టీటీడీలోని ట్రస్ట్‌లకు వివిధ సంస్థల నుండి రూ.3.20 కోట్లు ఆదివారం ఉదయం విరాళంగా అందింది. హైదరాబాదుకు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ గ్రూప్స్ సంస్థ యాజమాన్యం శ్రీ వెంకటేశ్వర్లు శ్రీ ప్రసాదరావు, శ్రీ రాజమౌళి ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటి రూపాయలు, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు రూ.1.20 కోట్లు, ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.60 లక్షలు అందించారు. అదేవిధంగా హైదరాబాదుకు చెందిన హానర్ హోమ్స్ సంస్థ యాజమాన్యం శ్రీ బాలచంద్ర, శ్రీ స్వప్న కుమార్ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.40 లక్షలు విరాళంగా అందించారు.తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి సంస్థ ప్రతినిధులు సంబంధిత డీడీలను అందజేశారు.