• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ ఏప్రిల్ 8న గ్రాండ్ రిలీజ్‌

admin by admin
March 26, 2022
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

సిరి మూవీస్ బ్యాన‌ర్‌పై ర‌మ‌ణ్ క‌థానాయ‌కుడిగా కె.శిరీషా ర‌మ‌ణా రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ . ఈ సినిమాను ఏప్రిల్ 8న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. ఎం.ర‌మేష్‌, గోపి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్రియాంక రౌరీ, పావ‌ని, అంకిత‌, వ‌ర్ష హీరోయిన్స్‌. సీనియ‌ర్ న‌టుడు వినోద్ కుమార్ విల‌న్‌గా న‌టించారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌, సాంగ్స్‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించాయి. టీజ‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్‌, పాట‌ల‌ను మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ విడుద‌ల చేసి యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. స్క్రీన్ మ్యాక్స్ పిక్చ‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుద‌ల చేస్తుంది. ఈ సంద‌ర్భంగా ..

హీరో ర‌మ‌ణ్ మాట్లాడుతూ – ‘‘రియ‌ల్ ఎస్టేట్ రంగంలో స‌క్సెస్ అయిన త‌ర్వాత సినీ రంగంలోకి అడుగు పెట్టి సిరి మూవీస్ బ్యాన‌ర్‌ను స్థాపించి అందులో తొలి ప్ర‌య‌త్నంగా ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ సినిమా చేశాం. ఇది పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్. అందరికీ సినిమా నచ్చుతుందనే నమ్మకముంది. మా సోదర సమానులైన దర్శకులు రమేష్, గోపి సినిమాను చక్కగా, ప్రతి ఒక్కరికీ నచ్చేలా రూపొందించారు. మా సినిమా టీజ‌ర్‌ను విడుదల చేసిన వి.వి.వినాయ‌క్‌గారికి పాటను విడుదల చేసి సపోర్ట్ అందించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి ధన్యవాదాలు. హైద‌రాబాద్‌, గోవా, రాయ‌ల‌సీమ ప్రాంతాల్లోని అంద‌మైన లొకేష‌న్స్‌లో సినిమా షూటింగ్ చేశాం. సినిమాటోగ్రాఫర్ ఎ.కె.ఆనంద్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ప్రముఖ సీనియ‌ర్ న‌టుడు వినోద్ కుమార్‌గారు విల‌న్‌గా చేశారు. ఏప్రిల్‌ 8న స్క్రీన్ మ్యాక్స్ సంస్థ మా సినిమాని గ్రాండ్‌గా థియేట‌ర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు. ఈ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది“ అన్నారు.

దర్శకులు ఎం. ర‌మేష్‌, గోపి మాట్లాడుతూ ‘‘సినిమా ఔట్ పుట్ బాగా వచ్చింది. రమణ్‌గారు వన్ మ్యాన్ షో చేశారు. మా కథను నమ్మి సినిమాను నిర్మించిన శిరీషా రమణారెడ్డిగారికి థాంక్స్. మ‌హిత్ నారాయ‌ణ్‌గారు అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. మీ అంద‌రి ఆశిర్వాదంతో ఏప్రిల్‌ 8న మీముందుకు వ‌స్తున్నాం. మీ అంద‌రి స‌పోర్ట్ ఉండాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

నటీనటులు:
ర‌మ‌ణ్‌, ప్రియాంక రౌరీ, పావ‌ని, అంకిత‌, వర్ష వినోద్ కుమార్‌, ర‌చ్చ ర‌వి, మిర్చి మాధ‌వి, జూనియ‌ర్ బాల‌కృష్ణ‌, శంక‌ర్‌, కృష్ణ‌, ప్ర‌కాష్ అడ్డా, వెంక‌ట్‌, సిద్ధు తది తరులు

సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ఎం. ర‌మేష్‌, గోపి
నిర్మాత‌: కె. శిరీషా ర‌మ‌ణారెడ్డి
బ్యాన‌ర్‌: సిరి మూవీస్‌
స‌మ‌ర్ప‌ణ‌: కొరివి పిచ్చిరెడ్డి, స‌ర‌స్వ‌తి
రిలీజ్‌: స్క్రీన్ మ్యాక్స్ పిక్చ‌ర్స్‌
సంగీతం: మ‌హిత్ నారాయ‌ణ్‌
బ్యాగ్రౌండ్ స్కోర్‌: శ్రీ‌వ‌సంత్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఎ.కె. ఆనంద్‌
ఎడిటింగ్‌: శ్రీ‌నివాస్ పి. బాబు, సంజీవ‌రెడ్డి
ఆర్ట్‌: న‌రేష్ సిహెచ్‌.
ఫైట్స్‌: అల్టిమేట్ శివ‌, కుంగ్‌ఫూ చంద్రు
కొరియోగ్ర‌ఫీ: చందు రామ్‌, రాజ్ పైడి, సాయిశివాజీ

Previous Post

‘అమితాబ్ బచ్చన్’ ఫస్ట్ లుక్, ట్రైలర్ విడుదల

Next Post

ఘనంగా బ్రైడల్ వెడ్డింగ్ వేర్ కలెక్షన్స్ “సూర్క్” బై ఆమ్రిన్ ఆస్రా స్టోర్ ను ప్రారంభించిన ఆనం మీర్జా

Next Post

ఘనంగా బ్రైడల్ వెడ్డింగ్ వేర్ కలెక్షన్స్ "సూర్క్" బై ఆమ్రిన్ ఆస్రా స్టోర్ ను ప్రారంభించిన ఆనం మీర్జా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఏప్రిల్ 17న  గ్రాండ్ గా ధియేటర్ లలో ‘కాల గమనం’  విడుదల
movies

ఏప్రిల్ 17న గ్రాండ్ గా ధియేటర్ లలో ‘కాల గమనం’ విడుదల

by admin
March 31, 2026
0

...

Read more
మే 22న థియేటర్స్  సందడి చెయ్యనున్న ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన  హార్రర్ త్రిల్లర్ చిత్రం “విచిత్ర”

మే 22న థియేటర్స్ సందడి చెయ్యనున్న ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన హార్రర్ త్రిల్లర్ చిత్రం “విచిత్ర”

March 29, 2026
దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాతో   జోరా వరల్డ్ ఆధ్వర్యంలో భారీ లైవ్ కాన్సర్ట్   ఈ నెల 28న

దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాతో జోరా వరల్డ్ ఆధ్వర్యంలో భారీ లైవ్ కాన్సర్ట్ ఈ నెల 28న

March 27, 2026
మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డ్స్ లో మన్యం ధీరుడు చిత్రం కి ఉత్తమ చిత్ర అవార్డు

మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డ్స్ లో మన్యం ధీరుడు చిత్రం కి ఉత్తమ చిత్ర అవార్డు

March 27, 2026
వారాహి సిల్వర్ జ్యువెలరీ ను ప్రారంభించిన సినీనటుడు తేజ సజ్జ, మరియు సినీనటి మీనాక్షి చౌదరి

వారాహి సిల్వర్ జ్యువెలరీ ను ప్రారంభించిన సినీనటుడు తేజ సజ్జ, మరియు సినీనటి మీనాక్షి చౌదరి

March 23, 2026
కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

March 21, 2026
ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

March 21, 2026
హైద్రాబాద్ లో రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ …

హైద్రాబాద్ లో రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ …

March 20, 2026
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో కొత్త సినిమా…

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో కొత్త సినిమా…

March 20, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In