• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

అధికారం కొంతమందికి నెత్తికెక్కింది…ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకే!

admin by admin
August 25, 2025
in politics, Special Photo
0 0
0
అధికారం కొంతమందికి నెత్తికెక్కింది…ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకే!
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేల వ్యవహారశైలి ఆ పార్టీ హైకమాండ్ కు చిక్కులు తెచ్చి పెడుతోంది. ఒకరి తర్వాత ఒకరు గీత దాటుతూనే ఉన్నారు. ఓ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలన్నదానిపై వారు కనీస అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయడం లేదు. అధికారం చేతికి వచ్చిందన్న అహంకారంతో పాటు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు సైలెంటుగా ఉంటూండటంతో తమకు ఎదురు లేదని వారు రెచ్చిపోతున్నారు. దాదాపుగా పదిహేను మంది ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకున్నారు. వారందరికీ గట్టి వార్నింగులు ఇచ్చారు.

సీనియర్ ఎమ్మెల్యేలకు రాజకీయంపై కాస్త అవగాహన ఉంది. గెలవకముందు ఎలా ఉన్నా.. గెలిచిన తర్వాత మాత్రం ప్రజల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వారికి క్లారిటీ ఉంది. అలాగే నియోజకవర్గానికి తానే రాజు అన్నట్లుగా వ్యవహరించకుండా.. ప్రజా జీవితాల్లో చొరబడకుండా…. ఎంత వరకు రాజకీయం చేయాలో అంత వరకే రాజకీయం చేస్తున్నారు. వారి విషయంలో అంతా స్మూత్ గా జరిగిపోతున్నా… వివిధ కారణాలతో మొదటి సారి అవకాశం దక్కించుకున్న వారు.. గాలిలో గెలిచేశారు. అలా గెలిచినవారికి అధికారం నెత్తికెక్కుతోంది.

అధికారం కొత్త – జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి!

ఫోన్లలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం రాజకీయ నేతలకు చేటు చేస్తుంది. అనంతపురం ఎమ్మల్యే మద్యం మత్తులో ఏదో వాగాడు. దాన్ని అవతల వాళ్లు వ్యూహాత్మకంగా రికార్డు చేశారు. ఆ ఎమ్మెల్యే మద్యం మత్తులో ఉన్నప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని సొంత పార్టీ నేతలు అంటూంటారు. ఆయన తరహాలోనే పలువురు ఎమ్మెల్యేలు తాము చేస్తున్న పనులపై నియంత్రణ కోల్పోతున్నారు. పార్టీకి చెడ్డపేరు తీసుకువస్తున్నారు. వీరిలో కొంత మంది అవినీతికి పాల్పడుతూంటే.. మరికొంత మంది వ్యక్తిగత వ్యవహారాలతో చెడ్డపేరు తెచ్చుకుంటున్నారు.

మారకపోతే ఫస్ట్ టైమే .. లాస్ట్ టైమ్!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి ఒక్కరికి ఒకటి, రెండు అవకాశాలు ఇస్తారు. దిద్దుకోగలిగిన తప్పులు చేసినప్పుడు దిద్దుకునే అవకాశం ఇస్తారు, హెచ్చరికలు చేసినంత కాలం చేస్తారు. మార్పు లేదంటే ఆయన వదిలేస్తారు. ఇక పట్టించుకోరు. తర్వాత ఎంత ఒత్తిడి చేసినా.. వారికి మరో అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు ఏ మాత్రం ఆసక్తి చూపించరు. అప్పటికీ కాని అలాంటి వారికి ఏం జరిగిందో అర్థం కాదు. తొలి సారితోనే రాజకీయ భవిష్యత్ అంతమైపోతుంది.

Previous Post

ఎంగేజింగ్ సైటిఫిక్ థ్రిల్లర్… మాతృ

Next Post

సుకుమార్ రైటింగ్స్ లో కిరణ్ అబ్బవరం!

Next Post
సుకుమార్ రైటింగ్స్ లో కిరణ్ అబ్బవరం!

సుకుమార్ రైటింగ్స్ లో కిరణ్ అబ్బవరం!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…
movies

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

by admin
May 31, 2026
0

...

Read more
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

May 31, 2026
జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

May 25, 2026
వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

May 23, 2026
మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

May 22, 2026
ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

May 19, 2026
నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

May 19, 2026
ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

May 16, 2026
తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

May 11, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In