రారంభించిన సినీనటుడు తేజ సజ్జ, మరియు సినీనటి మీనాక్షి చౌదరి

వారాహి సిల్వర్ జ్యువెలరీ ను ప్రారంభించిన సినీనటుడు తేజ సజ్జ, మరియు సినీనటి మీనాక్షి చౌదరి

March 23, 2026
కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

March 21, 2026
ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

March 21, 2026
హైద్రాబాద్ లో రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ …

హైద్రాబాద్ లో రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ …

March 20, 2026
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో కొత్త సినిమా…

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో కొత్త సినిమా…

March 20, 2026
వర్టెక్స్ 33 వెస్ట్‌లో గృహ కొనుగోలుదారులకు అద్భుతమైన అవకాశం

వర్టెక్స్ 33 వెస్ట్‌లో గృహ కొనుగోలుదారులకు అద్భుతమైన అవకాశం

March 20, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In