ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు మరియు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఆర్టీఏ చెక్ పోస్ట్ పై అర్ధరాత్రి ఏసీబీ అదికారుల సోదాలు..చెక్ పోస్ట్ వద్ద వాహనదారుల నుంచి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా అక్రమంగా నగదు వసూలును గుర్తించిన ఎసీబీ..మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ తోపాటు ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు మూర్తి, గోపాల్ ను అదుపులోకి తీసుకొని వారి నుండి రూ 85 వేల 670 రూపాయల అక్రమ నగదును మరియు రికార్డులను స్వాధీనం చేసుకోవడం జరిగింది .ఈ రైడ్ లో ఇనస్పెక్టర్లు ప్రభాకర్, మోహన్ ప్రసాద్ ,హేమంత్ కుమార్ రెడ్డి, శంకరరెడ్డి శాంతిలాల్, శివ గంగాధర్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైనా అధికారులు లంచం అడిగితే వెంటనే 14400 కాల్ సెంటర్ గానీ లేక 14400 అప్లికేషన్ ద్వారా తెలియజేయాలని కోరడమైనది .